
అన్ సోల్డ్ లిస్ట్ కామన్..
కొత్తగా వచ్చిన జట్లు డిసెంబర్ 25లోపు 'పిక్ అప్' ఆప్షన్ కింద వేలానికి అందుబాటులో ఉన్న ఆటగాళ్ల నుంచి ముగ్గురిని తీసుకోనున్నాయి. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం జనవరి తొలి వారంలో మెగావేలం నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి భావిస్తోంది. ఇప్పటికే మెగావేలానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఫ్రాంచైజీలు.. ఆటగాళ్ల విషయంలో ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక ప్రతీ క్రికెటర్ తమ జీవితంలో ఒక్కసారైన ఐపీఎల్ ఆడాలని కలలు కంటాడు.
ఆ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లంతా ఈ లీగ్ వేలంలో పాల్గొంటారు. ఇందులో నుంచి ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను ఎంచుకుంటాయి. ఈసారి జట్ల సంఖ్య పదికి చేరడంతో మరో 44 మంది ఆటగాళ్లకు అదనంగా అవకాశం దక్కనుంది.ఇక ప్రతీ ఏడాదిలానే ఈసారి కూడా అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా ఉంటుంది. ఎప్పటిలానే ఆ లిస్ట్‌లో స్టార్ ప్లేయర్లు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈసారి అన్‌సోల్ట్ లిస్ట్‌లో నిలిచే ఆటగాళ్లపై ఓలుక్కెద్దాం.

క్రిస్ గేల్‌కు నిరాశే..
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్‌కు ఈ సారి నిరాశ తప్పేలా లేదు. అతని వయసు, పేలవ ఫామ్ దృష్ట్యా ఫ్రాంచైజీలు ఈ యూనివర్స్ బాస్‌పై పెద్దగా ఆసక్తి కనబర్చకపోవచ్చు. ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఈ విండీస్ వీరుడికి.. ఈసారి అన్‌సోల్ట్ లిస్ట్‌లో నెంబర్ వన్ దక్కనుంది. ఐపీఎల్‌లో వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్ 175 నాటౌట్, 6 సెంచరీలు వంటి యూనిక్ రికార్డులున్నా..42 ఏళ్ల గేల్‌ను తీసుకునే రిస్క్ ఫ్రాంచైజీలు చేయకపోవచ్చు.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 142 మ్యాచ్‌లు ఆడిన గేల్ 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో 4965 రన్స్ చేశాడు. ఐపీఎల్ 2020 వేలంలో కూడా గేల్ అన్‌సోల్డ్ లిస్ట్‌లో నిలవగా.. అనంతరం పంజాబ్ తీసుకుంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన గేల్ 193 రన్స్ మాత్రమే చేసి.. బబుల్ ఇబ్బందుల కారణంగా మధ్యలో వైదొలిగాడు.

చతేశ్వర్ పుజారా, విహారీలకు నో చాన్స్..
టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా, హనుమ విహారీలు కూడా ఈసారి అన్‌సోల్డ్ లిస్ట్‌లో నిలవనున్నారు. గత సీజన్‌లో చతేశ్వర్ పుజారాను చెన్నై సూపర్ కింగ్స్ కరుణించినా.. విహారిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. పుజారా తన బేస్ ప్రైజ్ దక్కించుకోవడంతో.. ధోనీ సూచనల మేరకు చెన్నై తీసుకుంది. కానీ తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే టెస్ట్ స్పెషలిస్ట్ అయిన పుజారా.. సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా విఫలమవుతున్నాడు. టీమిండియాలో కూడా చోటు గల్లంతయ్యే పరిస్థితిని తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ సారి అతనిపై ఎ వరూ కూడా దయచూపలేరు. ఇక హనుమ విహారీకి కూడా పెద్దగా అవకాశాలు రాలేదు.

క్రిస్టియన్, ఫించ్ కూడా..
క్రిస్ గేల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారీలతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన డానియల్ క్రిస్టియన్, ఆరోన్ ఫించ్‌లు కూడా అన్‌సోల్డ్ లిస్ట్‌లోనే నిలవనున్నారు. ఆరోన్ ఫించ్‌కు ఈ సీజన్‌లోనే షాక్ తగలగా.. క్రిస్టియన్ ఆర్‌సీబీ తరఫున రీఎంట్రీ ఇచ్చాడు. కానీ చెత్తాటతో ప్లేఆఫ్స్‌లో ఆర్‌సీబీ ఓటమికి కారణమయ్యాడు. దాంతో అతనికి ఈసారినిరాశే ఎదురవ్వనుంది. ఇక ఇంగ్లండ్‌కు చెందిన అలెక్స్ హేల్స్, కివీస్‌కు చెందిన కొలిన్ మున్రో, సౌతాఫ్రికా ఆటగాడు హెన్రీక్లాసెన్, బంగ్లాదేశ్ సీనియర్ ముస్తాఫికర్ రహీమ్, శ్రీలంక ఆల్‌రౌండర్ కుసాల్ పెరీరాలు కూడా అన్‌సోల్డ్ లిస్ట్‌లోనే మిగిలిపోనున్నారు.


Click it and Unblock the Notifications












