IPL 2022: ఆర్‌సీబీ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్! ఆ నలుగురు కలిస్తే ప్రత్యర్థి జట్లకు దబిడి దిబిడే!

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగే ఆర్‌సీబీ కెప్టెన్‌గా తనకు చివరిదని, ఆ తర్వాత ఆటగాడిగానే జట్టులో కొనసాగుతానని ఓ వీడియో ద్వారా వెల్లడించాడు. దాంతో ఆర్‌సీబీ తదుపరి కెప్టెన్ ఎవరా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా రెండు జట్లు వచ్చి చేరుతుండటం.. మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఆర్‌సీబీని నడిపించే ఆటగాడు ఎవరా? అనే చర్చ ఊపందుకుంది. ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఆర్‌సీబీ కెప్టెన్ ఎవరైతే బాగుంటుందనేదానిపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.ఆర్‌సీబీ తదుపరి కెప్టెన్‌గా ప్రధానంగా ఏబీ డివిలియర్స్ పేరు వినిపిస్తున్నా.. వయసు రీత్యా అతను వచ్చే సీజన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ ఆడినా అతను సరైన ఎంపిక కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ఆర్‌సీబీ కెప్టెన్‌గా వార్నర్..
ఈ నేపథ్యంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ టీమ్‌లోనే ఉన్న వార్నర్.. ఈ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఆ వైఫల్యంతోనే సీజన్ మధ్యలో కెప్టెన్సీ కోల్పోయాడు. సెకండాఫ్‌లో కూడా అదే పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. దాంతో సన్‌రైజర్స్ వార్నర్‌ర్‌ను వదులుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మెగా వేలం నిబంధనల ప్రకారం నలుగురు ఆటగాళ్లనే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరు విదేశీ, మరో ఇద్దరు స్వదేశీ లేదా ముగ్గురు స్వదేశీ, ఒకరు విదేశీ ఆటగాళ్లను అంటిపెట్టుకోవచ్చు. సన్‌రైజర్స్ విదేశీ ఆటగాళ్ల కోటాలో కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్‌ను రిటైన్ చేసుకుంటుంది. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా వార్నర్‌ను వేలంలోకి వదిలేస్తుంది.

డేవిడ్ వార్నరే సరైనోడు..
అదే జరిగితే.. డేవిడ్ వార్నర్ కోసం ఆర్‌సీబీ ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. తమ సారథిగా నియమించుకునేందుకు వేలంలో ఎన్ని కోట్ల అయినా కుమ్మరిస్తోంది. వార్నర్ కోసం.. ఈ సీజన్ వేలంలో మ్యాక్సీకి ఉపయోగించిన స్ట్రాటజీనే వాడనుంది. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా వార్నర్ ఆర్‌సీబీ జట్టుకు సరిగ్గా సరిపోతాడని ఇప్పటికే సంజయ్ మంజ్రేకర్ వంటి మాజీ ఆటగాళ్లన్నారు. డేయిల్ స్టెయిన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్‌లతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ను ఒకసారి ఛాంపియన్‌గా నిలబెట్టిన తర్వాత ప్రతిసారీ ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లిన డేవిడ్ వార్నర్ కూడా కోహ్లీ టీమ్‌కు కెప్టెన్‌గా సరిపోతాడు'అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

ఒక్క వార్నర్.. మూడు సమస్యలకు చెక్!
ఇక వార్నర్ ఆర్‌సీబీ జట్టులో చేరితో మూడు సమస్యలు సాల్వ్ అవుతాయని విశ్లేషకులు అంటున్నారు. వార్నర్ రాకతో ఓపెనింగ్ సమస్యతో పాటు కెప్టెన్ ఎవరా? అనే బాధ ఆ జట్టుకు తప్పుతుందంటున్నారు. అంతేకాకుండా ఆర్‌సీబీ బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా తయారవుతుందని చెబతున్నారు. 'ప్రస్తుతం పడిక్కల్, కోహ్లీ ఓపెనర్లుగా రాణిస్తున్నా.. వారు ఒకే తరహా బ్యాట్స్‌మన్. దాంతో ధాటిగా ఆడలేకపోతున్నారు. అదే వార్నర్ పడిక్కల్‌కు జత కలిస్తే.. ఇప్పటికన్నా మంచి ఆరంభాలు దక్కుతాయి. పడిక్కల్ క్లాస్ ఇన్నింగ్స్‌కు వార్నర్ విధ్వంసం తోడైతే ఆర్‌సీబీకి తిరుగుండదు'అని ఓ మాజీ క్రికెట్ అభిప్రాయపడ్డాడు.

పరుగుల విధ్వంసమే..
వార్నర్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే కోహ్లీ మిడిలార్డర్‌లోకి వస్తాడని, అప్పుడు బ్యాటింగ్ బలం పెరుగుతుందంటున్నారు. ఆ తర్వాత గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ చెలరేగుతారని చెబుతున్నారు. వార్నర్, కోహ్లీ, మ్యాక్సీ, ఏబీ డివిలియర్స్‌ల ఆటతో మైదానంలో పరుగుల విధ్వంసం ఉంటుందని, ప్రత్యర్థులకు చుక్కలేనని చెబుతున్నారు. ఇక రిటైన్ పాలసీ ప్రకారం ఆర్‌సీబీ.. కెప్టెన్ కోహ్లీతో పాటు యువ ప్లేయర్ పడిక్కల్‌ను.. విదేశీ కోటాలో మ్యాక్స్‌వెల్ ఏబీడిలను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఏబీ డివిలియర్స్ వచ్చే సీజన్ ఆడుతాడా? అనేదానిపై సందేహాలున్నాయి. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ గనుక టైటిల్ గెలిస్తే అతను సగర్వంగా రిటైర్మంట్ పలకవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications