IPL 2022 Mega Auction: జానీ బెయిర్ స్టోపై కన్నేసిన ఆ మూడు జట్లు!

హైదరాబాద్: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టో ఎంత విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో అతను సాధించిన పరుగులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించగల ఈ ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. ముఖ్యంగా గత రెండు సీజన్లలో జానీ బెయిర్ స్టో దుమ్ము రేపాడు.
విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చిరస్మరణీయ విజయాలందించాడు. ఈ సీజన్‌లోనూ 7 మ్యాచ్‌ల్లో 248 రన్స్‌తో సత్తా చాటాడు. అయితే వచ్చే సీజన్‌కు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ సేవలను సన్‌రైజర్స్ కోల్పోనుంది.

బెయిర్ స్టోకు నో చాన్స్
మెగా ఆక్షన్ నిబంధనల ప్రకారం ఒక్క జట్టు ఐదుగురు ప్లేయర్లను అంటిపెట్టుకోవచ్చు. ఇందులో ఒక ఫారిన్ ప్లేయర్‌ను కలుపుకొని మొత్తం ముగ్గురిని నేరుగా తీసుకునే అవకాశం ఉండగా.. మరో ఇద్దరిని రైట్ టూ మ్యాచ్(ఆర్‌టీఎమ్) ద్వారా తీసుకోవచ్చు. రైట్ మ్యాచ్ ద్వారా కూడా ఒకే ఫారిన్ ప్లేయర్‌ను తీసుకునే వెసులు బాటు ఉంది.
అయితే వచ్చే ఏడాది మెగా వేలం జరిగితే సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాలో బెయిర్ స్టోకు చోటు దక్కకపోవచ్చు. ఎందుకంటే ఆ జట్టు రషీద్ ఖాన్‌ను రిటైన్ చేసుకోనుండగా.. రైట్ టు మ్యాచ్ కింద విలియమ్సన్‌ను తీసుకోనుంది. దాంతో బెయిర్ స్టోకు ఉద్వాసన తప్పేలా లేదు. అదే జరిగి బెయిర్ స్టో వేలంలోకి వస్తే ఇతర ఫ్రాంచైజీలు పోటీపడుతాయి. ముఖ్యంగా ఓ మూడు జట్లు అయితే అతని కోసం వేలంలో ఏందాకైనా తెగించనున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఓ టాపార్డర్ ఓవర్‌సీస్ ప్లేయర్ అవసరం ఉంది. మెగా వేలం నేపథ్యంలో ఆ జట్టు ఫాఫ్ డూప్లెసిస్‌ను వదులుకోవచ్చు. అతని ప్లేస్‌ను భర్తీ చేయడానికి బెయిర్ స్టో సరిగ్గా సరిపోతాడు. సీనియర్ మహేంద్ర సింగ్ ధోనీకి కూడా బ్యాకప్‌గా ఉంటాడు. ఒకవేళ అతను లీగ్‌కు దూరమైనా కీపర్‌గా జట్టుకు ఉపయోగపడతాడు. బెయిర్ స్టో లాంటి విధ్వంసకరమైన ఓపెనర్ చెన్నై బ్యాటింగ్ లైనప్‌కు అవసరం. రుతురాజ్ గైక్వాడ్‌తో అతను ఇన్నింగ్స్ ఆరంభిస్తే చెన్నైకి మంచి శుభరంభాలు దక్కుతాయి.

ముంబై ఇండియన్స్..
జానీ బెయిర్ స్టో కోసం ముంబై ఇండియన్స్ కూడా పోటీ పడనుంది. ఎందుకంటే మెగా ఆక్షన్ కారణంగా కీరన్ పొలార్డ్, ట్రెంట్ బౌల్ట్‌లను రిటైన్ చేసుకోని క్వింటన్ డికాక్‌ను వదులుకోనుంది. నిబంధనల ప్రకారం ఇద్దరు ఓవర్‌సీస్ ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే చాన్స్ ఉండటంతో డికాక్‌కు ఉద్వాసన తప్పదు. అదే జరిగితే ఆ జట్టుకు ఓవర్‌సీస్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ అవసరం అవుతోంది. ఆ ప్లేస్‌ను భర్తీ చేయడానికి బెయిర్ స్టో సరిగ్గా సరిపోతాడు. రోహిత్ శర్మతో కలిసి బెయిర్ స్టో ఇన్నింగ్స్ ఆరంభిస్తే ప్రత్యర్థులకు చుక్కలే కనిపిస్తాయి. అంతేకాకుండా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న ముంబైకి జానీ రాకతో ఆ సమస్య తీరే చాన్స్ ఉంది. ఎందుకంటే బెయిర్ స్టో స్మిన్‌ను సమర్ధవంతంగా ఆడగలడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్..
జానీ బెయిర్ స్టో కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా పోటీ పడవచ్చు. ఎందుకంటే గత రెండు సీజన్లుగా కేకేఆర్ సరైన ఓపెనింగ్ కాంబినేషన్ లేక ఇబ్బంది పడుతుంది. ఆ జట్టుకు ఓ ఓవర్‌సీస్ విధ్వంసకర టాపార్డర్ బ్యాట్స్‌మన్ అవసరం ఉంది. బెయిర్ స్టో అయితే కేకేఆర్ సమస్యను తీర్చగలడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో శుభారంభం అందించగలడు. ఇక కేకేఆర్ ఆండ్రీ రస్సెల్, ప్యాట్ కమిన్స్‌లను రిటైన్ చేసుకునే చాన్స్ ఉంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు కాబట్టి అతన్ని వదులుకోవచ్చు. బెయిర్ స్టోను తీసుకుంటే కేకేఆర్ టాపార్డర్ బలం అవుతుంది కాబట్టి అతని కోసం ఆ ఫ్రాంచైజీ ఎంత ధరనైనా చెల్లించడానికి సిద్దపడవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications