Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: అటెన్షన్ ప్లీజ్.. కేకేఆర్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

IPL 2022: KKR appoint Shreyas Iyer as New captain for the upcoming season

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ నియమితుడయ్యాడు. బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో రూ.12.25 కోట్లకే అయ్యర్‌ను చేజిక్కిచ్చుకున్న కేకేఆర్.. ఊహించనట్లుగానే అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని బుధవారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.''లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌.. గర్ల్స్ అండ్ బాయ్స్.. కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు హలో చెప్పండి'' అంటూ తమ సారథులతో కూడిన ఫొటోను షేర్‌ చేసింది.

కెప్టెన్ అయ్యర్‌కు రికార్డు..

ఇందులో కేకేఆర్ ఫస్ట్ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీతో పాటు బ్రెండన్‌ మెకల్లమ్‌, గౌతమ్‌ గంభీర్‌, దినేశ్‌ కార్తిక్‌, ఇయాన్‌ మోర్గాన్‌... ప్రస్తుత సారథి శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి శ్రేయస్‌ అయ్యర్‌కు మంచి రికార్డు ఉంది. అయితే, గాయం కారణంగా ఐపీఎల్‌-2021 సీజన్‌ తొలి దశకు అతను దూరం కాగా.. టీమిండియా యువ కెరటం రిషభ్‌ పంత్‌ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. సూపర్ కెప్టెన్సీతో జట్టుకు అద్భుత విజయాలందించాడు.

గాయంతో దూరమవడంతో..

గాయంతో దూరమవడంతో..

దాంతో శ్రేయస్ అయ్యర్‌ సెకండాఫ్ లీగ్‌కు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఢిల్లీ మేనేజ్‌మెంట్ రిషభ్ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది. అంతేకాకుండా మెగా వేలం నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌ను రిటైన్‌ చేసుకోలేదు. దాంతో అతను ఆక్షన్‌లోకి రాగా అగ్గువ ధరకే కేకేఆర్‌ కొనుగోలు చేసింది. కాగా గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈసారి ఎలాగైనా టైటిల్‌ గెలవాలనే పట్టుదలతో ఉంది. గత సీజన్‌లో ఫైనల్‌కు చేర్చిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌పై వేటు వేసిన ఆ జట్టు వేలంలో అతనిపై కన్నెత్తి చూడలేదు. దాంతో అతను అన్‌సోల్డ్ లిస్ట్‌లో చేరాడు.

IPL Auction 2022: Shreyas Iyer To KKR For 12.25 Crore, Dhawan For Punjab | Oneindia Telugu
గౌరవంగా భావిస్తున్నా..

గౌరవంగా భావిస్తున్నా..

‘అత్యంత ఘన చరిత్ర కలిగిన కేకేఆర్ జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన టీమ్ ఓనర్స్, మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. టీమ్ లక్ష్యాన్ని సాధించగలమనే ఆత్మవిశ్వాసం నాకుంది. భారత క్రికెట్‌లో కోల్‌కతా, ఈడెన్ గార్డెన్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దాన్ని అలానే కొనసాగించేందుకు నా సాయశక్తులా కృషి చేస్తాను. నా జట్టు, అభిమానులు తలెత్తుకునేలా కష్టపడుతాను'అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, February 16, 2022, 17:45 [IST]
Other articles published on Feb 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+