
మోర్గాన్, ఫించ్‌లకు నిరాశే..
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్లు ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్‌లకు నిరాశే ఎదురుకానుంది. గత సీజన్ వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పేలవ బ్యాటింగ్‌తో కెప్టెన్‌గా జట్టుకు భారమయ్యాడు. దాంతో కేకేఆర్ అతన్ని రిటైన్ చేసుకోలేదు. కెప్టెన్‌గా మంచి రికార్డులున్నా.. నిలకడలేమి ఫామ్‌తో బాధపడుతుండటంతో ఫ్రాంచైజీలు ఈ ఇంగ్లండ్ కెప్టెన్‌పై ఆసక్తికనబర్చడం లేదు. ఇక ఆరోన్ ఫించ్ గతేడాదే అన్‌సోల్డ్ లిస్ట్‌లో చేరాడు. 2020లో ఆర్‌సీబీకి చివరిసారిగా ఆడిన ఆరోన్ ఫించ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దాంతో అతన్ని ఆ జట్టు వదిలేసింది. 2021 సీజన్ కోసం జరిగిన మినీ వేలంలో ఏ ఫ్రాంచైజీ ఈ ఆసీస్ కెప్టెన్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు.

మార్టిన్ గప్టిల్, క్రిస్ వోక్స్..
న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ సైతం అమ్ముడుపోని జాబితాలో నిలిచే అవకాశం ఉంది. 2019లో చివరిసారిగా ఐపీఎల్ ఆడిన గప్టిల్.. గత రెండు సీజన్లలో అతన్ని ఏ జట్టు తీసుకోలేదు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన క్రిస్ వోక్స్.. కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తరుచూ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడే వోక్స్‌ను తీసుకోకపోవడమే మంచిదని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. పైగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఏ సమయంలోనైనా తమ ఆటగాళ్లను వెనక్కిరమ్మనే అవకాశం ఉంది. దాంతో ఆ దేశపు ఆటగాళ్ల విషయంలో ఫ్రాంచైజీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.

మిల్లర్, హేల్స్, కాట్రెల్..
సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్, ఇంగ్లండ్ ప్లేయర్ అలెక్స్ హేల్స్, విండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌లు సైతం అమ్ముడుపోని జాబితాలో చేరే అవకాశం ఉంది. గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన మిల్లర్.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా పెద్దగా రాణించింది లేదు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఒకే ఒక సీజన్ ఆడిన అలెక్స్ హేల్స్‌ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు సుముఖంగా లేవు. 2018లో నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చిన హేల్స్ ఆ తర్వాత ప్రతీ వేలంలో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా నిలిచిపోయాడు. రాహుల్ తెవాటియా దెబ్బకు షెల్డన్ కాట్రెల్ ఐపీఎల్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడింది. 2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన షెల్డన్ కాట్రెల్ ఓవర్‌లో తెవాటియా ఐదు సిక్స్‌లు బాదాడు. దాంతో అతన్ని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపడం లేదు.

సందీప్, మిచెల్, మాథ్యూ వేడ్..
నేపాల్ స్పిన్నర్ సందీప్ లమిచ్చనే, న్యూజిలాండ్ పేసర్ మిచెల్ మెక్లీగన్, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌లకు మెగా వేలంలో కూడా నిరాశే ఎదురుకానుంది. చివరిసారిగా 2019లో ఆడిన సందీప్ లమిచ్చనే పేలవ ఫామ్‌తో లీగ్‌కు దూరమయ్యాడు. ఇక ముంబై ఇండియన్స్‌కు 2019 వరకు ఆడిన మిచెల్ మెక్లీగన్ పేలవ ఆటతీరుతో లీగ్‌లో కొనసాగలేకపోయాడు. మాథ్యూవేడ్ అప్పుడెప్పుడో 2011లో మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు అతనికి అవకాశం దక్కలేదు. ఈసారి కూడా ఈ ముగ్గురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవచ్చు.


Click it and Unblock the Notifications












