IPL 2022 Mega Auction:ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరో మూడేళ్లు చెన్నైతోనే తాలా!

న్యూఢిల్లీ: ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన మహేంద్ర సింగ్ ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను వచ్చే సీజన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ధోనీ సైతం తన మాటలతో అభిమానులను గందరగోళానికి గురిచేశాడు. చెన్నై చెపాక్ మైదానంలోనే చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతానని చెప్పి.. వచ్చే సీజన్ ఆడటంపై సంకేతాలు ఇచ్చాడు. అంతలోనే బీసీసీఐ రిటెన్షన్ పాలసీపైనే తాను లీగ్ కొనసాగేది ఆధారపడి ఉందని బాంబు పేల్చాడు.
అయితే సీఎస్‌కే ఫ్రాంచైజీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధోనీని వదులుకోమని, రిటెన్షన్ జాబితాలో అతనే ముందుంటాడని తెలిపింది. అయితే తాజా సమాచారం ప్రకారం ధోనీ ఒక్క ఏడాదే కాకుండా మరో మూడేళ్ల పాటు ఆడనున్నాడని తెలుస్తోంది. వచ్చే మూడేళ్లు అతన్ని జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ అంటిపెట్టుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది కొత్త రెండు జట్లు వస్తుండటంతో టీమ్స్ సంఖ్య పదికి పెరగనుంది.

నవంబర్ 30 డెడ్‌లైన్..
ఈ క్రమంలోనే మెగా వేలం నిర్వాహణ అనివార్యమైంది. ఇప్పటికే కొత్త జట్ల ప్రక్రియను ముగించిన బీసీసీఐ మెగా వేలం నిర్వహణపై దృష్టి సారించింది. డిసెంబర్ చివరి వారంలో మెగా ఆక్షన్ నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తోంది. కొత్తగా వచ్చిన జట్లలో అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సీవీసి క్యాపిటల్స్ రూ.5625 కోట్లకు దక్కించుకోగా.. లక్నో బేస్ టీమ్‌ను రూ. 7090 కోట్లకు ఆర్‌పీఎస్‌జీ సొంతం చేసుకుంది.
దాంతో ఐపీఎల్ 2022 సీజన్ పది జట్లతో ప్రేక్షకులను అలరించనుంది. ఇక మెగావేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని సిద్దం చేసిన బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఫ్రాంచైజీలకు సమాచారమిచ్చింది. నవంబర్ 30లోపు తమ రిటెన్షన్ జాబితాను అందజేయాలని ఫ్రాంచైజీలకు సూచించింది.

ధోనీతో పాటు..
ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని మరో మూడేళ్లు అట్టిపెట్టుకోనుంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజాతో పాటు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్లు మొయిన్ అలీ లేదా సామ్ కరన్.. ఇద్దరిలో ఒకరిని తమవద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. చెన్నై టర్న్ వికెట్‌కు మొయిన్ అలీ బౌలింగ్ సరిపోతుందని, ఇప్పటికే అతనితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. దాంతో ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనాకు మొడిచెయ్యే ఎదురు కానుంది.

లక్నోకు రాహుల్..
ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు యువ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్‌లను రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్.. రిషభ్ పంత్, పృథ్వీ షాతో పాటు దక్షిణాఫ్రికా పేసర్లు, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్‌లపై దృష్టిసారించింది. కాగా, ఈ ఏడాది కొత్తగా చేరిన జట్లలో సంజీవ్ గోయెంకా గ్రూప్ లక్నో ఫ్రాంఛైజీని చేజిక్కించుకోగా.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications