Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022 Mega Auction:అదే జరిగితే.. రషీద్ ఖాన్‌పై నిషేధం!

IPL 2022 Mega Auction: Rashid Khan Might Get Banned For THIS Reason!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. ఎనిమిది పాత జట్లలో కొనసాగే ప్లేయర్లెవరో క్లారిటీ వచ్చింది. ప్లేయర్ రిటెన్షన్ పాలసీ లిస్ట్ మంగళవారం రాత్రి రిలీజ్ అయింది. ఐపీఎల్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను వారి ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోగా.. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ వార్నర్, రషీధ్ ఖాన్ వంటి స్టార్లతో పాటు కీలక ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. ఈ క్రమంలో కొన్ని ఫ్రాంచైజీలు యాక్షన్‌కు ముందే కొంతమందిపై కోట్ల వర్షం కురిపించాయి. టీమ్‌కు నలుగురికి చొప్పున 32 మందికి అవకాశం ఉన్నప్పటికీ ఎనిమిది టీమ్స్ కలిపి 27 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి.

రషీద్ ఖాన్‌పై ఫిర్యాదు..

రషీద్ ఖాన్‌పై ఫిర్యాదు..

అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌పై భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఫిర్యాదు చేసింది. రషీద్ ఖాన్ నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్ట్‌లో ఉండగానే ఇతర జట్లతో సంప్రదింపులు జరపాడని అతనిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.

ఈ మేరకు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ ఓ కథనాన్ని కూడా ప్రచురించింది.రషీద్ ఖాన్‌తో పాటు కేఎల్ రాహుల్‌ను కూడా కొత్తగా వచ్చిన లక్నో ఫ్రాంచైజీ ప్రలోభాలకు గురిచేసిందని, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఫ్రాంచైజీల ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

కండిషన్స్‌తో చేజారిన రషీద్..

కండిషన్స్‌తో చేజారిన రషీద్..

రషీద్ ఖాన్.. తనను ఫస్ట్ స్లాబ్ ప్లేయర్‌గా (రూ.16 లేదా రూ.14 కోట్లు) రిటైన్ చేసుకోవాలనే కండీషన్ పెట్టాడని, బేరాల్లేవి లేవని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు స్పష్టం చేసినట్లు ఆ ఫ్రాంచైజీ వర్గాలు పేర్కొన్నాయి. తాము సెకండ్ స్లాబ్ ప్లేయర్‌గా రూ.12 కోట్లు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామని సన్‌రైజర్స్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా.. రషీద్ ఒప్పుకోలేదని ప్రచారం జరుగుతుంది.

మరో సన్‌రైజర్స్ తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించే సమయంలో రషీద్ ఖాన్ పేరును పరోక్షంగా ప్రస్తావించింది. వేలంలోకి వెళ్తామని పట్టుబట్టడంతో ఏం చేయలేకపోయామని పేర్కొంది. ఈ క్రమంలోనే రషీద్ ఖాన్‌పై సన్‌రైజర్స్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

లక్నో ప్రలోభాలకు గురి చేసిందని..

లక్నో ప్రలోభాలకు గురి చేసిందని..

కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్ తమ ఫ్రాంచైజీలను వీడేలా లక్నో అనైతిక చర్యలకు పాల్పడుతుందని పంజాబ్, హైదరాబాద్ బీసీసీఐ దృష్టికి తీసుకొచ్చాయని బోర్డుకు చెందిన ఓ అధికారి కూడా తెలిపాడు. అయితే అధికారికంగా ఫిర్యాదు చేయలేదన్నాడు. 'లెటర్ ద్వారా ఎలాంటి ఫిర్యాదు అందుకోలేదు కానీ నోటి మాట ద్వారా లక్నో టీమ్ తమ ఆటగాళ్లకు గాలం వేస్తుందని పాత ఫ్రాంచైజీలు మా దృష్టికి తీసుకు వచ్చాయి.

మేం దీనిపై దృష్టిసారించాం. వారు అనైతిక చర్యలకు పాల్పడ్డారని నిరూపితమైతే నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటాం. తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఇలా చేయడం ఏ మాత్రం భావ్యం కాదు'అని సదరు అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్ వెబ్‌సైట్‌కు తెలిపాడు.

అప్పట్లో జడేజాపై నిషేధం..

అప్పట్లో జడేజాపై నిషేధం..

కేఎల్ రాహుల్‌కు రూ. 20 కోట్లు, రషీద్‌ ఖాన్‌కు రూ. 16 కోట్లు ముట్టజెప్పేందుకు లక్నో అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగానే రాహుల్‌, రషీద్‌ నిబంధనలకు విరుద్ధంగా కొత్త ఫ్రాంఛైజీతో ఒప్పందాలు చేసుకున్నట్లు నిరూపితమైతే వారిపై లీగ్ నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. అదే జరిగితే ఏడాది పాటు క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు దూరం కావాల్సి ఉంటుంది.

రిటెన్షన్ ప్రక్రియ ముగిసేవరకు ఆయా జట్లలోని ఆటగాళ్లు ఇతర ఫ్రాంచైజీలతో చర్చలు జరపడం నిబంధనలకు వ్యతిరేకం. రిటెన్షన్ ప్రక్రియ ముగిసే వరకు సదరు ఆటగాళ్లంతా ఆయా టీమ్స్ కాంట్రాక్టులో ఉన్నట్లే. 2010‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న రవీంద్ర జడేజా ఇలానే ఇతర ఫ్రాంచైజీలతో మాట్లాడి ఏడాది పాటు నిషేదానికి గురయ్యాడు.

Story first published: Wednesday, December 1, 2021, 14:35 [IST]
Other articles published on Dec 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+