For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virender Sehwag: ముంబై ఇండియన్స్ ఆ ముగ్గురినే రిటైన్ చేసుకోవాలి! హార్దిక్, సూర్యకు నో చాన్స్!

IPL 2022 Mega Auction: Hardik Pandya excluded in Virender Sehwag’s list of players MI must retain

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ పోరాటం లీగ్ దశకే పరిమితమైంది. 14 మ్యాచ్‌లకు ఏడు మాత్రమే గెలిచిన రోహిత్ సేన 14 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 7 విజయాలు 14 పాయింట్లు సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మెరుగైన రన్‌రేట్‌తో టోర్నీలో ముందడుగు వేయగా.. ముంబై నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 5 టైటిల్స్‌తో ఆధిపత్యం చెలాయించిన ముంబై ఈ సారి ఆ జోరును కొనసాగించలేకపోయింది.

ముంబై బలమే..

ముంబై బలమే..

అయితే ముంబై ఇండియన్స్ సక్సెస్‌కు ప్రధాన కారణం ఆ జట్టు కోర్ టీమ్ బలంగా ఉండటం. రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు గత నాలుగేళ్లుగా ఆడుతూ సత్తా చాటడంతో ముంబై జోరు కొనసాగింది. అయితే వచ్చే ఏడాది కొత్తగా రెండు జట్లు వస్తుండటంతో మెగావేలం జరగనుంది.

ప్రస్తుత టీమ్స్‌లోని ఆటగాళ్లంతా చెల్లాచెదురు కానున్నారు. అయితే మెగా వేలం నేపథ్యంలో టీమ్స్ రిటైన్ పాలసీ గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టతనివ్వాలి. మొత్తం నలుగురు ఆటగాళ్లు రిటైన్ చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఆ ముగ్గురు బెస్ట్..

ఆ ముగ్గురు బెస్ట్..

అయితే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. మెగా వేలం నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ రిటైన్ చేసుకోవాల్సిన ఆటగాళ్లు ఎవరో చెప్పాడు. క్రిక్ బజ్ చర్చ కార్యక్రమంలో మట్లాడుతూ.. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాలను ముంబై రిటైన్ చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

'నేనయితే ఇషాన్ కిషన్, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్‌‌ప్రీత్ బుమ్రాలను తీసుకోవాలంటా. భవిష్యత్తు దృష్ట్యా ఇషాంత్ జట్టుకు పనికి వస్తాడు. అతను యువకుడే కాబట్టి జట్టుతో చాలా ఏళ్లు కొనసాగగలడు.

ఇక హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేనప్పుడు అతన్ని రిటైన్ చేసుకోవడం అనవసరం. అతనికి వేలంలో భారీ ధర పలకడం కూడా అనుమానమే. ఎందుకంటే అతని గాయం నేపథ్యంలో ప్రతీ ఒక్కరు హార్దిక్‌ను తీసుకోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కాబట్టి హార్దిక్‌కు బదులు ఇషాన్ కిషన్‌ను తీసుకోవడం ఉత్తమం.

బౌలింగ్ చేయనప్పుడు ఎందుకు?

బౌలింగ్ చేయనప్పుడు ఎందుకు?

హార్దిక్ బౌలింగ్ చేస్తాడా? లేదా? అనేది అతనే చెప్పాలి. ఫిట్‌నెస్ సాధించి బౌలింగ్ చేయడం మొదలుపెడితే మాత్రం హార్దిక్ కోసం టీమ్స్ అన్నీ వేలంలో పోటీపడతాయి. ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతని నుంచి ఇంకా ఆశిస్తున్నారు. ఎందుకంటే అతను టాపార్డర్ బ్యాట్స్‌‌మన్. హార్దిక్ పాండ్యా లోయరార్డర్‌లో ఆడుతాడు'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. అతని గాయం నేపథ్యంలో బౌలింగ్ చేయాలని పుష్ చేస్తే అది అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందని ముంబై ఇండియన్స్ కోచ్ మహేళ జయవర్దనే తెలిపాడు.

Story first published: Sunday, October 10, 2021, 15:52 [IST]
Other articles published on Oct 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+