For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022 Mega Auction:లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ .. కోహ్లీ, ధోనీ, రోహిత్ కంటే ఎక్కువ జీతం!

IPL 2022: KL Rahul becomes most-expensive player, will earn more than Virat Kohli and Rohit Sharma
IPL 2022 Mega Auction: KL Rahul Surpass Kohli ,Dhoni And Rohit | Lucknow Players | Oneindia Telugu

ముంబై: ఐపీఎల్ 2022 మెగా వేలం నేపథ్యంలో లీగ్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన అహ్మదాబాద్, లక్నో టీమ్స్ తమ డ్రాఫ్ట్ జాబితాలను ప్రకటించాయి. బీసీసీఐ రిటెన్షన్ నిబంధనల మేరకు ఇరు జట్లు ముగ్గురేసి ఆటగాళ్లను పికప్ చేసుకున్నాయి. ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌కు చెందిన లక్నో ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్‌ను రూ. 17 కోట్లకు తీసుకుంది. తమ టీమ్ కెప్టెన్‌గా ఎంచుకుంది.

అతనితో పాటు మార్కస్ స్టోయినిస్ రూ.9.2 కోట్లకు తీసుకున్న లక్నో.. అన్‌క్యాప్‌డ్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ రూ. 4 కోట్లకు తీసుకుంది. ఇక అహ్మదాబాద్ టీమ్ హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్‌లను రూ.15 కోట్లకు, శుభ్‌మన్ గిల్‌ను రూ.8 కోట్లకు తీసుకుంది.

దాంతో ఇప్పటి వరకు ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యధిక వేతనం పొందిన ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. గత సీజన్ వరకు ఈ రికార్డు ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మీదుంది. గత సీజన్‌లో కోహ్లీ అత్యధికంగా రూ.17 కోట్లు అందుకోగా.. ఈ సీజన్‌లో మాత్రం రూ.15 కోట్లకే రిటైన్ చేసుకుంది. టీమ్ కోసం కోహ్లీ వేతనం విషయంలో కాంప్రమైజ్ అయ్యాడు.

ఇక రిటెన్షన్ రూల్స్ ప్రకారం పాత జట్లు గరిష్టంగా రూ.16 కోట్లు చెల్లించేందుకే ఆస్కారం ఉండటంతో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను అంతే ధరకు అంటిపెట్టుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆశ్చర్యకరంగా ధోనీని కాదని జడేజా ప్రధాన ఆటగాడిగా ఎంచుకోవడంతో అతనికి రూ.12 కోట్ల కాంట్రాక్టే దక్కింది. దాంతో కేఎల్ రాహుల్ టాప్ సాలరీ అందుకుంటున్నాడు.

ఇక 2013లో ఆర్‌సీబీ తరఫున ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన రాహుల్.. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్, 2016లో మళ్లీ ఆర్‌సీబీలోకి వెళ్లాడు. ఇక 2018లో పంజాబ్ కింగ్స్ అతనికి రూ. 11 కోట్లు చెల్లించి తీసుకుంది. ఐపీఎల్ 2020, 21 సీజన్లలో కెప్టెన్‌గా బాధ్యతలను కూడా ఇచ్చింది. అయితే రాహుల్ అద్భుత ప్రదర్శన కనబర్చినా ఆ జట్టు విజయాలందుకోలేకపోయింది. 55 ఇన్నింగ్స్‌లు ఆడిన 56.62 సగటుతో 2548 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు 25 హాఫ్ సెంచరీలున్నాయి. ఐపీఎల్ 2020, 2021 సీజన్‌లో అత్యధిక పరుగులు చేశాడు.

Story first published: Saturday, January 22, 2022, 11:21 [IST]
Other articles published on Jan 22, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+