IPL 2022: ఆరంభ మ్యాచ్‌లకు 26 మంది విదేశీ ఆటగాళ్లు దూరం..టీమ్ వైజ్ లిస్ట్ ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌కు మరో 12 రోజుల్లో తెరలేవనుంది. ఈ నెల 26న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య వాంఖడే మైదానం వేదికగా జరిగే ఫస్ట్ మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్ షురూ కానుంది. లీగ్‌లోకి కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు వచ్చి చేరడంతో ఈ సారి లీగ్ మరింత రసవత్తరంగా సాగునుంది. అయితే వరల్డ్ బెస్ట్ లీగ్ అయిన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు 26 మంది ఇంటర్నేషనల్ స్టార్స్ దూరం కానున్నారు. అంతర్జాతీయంగా మూడు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగనుండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. మరికొంతమంది గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.
మూడు సిరీస్‌ల కారణంగా..
ప్రస్తుతం వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ మార్చి 28న ముగియనుంది. ఇక పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతుంది. టెస్ట్ సిరీస్ ఈ నెల 25న ముగియనుండగా.. పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఏప్రిల్ 5వరకు జరగనున్నాయి. బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేలు, రెండు టెస్ట్ సిరీస్‌లు ఏప్రిల్ 12వరకు జరగనున్నాయి. ఈ సిరీస్‌ల కారణంగా ఐపీఎల్‌లోని 10 ఫ్రాంచైజీలు తమ స్టార్ ఆటగాళ్ల సేవలు కోల్పోనున్నాయి. రెండో వారం నుంచే ఆయా దేశాల ఆటగాళ్లంతా లీగ్‌లో అందుబాటులో ఉండనున్నారు. కనీసం వీరంతా రెండు మ్యాచ్‌లు దూరం కానున్నారు.
ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్న ఆటగాళ్ల జాబితా( టీమ్స్ ప్రకారం)

చెన్నై సూపర్ కింగ్స్
1.చెన్నై సూపర్ కింగ్స్- డ్వైన్ ప్రెటోరియస్
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ను వేలంలోరూ.50 లక్షల కనీస ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ల కారణంగా అతను ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
2. ముంబై ఇండియన్స్-జోఫ్రా ఆర్చర్
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరంగా ఉండనున్నాడు. ఈ విషయం తెలిసే ముంబై అతన్ని వేలంలో రూ.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే ఈ రిస్క్ చేసింది. ఇక ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డానియల్ సామ్స్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే అతనికి ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్లలో చోటు దక్కలేదు.
3. కోల్‌కతా నైట్‌రైడర్స్-ప్యాట్ కమిన్స్, ఆరోన్ ఫించ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్‌తో పాటు అలెక్స్ హేల్స్‌కు రిప్లేస్‌మెంట్‌గా తీసుకున్న ఆరోన్ ఫించ్ సేవలను కోల్పోనుంది. టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత కమిన్స్ రానున్నా.. మూడు రోజు క్వారంటైన్ నేపథ్యంలో ఒకటి, రెండు మ్యాచ్‌లు ఆడకపోవచ్చు. ఫించ్ మాత్రం ఏప్రిల్ 10 తర్వాతే జట్టుకు అందుబాటులోకి రానున్నాడు.

రాజస్థాన్
4. రాజస్థాన్ రాయల్స్-రాస్సీ వన డర్ డస్సెన్
సీఎస్‌కే తరహాలోనే రాజస్థాన్ రాయల్స్ ఒక డస్సెన్ సేవలను మాత్రమే కోల్పోనుంది. బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అతను ఎంపికయ్యాడు. ఇక టెస్ట్ సిరీస్‌కు కూడా ఎంపికైతే కనీసం ఐదు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
5. సన్‌రైజర్స్ హైదరాబాద్-మార్కో జాన్సన్, సీన్ అబాట్, ఎయిడెన్ మార్క్‌రమ్
బంగ్లాదేశ్-సౌతాఫ్రికా సిరీస్‌ల కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా నష్టపోనుంది. ఆ జట్టు ఏకంగా ముగ్గురు స్టార్ ప్లేయర్ల సేవలను కోల్పోనుంది. సౌతాఫ్రికాకు చెందిన ఎయిడెన్ మార్క్‌రమ్‌తో పాటు మార్కో జాన్సన్‌ను, ఆస్ట్రేలియాకు చెందిన సీన్ అబాట్‌లు ఆరంభం మ్యాచ్‌లకు దూరం కానున్నారు. పాకిస్థాన్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనున్న సీన్ అబాట్ ఐదు మ్యాచ్‌లు దూరమయ్యే అవకాశం ఉంది. సౌతాఫ్రికా ఆటగాళ్లు సైతం బంగ్లాతో టెస్ట్ సిరీస్ ఆడితే.. 6 మ్యాచ్‌ల వరకు దూరం కానున్నారు.
6. ఢిల్లీ క్యాపిటల్స్- డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, అన్రిచ్ నోర్జ్(గాయం), ముస్తాఫిజుర్ రెహ్మాన్, లుంగి ఎంగిడి
వార్నర్ అంత్యక్రియలకు హాజరవ్వాలనుకుంటున్న డేవిడ్ వార్నర్.. ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. మిచెల్ మార్ష్ పాకిస్థాన్‌తో వన్డే, టీ20 సిరీస్ ముగిసిన తర్వాత అందుబాటులోకి రానున్నాడు. అన్రిచ్ నోర్జ్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. అతను ఈ సీజన్ ఆడటం అనుమానంగా మారింది. బంగ్లాదేశ్, సౌతాఫ్రికా సిరీస్‌ల కారణంగా ముస్తాఫిజుర్, లుంగి ఎంగిడిలు దూరం కానున్నారు.

ఆర్‌సీబీ
7. ఆర్‌సీబీ- జాసన్ బెహ్రాండార్ఫ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, జోష్ హజెల్ వుడ్
ఆర్‌సీబీ ఆస్ట్రేలియాకు చెందిన జాసన్, మ్యాక్సీ, హజెల్ వుడ్ సేవలను కోల్పోనుంది. మ్యాక్సీ తన పెళ్లి కారణంగా కనీసం మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు. పాకిస్థాన్ పర్యటన కారణంగా హజెల్ వుడ్, బెహ్రాండార్ఫ్ దూరం కానున్నారు. టెస్ట్ సిరీస్ ముగిసిన అనంతరం హజెల్ వుడ్ వచ్చే అవకాశం ఉంది.
8. పంజాబ్ కింగ్స్- జానీ బెయిర్ స్టో, కగిసో రబడా, నాథన్ ఎల్లిస్
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ కారణంగా జానీ బెయిర్ స్టో ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌తో సిరీస్‌ల కారణంగా సఫారీ పేసర్ రబడా, ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ సేవలను పంజాబ్ కింగ్స్ కోల్పోనుంది.

లక్నో సూపర్
9. లక్నో సూపర్ జెయింట్స్- మార్కస్ స్టోయినీస్, జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్, మార్క్ వుడ్, క్వింటన్ డికాక్
ద్వైపాక్షిక సిరీస్ కారణంగా కొత్తగా లీగ్‌లోకి వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా ఐదుగురి ఆటగాళ్ల సేవలను కోల్పోనుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్ కనీసం రెండు మ్యాచ్‌లు దూరం కానున్నారు. పాకిస్థాన్ పరిమిత ఓవర్ల సిరీస్ ముగిసిన తర్వాతే మార్కస్ స్టోయినిస్ అందుబాటులోకి రానున్నాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ల నేపథ్యంలో డికాక్ ఐదు మ్యాచ్‌లు దూరం కానున్నాడు.
10. గుజరాత్ టైటాన్స్-డేవిడ్ మిల్లర్, అల్జారీ జోసెఫ్
హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ సైతం తమ ఓవర్‌సీస్ ఆటగాళ్ల సేవలను కోల్పోనుంది. సౌతాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్, వెస్టిండీస్‌కు చెందిన అల్జారీ జోసెఫ్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications