
పర్స్ వాల్యూ రూ.90 కోట్లు..
మెగావేలంలో నేపథ్యంలో ఆటగాళ్ల రిటైన్ పాలసీని కూడా రూపొందించి ఓ బ్లూ ప్రింట్‌ను సిద్దం చేసింది. దీనిక ప్రకారం ఫ్రాంఛైజీలకి గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లని రిటైన్ చేసుకునే వెసులబాటు ఉంటుంది. ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు, ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండొచ్చు. ఒకవేళ ముగ్గురు ప్లేయర్లనే ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకుంటే వారి సాలరీ రూ.15, రూ.11, రూ.7 కోట్లుగా ఉండనుంది.
ఒకవేళ ఇద్దరినే రిటైన్ చేసుకుంటే రూ.12.5, రూ.8.5 కోట్లు, ఒకవేళ ఒక్కరినే తీసుకుంటే అప్పుడు రూ.12.5 కోట్లు ఆ ప్లేయర్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఫ్రాంఛైజీల పర్స్ వాల్యూని రూ.5 కోట్లు పెంచారు. దాంతో.. ప్రతి ఫ్రాంఛైజీ పర్స్‌వాల్యూ రూ.90 కోట్లకి పెరగనుంది. వేలంలో ఈ పర్స్ వాల్యూలో కనీసం 75% కచ్చితంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాంతో తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించేందుకు ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి.

వార్నర్‌పై కన్నేసిన ఫ్రాంచైజీలు..
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మెగా వేలంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్‌లో దారుణంగా విఫలమైన వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా రిటైన్ నిబంధనల మేరకు ఆ జట్టు విదేశీ కోటాలో కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్‌లను అట్టిపెట్టుకోనుంది.
ఆ లెక్కన చూసుకున్న వార్నర్‌కు ఉద్వాసన తప్పదు. ఇక డేవిడ్ వార్నర్ గనుక మెగా వేలంలోకి వస్తే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతానైట్‌రైడర్స్‌తో పాటు కొత్తగా వచ్చే రెండు ఫ్రాంచైజీలు కూడా అతని కోసం పోటీపడనున్నాయి.

వార్నర్ రూ.14 కోట్లు పక్కా..
సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అయిన వార్నర్ సేవలం ఈ జట్లకు చాలా ముఖ్యం. విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెప్పడంతో ఆ జట్టు కెప్టెన్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో వార్నర్‌ను తమ కెప్టెన్‌గా నియమించుకునేందుకు ఆర్‌సీబీ గట్టిగా ప్రయత్నించవచ్చు. వార్నర్ కోసం.. ఈ సీజన్ వేలంలో మ్యాక్సీకి ఉపయోగించిన స్ట్రాటజీనే వాడనుంది.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్‌తో పాటు కొత్తగా వచ్చే ఫ్రాంచైజీలు కెప్టెన్‌తో పాటు స్టార్ డమ్ ఉన్న ఆటగాడి అవసరం నేపథ్యంలోనే వార్నర్ కోసం ఎంతకైన పోటీ పడవచ్చు. దాంతో అతను భారీ ధర పలికే అవకాశం ఉంది. పైగా ఫ్రాంచైజీల పర్స్ కూడా పెరగడంతో తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఎంతకైనా తెగిస్తాయి. దాంతో వార్నర్ సులువగా రూ.12-14 కోట్లు పలికే అవకాశం ఉంది.

టీ20 ప్రపంచకప్‌లో విఫలమైతే మాత్రం..
అయితే వార్నర్ టీ20 ప్రపంచకప్‌లో రాణించడంపైనే ఇది ఆధారపడి ఉంటుంది. యూఏఈ వేదికగానే జరిగే టీ20 ప్రపంచకప్‌లో వార్నర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే అతని డిమాండ్ అమాంతం పెరుగుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన నిర్ణయాన్ని మార్చుకొని అంటిపెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఐపీఎల్ 2021 సీజన్ వైఫల్యాన్నే అక్కడ కూడా కొనసాగిస్తే అతని ఐపీఎల్ కెరీర్ ప్రమాదంలో పడినట్లే.
అదే జరిగితే అతనికి కనీస ధర రూ.2 కోట్లకు కూడా ఎవరూ తీసుకోరు. ఈ సీజన్ వేలంలో స్టీవ్ స్మిత్‌కు ఎదురైన అనుభవమే వార్నర్‌కు ఎదురవుతోంది. ఢిల్లీ క్యాపిటిల్స్ రూ.2 కోట్లకే స్మిత్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. పేలవ ఫామ్ కొనసాగితే వార్నర్‌కు కూడా అదే గతి పడుతుంది.


Click it and Unblock the Notifications
