Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: అత్యంత బలంగా లక్నో సూపర్ జెయింట్స్! బ్యాటింగ్, బౌలింగ్ సూపరో సూపర్! తుది జట్టు ఇదే!

IPL 2022: Lucknow Super Giants Strength, Weakness, Playoffs Chances and Playing XI Prediction

హైదరాబాద్: ఐపీఎల్‌‌‌‌లోకి అడుగుపెడుతూనే సంచలనం సృష్టించిన నయా ఫ్రాంచైజీ లక్నో సూపర్‌‌ జెయింట్స్‌‌ .. ఇప్పుడు ఆటపై దృష్టి పెట్టింది. మెగా ఆక్షన్‌‌లో అన్ని ఫ్రాంచైజీల కంటే దూకుడుగా వ్యవహరించి.. పక్కా ప్రణాళికలతో సరికొత్త ప్లేయర్లను తీసుకున్న సూపర్‌‌ జెయింట్స్‌‌ అరంగేట్రంలోనే ట్రోఫీతో అద్భుతం చేయాలని భావిస్తోంది. మెగా లీగ్‌‌పై తనదైన ముద్ర వేసిన కేఎల్‌‌ రాహుల్‌‌ను కెప్టెన్‌గా ఎంచుకుని తొలి అడుగు ఘనంగా వేసింది!

ఇక పేపర్‌‌ మీద టీమ్‌‌ కాంబినేషన్‌ అంతా బాగానే కనిపిస్తున్నా.. అసలు సమరంలో ఎంతవరకు సత్తా చూపిస్తుందో చూడాలి..! ఓవరాల్‌‌గా వేలాది కోట్లను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేసి మెగా లీగ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంచైజీ.. ఫస్ట్‌‌ ట్రోఫీని సాధించే బలమైన బలగాలు ఉన్నాయా? లేదా? ఓ లుక్కేద్దాం..!

లక్నోకు ‘లక్‌‌‌‌' వరిస్తుందా?

లక్నోకు ‘లక్‌‌‌‌' వరిస్తుందా?

2016, 17 సీజన్లలో రైజింగ్‌‌ పుణె సూపర్‌‌ జెయింట్స్‌‌ను నడిపించిన అనుభవంతో సంజీవ్‌‌ గోయెంకా.. మెగా లీగ్‌‌ కోసం అతిపెద్ద సాహసం చేశాడు. రూ. 7,090 కోట్లతో లక్నో సూపర్‌‌ జెయింట్స్‌‌ టీమ్‌‌ను కొనుగోలు చేసి క్రికెట్‌‌ వర్గాల్లో చర్చకు తెరలేపాడు. దానికి తగ్గట్లుగానే రాహుల్‌‌ (రూ. 17 కోట్లు)ను కెప్టెన్‌‌గా తీసుకుని మరో అడుగు ముందుకేశాడు.

ఇక మెగా వేలంలోనూ పక్కా స్ట్రాటజీతో బలమైన ప్లేయర్లను తీసుకున్నాడు. దూకుడుకే మారుపేరైన గౌతమ్ గంభీర్‌ను మెంటార్‌గా నియమించుకున్నాడు. వేలంలో అతని మార్క్ కనిపించింది. లక్నోకు సూపర్ బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉంది. అయితే ఆరంభ మ్యాచ్‌లకు స్టార్ ఓవర్ సీస్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది. గాయపడ్డ మార్క్ వుడ్ సీజన్ మొత్తం దూరమయ్యే అవకాశం ఉంది.

బలాలు

బలాలు

కెప్టెన్‌‌గా, ఓపెనర్‌‌గా, వికెట్‌‌ కీపర్‌‌గా రాహుల్​ త్రిపాత్రాభినయానికి రెడీగా ఉన్నాడు. గత సీజన్‌‌లో కొద్దిలో మిస్‌‌ అయిన ఆరెంజ్‌‌ క్యాప్‌‌ను ఈసారి ఒడిసిపట్టాలని టార్గెట్‌‌ పెట్టుకున్నాడు. సునామీలా విరుచుకుపడే మరో ఓపెనర్‌‌ క్వింటన్‌‌ డికాక్‌‌ ఉండటం ప్లస్‌‌ పాయింట్‌‌. స్టోయినిస్‌‌, హోల్డర్‌‌ రూపంలో నాణ్యమైన ఆల్‌‌రౌండర్లు ఉన్నారు. స్పిన్నర్లుగా రవి బిష్ణోయ్‌‌, క్రునాల్‌‌ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్‌‌, దీపక్‌‌ హుడా బంతితో పాటు బ్యాట్‌‌తోనూ రాణించే సత్తా ఉంది. ఇండియన్‌‌ పేసర్‌‌ ఆవేశ్‌‌ ఖాన్‌‌పై భరోసా పెట్టుకోవచ్చు. రవి బిష్ణోయ్ కీలకం కానున్నాడు.

బలహీనతలు

బలహీనతలు

పొట్టి ఫార్మాట్‌‌లో రాహుల్‌‌ బ్యాటింగ్‌‌కు తిరుగులేదు. కానీ కెప్టెన్సీ ఒత్తిడి వల్ల గత రెండు సీజన్లలో స్లో స్ట్రయిక్‌‌ రేట్‌‌ నమోదు చేయడంతో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే రీతిలో ఆడితే ప్రమాదం తప్పదు. మనీశ్‌‌ పాండేది కూడా అదే సమస్య. కీలక మ్యాచ్‌‌ల్లో వీళ్ల స్ట్రయిక్‌‌ రేట్‌‌ నెమ్మదిస్తే టీమ్‌‌ స్కోరుపై తీవ్ర ప్రభావం చూపించే చాన్స్‌‌ ఉంది. డొమెస్టిక్‌‌ టోర్నీలో గొడవపడిన క్రునాల్‌‌, దీపక్‌‌ హుడా మధ్య సమన్వయం కుదురుతుందా? చూడాలి. మార్క్ వుడ్ గాయపడటం జట్టుక పెద్ద సమస్యగా మారింది. ఆవేశ్ ఖాన్ తోడుగా మరో చెప్పుకోదగ్గ భారత బౌలర్ లేరు. మిడిలార్డర్‌లో కూడా లుక లుకలు కనిపిస్తున్నాయి.

లక్నో టీమ్

లక్నో టీమ్

ఇండియన్స్: రాహుల్ (కెప్టెన్​), మనన్ వోహ్రా, మనీశ్ పాండే, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కె.గౌతమ్, కరణ్ శర్మ, క్రునాల్, అంకిత్ రాజ్ పుత్, ఆవేశ్ ఖాన్, మయాంక్ యాదవ్, మోహ్సిన్ ఖాన్, బిష్ణోయ్, షాబాజ్ నదీమ్.

విదేశీ ప్లేయర్లు: దుశ్మంత చమీర, స్టోయినిస్, కైల్ మేయర్స్, హోల్డర్, డికాక్, ఎవిన్ లూయిస్

తుది జట్టు(అంచనా)

కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, మనీశ్ పాండే, దీపక్ హుడా, మార్కస్ స్టోయినీస్, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, మార్క్ వుడ్, కృష్ణప్ప గౌతమ్, రవిబిష్ణోయ్, ఆవేశ్ ఖాన్

ప్లే ఆఫ్స్ అంచనా..

ప్లే ఆఫ్స్ అంచనా..

గ్రూప్‑ఎలో ఉన్న లక్నో.. అదే గ్రూప్ లోని ముంబై, కోల్ కతా, రాజస్థాన్, ఢిల్లీతో పాటు గ్రూప్‑బిలోని గుజరాత్ తో రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్ తో ఒక్కో మ్యాచ్ లో తలపడుతుంది. ఇక పేపర్‌పై బలంగా ఉన్న లక్నో.. అంచనాలకు తగ్గట్లు రాణిస్తే సులువుగా ప్లే ఆఫ్స్ చేరుతుంది. లక్ కలిసొస్తే టైటిల్ కొట్టినా ఆశ్చర్యం లేదు. గౌతమ్ గంభీర్ మెంటార్ షిప్ టీమ్‌కు అదనపు బలం కానుంది.

Story first published: Monday, March 21, 2022, 11:05 [IST]
Other articles published on Mar 21, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+