For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022 Mega Auction: సన్‌రైజర్స్‌కు కేన్ మామ ఒక్కడే.. ఫ్రాంచైజీల రిటెన్షన్ పూర్తి జాబితా ఇదే!

IPL 2022 Mega Auction: Kane Williamson Only Player Retained For SRH And Full List Is Here
IPL 2022 Retention : Retained Players List | Mega Auction || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్ మెగా వేలానికి టైమ్ దగ్గరపడుతుండటంతో ఆయా ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను సిద్దం చేసుకున్నాయి. ఐపీఎల్ విస్తరించాలనే లక్ష్యంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొత్తగా రెండు జట్లను తీసుకురావడంతో మేగా వేలం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కొత్త జట్ల ప్రక్రియను పూర్తి చేసిన భారత క్రికెట్ బోర్డు భారీ ధరకు రెండు ఫ్రాంచైజీ హక్కులను కట్టబెట్టింది.

అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సీవీసి క్యాపిటల్స్ రూ.5625 కోట్లుకు దక్కించుకోగా.. లక్నో బేస్ టీమ్‌ను రూ. 7090 కోట్లకు ఆర్‌పీఎస్‌జీ సొంతం చేసుకుంది. కొత్త జట్ల ఎంపిక కూడా పూర్తవ్వడంతో మెగా వేలం నిర్వహణపై బీసీసీఐ దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని సిద్దం చేసి ఫ్రాంచైజీలకు అందజేసింది. నవంబర్ 30లోపు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించాలని ఆదేశించింది.

నేటి(మంగళవారం) మధ్యాహ్నం 12లోపు ఈ జాబితాను సమర్పించాల్సి ఉంది. అయితే ఆయా ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను ఇప్పటికే పూర్తి చేసుకొని బోర్డుకు సమర్పించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈఎస్‌పీఎన్‌ క్రిక్ఇన్‌ఫో పేర్కొంది.

 కేన్ మామ ఒక్కడే..

కేన్ మామ ఒక్కడే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్కడినే రిటైన్ చేసుకుంది. మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో ఉన్న బేధాభిప్రాయాల నేపథ్యంలో అతన్ని పట్టించుకోని ఆరెంజ్ ఆర్మీ.. రషీద్ ఖాన్‌ను అంటిపెట్టుకోవాలని భావించినప్పటికీ అతను భారీగా డబ్బు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో అతన్ని కూడా వదిలేసి కేన్ మామతో సరిపెట్టుకుంది.

ముంబై ఇండియన్స్ సైతం రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా ఇద్దరినే రిటైన్ చేసుకుంది. కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌ల పేర్లు వినిపించినా ఆ ఫ్రాంచైజీ వేలానికే మొగ్గు చూపింది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నాయి.

స్టార్ ఆటగాళ్లకు షాక్..

స్టార్ ఆటగాళ్లకు షాక్..

కోల్‌కతా సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తీతో పాటు వెంకటేశ్ అయ్యర్‌ను తీసుకుంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌, దినేశ్ కార్తీక్‌లను ఆ జట్టు వదిలేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను మాత్రమే తీసుకుంది. దేవదత్ పడిక్కల్ పేరు వినిపించినా ఫ్రాంచైజీ వేలానికే మొగ్గు చూపింది. ఢిల్లీ క్యాపిటల్స్ రిషభ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జ్‌లను అంటిపెట్టుకుంది.

స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో పాటు మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కగిసో రబడాలను ఆ జట్టు వదులుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్‌ను ఒక్కడినే రిటైన్ చేసుకోవడం గమనార్హం. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌, బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను వదులుకోవడం విశేషం. ఇక కేఎల్ రాహుల్ జట్టు వీడటంతో తీవ్ర అసంతృప్తికి గురైన పంజాబ్ కింగ్స్ ఒక్క ఆటగాడిని కూడా రిటైన్ చేసుకోలేదు.

ఫ్రాంచైజీల రిటెన్షన్ పూర్తి జాబితా..

ఫ్రాంచైజీల రిటెన్షన్ పూర్తి జాబితా..

చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ

కోల్‌కతా నైట్‌రైడర్స్: సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తీ, వెంకటేశ్ అయ్యర్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్

ఢిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జ్

రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్

పంజాబ్ కింగ్స్: ఒక్కరిని కూడా రిటైన్ చేసుకోలేదు

రిటెన్షన్ రూల్స్ ఇవే..

రిటెన్షన్ రూల్స్ ఇవే..

బీసీసీఐ రూపొందించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం పాత ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. అన్ క్యాప్‌డ్ ప్లేయర్స్ ఇద్దరిని మించకూడదు. జీత భత్యాల్లో కూడా రూల్స్ పాటించాలి.

నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌‌కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు రూ.6 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఫ్రాంచైజీలు రూ.90 కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. ఈ రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిన ఆటగాళ్ల నుంచి కొత్త జట్లు 'పిక్ అప్'ఆప్షన్ కింద ముగ్గురిని ఎంచుకోవచ్చు.

Story first published: Tuesday, November 30, 2021, 9:40 [IST]
Other articles published on Nov 30, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+