

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు తడబడుతున్నారు. బ్యాట్స్‌మన్ భారీ షాట్లు ఆడేలా లడ్డూలాంటి బంతులు వేస్తున్నారు. దానికి తోడు నోబాల్స్, వైడ్స్ వేస్తూ అనవసర పరుగులు ఇస్తున్నారు. ఫీల్డింగ్ వైఫల్యం కూడా కనిపిస్తోంది. దాంతో రాజస్థాన్ ఓపెనర్లు దంచికొట్టారు. ముఖ్యంగా జోస్ బట్లర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మూడు సిక్స్‌లు, మూడు ఫోర్లు బాదాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్.. పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చూసింది.
ఈ ఆరంభాన్ని చూసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానుల ముఖాలు మాడిపోయాయి. ఇదెక్కడి బౌలింగ్ రా అయ్యా అంటూ తిట్టుకున్నారు. సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సైతం చాలా నిరాశగా కనిపించింది. అయితే పవర్ ప్లే అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫార్డ్‌ను బౌలింగ్‌కు తీసుకురాగా.. అతను బ్రేక్ త్రూ అందించాడు. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(20)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్‌తో సన్‌రైజర్స్ శిభిరంలో నవ్వులు పూసాయి. సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సైతం చిరునవ్వులు చిందించింది. దాంతో సన్‌రైజర్స్ ఫ్యాన్స్.. మా కావ్య పాప నవ్విందోచ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఆమె ముఖంలో నవ్వులనే తాము కోరుకుంటున్నామని ఆ ఫొటోలను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జైస్వాల్ ఔటైనా రాజస్థాన్ విధ్వంస ఆగలేదు. కెప్టెన్ సంజూ శాంసన్ సైతం హిట్టింగ మొదలు పెట్టడంతో స్కోర్ బోర్డు పరుగెత్తుంది.
జోరు మీదున్న జోస్ బట్లర్(35)ను ఉమ్రాన్ మాలిక్ పెవిలియన్ చేర్చాడు. దాంతో 8.1 ఓవర్లలో రాజస్థాన్ రెండు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. జోస్ బట్లర్ వికెట్‌తో కావ్య పాప ఆనందం రెట్టింపు అయింది.