
హయ్యెస్ట్ వికెట్ టేకర్‌కు నో చాన్స్..
కెప్టెన్ విరాట్ కోహ్లీని ఫస్ట్ స్లాబ్ ప్లేయర్‌గా రూ.15 కోట్లకే రిటైన్ చేసుకున్న ఆర్‌సీబీ.. మ్యాక్స్‌వెల్‌కు రూ.11 కోట్లు, మహమ్మద్ సిరాజ్‌కు రూ.7 కోట్లకు అంటిపెట్టుకుంది. ఆశ్చర్యకరంగా తమ జట్టుకు ఎన్నో ఏళ్లుగా ఆడుతున్న టీమిండియా స్టార్ స్పిన్నర్, ఆర్‌సీబీ హయ్యెస్ట్ వికెట్ టేకర్ యుజ్వేంద్ర చాహల్‌తో పాటు ఐపీఎల్ 2021 సీజన్‌లో 30 వికెట్లతో సత్తా చాటిన హర్షల్ పటేల్‌ను వదులుకుంది. రిటెన్షన్ ప్రక్రియ ముగిసేవరకు ఆర్‌సీబీ జాబితాలో చాహల్ ఉంటాడని అంతా భావించారు. కానీ ఆర్‌సీబీ చాహల్‌ను వేలంలోకి వదిలేసింది. అంతేకాకుండా యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌ను రిటైన్ చేసుకోలేదు.

డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడంతో..
2013లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన చాహల్.. ఆ మరుసటి ఏడాది ఆర్‌సీబీకి మారాడు. అప్పటి నుంచి ఐపీఎల్ 2021 సీజన్ వరకు ఆర్‌సీబీకే ప్రాతినిథ్యం వహించాడు. 114 మ్యాచ్‌ల్లో 7.59 ఎకానమీతో 139 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన(4/25). ఆర్‌సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ చాహలే. అయితే అలాంటి చాహల్‌ను ఆర్‌సీబీ వదులుకోవడానికి ప్రధాన కారణం అతను ఎక్కువ డబ్బులు ఆశించడమేనని తెలుస్తోంది.
రిటెన్షన్ రూల్స్ ప్రకారం నలుగురు ఆటగాళ్లను తీసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు రూ.6 కోట్లు చెల్లించాలి. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్ తొలి రెండు స్లాబ్‌ల్లో ఫిట్ అవ్వడంతో చివరి రెండు స్లాబ్‌ల్లో రిటైన్ అయ్యేందుకు చాహల్ ఇష్టపడలేదట. దాంతో ఆర్‌సీబీ అతన్ని వదులుకుంది.

చిన్నస్వామిలో చితక్కొడుతారని..
ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో స్టన్నింగ్ పెర్ఫామెన్స్‌తో ఆర్‌సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన హర్షల్ పటేల్‌ను కూడా వదులుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన హర్షల్ పటేల్ 8.14 ఎకానమీతో 32 వికెట్లు తీశాడు. 2012 నుంచి ఐపీఎల్ ఆడుతున్న హర్షల్ పటేల్.. ఇప్పటి వరకు 63 మ్యాచ్‌లు ఆడి 78 వికెట్లు తీసాడు. ఇటీవల భారత్ తరఫున కూడా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన హర్షల్‌ను ఆర్‌సీబీ వదులుకోవడం పిచ్చి నిర్ణయమనే విమర్శలు కూడా వచ్చాయి.
అయితే వచ్చే సీజన్‌తో పాటు భవిష్యత్తులో కూడా భారత్ వేదికగానే ఐపీఎల్ జరగనుండటంతో ఆర్‌సీబీ హర్షల్ పటేల్‌ను వదులుకున్నట్లు తెలుస్తోంది. తమ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం హర్షల్ పటేల్ బౌలింగ్ శైలికి సెట్ కాదని, బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై అతని బౌలింగ్‌ను చితక్కొడుతారని భావించే అతన్ని వదులుకుందంట. చెన్నై, దుబాయ్ వంటి నెమ్మదైన పిచ్‌లపైనే కట్టర్స్, స్లోయర్స్‌తో హర్షల్ రాణించగలడని, బ్యాటింగ్ ట్రాక్‌లో ఎఫెక్టివ్‌గా ఉండడని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

క్వికర్ బౌలర్ కావడంతోనే..
ఇక మహమ్మద్ సిరాజ్ ఆట గత కొంతకాలంగా ఎంతో మెరుగైంది. పైగా అతను క్వికర్ బౌలర్. స్వింగ్‌తో పాటు పేస్ రాబట్టగలడు. డెత్ ఓవర్‌లో కూడా చాటా కట్టడిగా బౌలింగ్ చేస్తున్నాడు. దాంతోనే సిరాజ్‌ను తీసుకోవాలని ఆర్‌సీబీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున క్యాంపైన్ చేశారు. అంతేకాకుండా సిరాజ్‌కు లక్నో ఫ్రాంచైజీ రూ.10 కోట్ల ఆఫరిచ్చినా అతను ఆర్‌సీబీకే ఆడతానని చెప్పాడు. పైగా కోహ్లీ సపోర్ట్ కూడా ఉండటంతో ఆర్‌సీబీ.. హర్షల్ పటేల్‌ను కాదని సిరాజ్‌ను రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. 6.78 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు 50 మ్యాచ్‌లు ఆడి.. 50 వికెట్లు తీశాడు.


Click it and Unblock the Notifications












