IPL 2022 Mega Auction: అహ్మదాబాద్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. నయా ఫ్రాంచైజీ ఎంచుకునేది ఆ ముగ్గురినే!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు కీలక ఘట్టమైన ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. గత మంగళవారమే పాత ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించాయి. కొన్ని అనూహ్యాలు... మరికొన్ని ఆశ్చర్యకర నిర్ణయాలు... మొత్తంగా చూస్తే అంచనాలకు అనుగుణంగానే ఈ రిటెన్షన్ ప్రక్రియ సాగింది. సుదీర్ఘ కాలంగా తమ విజయాల్లో భాగంగా ఉన్న కొందరు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు నమ్మకం పెట్టుకోగా, మరికొందరిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొనసాగించేందుకు సిద్ధపడ్డాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ బంధం ముగియగా, ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను వదిలేసింది.
డుప్లెసిస్‌కంటే మొయిన్ అలీ వైపే చెన్నై సూపర్ కింగ్స్ మొగ్గు చూపగా, పొలార్డ్‌లో ఇంకా పవర్ మిగిలి ఉందని ముంబై నమ్మింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా గిల్‌లాంటి కుర్రాడిని కాదని రసెల్‌లాంటి వెటరన్‌కే ప్రాధాన్యత ఇచ్చింది. పంజాబ్ కింగ్స్‌ను కేఎల్ రాహుల్ విడిచిపెట్టగా.. చాహల్‌ను ఆర్‌సీబీ వదిలేసింది. ఇక రిటెన్షన్ ప్రక్రియ ముగియడంతో కొత్తగా వచ్చిన రెండు జట్లు ఎంచుకునే ఆటగాళ్లు ఎవరు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కొత్తగా వచ్చిన రెండు జట్లు..
కొత్త జట్లలో అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సీవీసి క్యాపిటల్స్ రూ.5625 కోట్లుకు దక్కించుకోగా.. లక్నో బేస్ టీమ్‌ను రూ. 7090 కోట్లకు గోయెంక గ్రూప్‌కు చెందిన ఆర్‌పీఎస్‌జీ సొంతం చేసుకుంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా.. మిగిలిన ఆటగాళ్లలో నుంచి కొత్త ఫ్రాంచైజీలు ముగ్గురేసి ఆటగాళ్లను నేరుగా ఎంచుకోవచ్చు.
దానికి రూ.90 కోట్ల టీమ్ పర్స్ నుంచి రూ.33 కోట్లు ఖర్చు చేయాలి. అంతేకాకుండా తొలి ఆటగాడికి రూ.15 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 11 కోట్లు, మూడో ఆటగాడికి రూ.7 కోట్లు చెల్లించాలి. అయితే ఈ సాలరీ రూల్స్‌పై స్పష్టత లేదు. ముగ్గురిని తీసుకుంటే ఇలా ఉండాలన్నారు. కానీ ఒక్కరిని, ఇద్దరిని తీసుకుంటే ఏంటనేది చెప్పలేదు. ఇక ఈ పికప్ జాబితాను సమర్పించేందుకు బీసీసీఐ డిసెంబర్ 25గా డెడ్‌లైన్ విధించింది.

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..
ఇక అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీ తమ టీమ్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ యువ ఆటగాడితో ఒప్పందం చేసుకుందని ప్రచారం జరుగుతుంది. ఇక గాయంతో ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాప్‌కు దూరమైన అయ్యర్.. సెకండాఫ్‌కు తిరిగొచ్చినా కెప్టెన్సీ దక్కలేదు. అయ్యర్ గైర్హాజరీలో జట్టును నడిపించిన పంత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
దాంతో ఢిల్లీ యాజమాన్యం అతన్నే కెప్టెన్‌గా కొనసాగించింది. ఇక కెప్టెన్సీ కోల్పోవడంతో ఆ జట్టులో ఉండేందుకు ఇష్టపడని అయ్యర్.. నయా ఫ్రాంచైజీ అయిన అహ్మదాబాద్‌కు కెప్టెన్‌గా ఉండేందుకు సుముఖంగా ఉన్నట్లు అతని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. రూ. 15 కోట్ల భారీ ధరకు అయ్యర్‌ను అహ్మదాబ్ పికప్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

కగిసో రబడా..
ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసిన సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడాను కూడా తీసుకునేందుకు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతనితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అతన్ని జట్టులోకి తీసుకొచ్చేందుకు భారీ ధరనే ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఐపీఎల్ 2020 సీజన్‌లో 30 వికెట్లతో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచిన రబడా.. ఐపీఎల్ 2021 సీజన్‌లో మాత్రం 15 వికెట్లు మాత్రమే తీశాడు.
దాంతోనే రబడాను కాదని ఢిల్లీ.. అన్రిచో నోర్జ్‌ను రిటైన్ చేసుకుంది. ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో రూ.4.2 కోట్ల వేతనం మాత్రమే అందుకున్న రబడా.. ఈ సారి దానికంటే ఎక్కువ అందుకోనున్నాడు. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ అతనికి ఏకంగా రూ.10 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

హర్షల్ పటేల్, శిఖర్ ధావన్..
మూడో ప్లేయర్‌గా హర్షల్ పటేల్, శిఖర్ ధావన్‌లో ఒకరిని తీసుకునేందుకు అహ్మదాద్ ఫ్రాంచైజీ ప్రయత్నిస్తోంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో హర్షల్ పటేల్ 32 వికెట్లతో హయ్యెస్ట్ వికెట్ టేకర్ నిలిచాడు. అయినా అతన్ని ఆర్‌సీబీ వేలంలోకి వదిలేసింది. దాంతో హర్షల్ పటేల్‌ను తీసుకునేందుకు అహ్మాదాబాద్ ప్రయత్నిస్తోంది.
రూ.7 కోట్లు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామని అతనికి తెలిపినట్లు సమాచారం. ఇక హర్షల్ పటేల్‌తో ఒప్పందం కుదరకపోతే స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తీసుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. టీ20 ఫార్మాట్‌లో అతని అనుభవం జట్టుకు కలిసొస్తుందని భావిస్తోంది. ఇక వయసు దృష్ట్యా శిఖర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications