
చెత్త ఆటగాళ్లు అనుకుంటే చెలరేగుతున్నారు..
అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఇద్దరూ దుమ్మురేపుతుండటంతో సన్‌రైజర్స్ అభిమానులు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో ఈ ఇద్దరు సన్‌రైజర్స్ ఆటగాళ్లు సత్తా చాటారు. ముఖ్యంగా నికోలస్ పూరన్ రెండు మ్యాచ్‌ల్లో విధ్వంసకర హాఫ్ సెంచరీలతో భారత బౌలర్లను చెడుగుడు ఆడాడు.
జట్టుకు విజయాన్ని అందించలేకపోయినా.. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు. అతనికి సరైన సహకారం లభించకపోవడంతో విండీస్ విజయాన్నందుకోలేకపోయింది. ఫస్ట్ టీ20లో 61 పరుగులు చేసిన పూరన్.. రెండో టీ20లోనూ 62 పరుగులు చేశాడు.

పట్టరాని సంతోషంలో కావ్య పాప
దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఉబ్బి తబ్బిబ్బవుతోంది. అభిమానులు కూడా టీమ్‌పై ఆశలు పెంచుకుంటున్నారు. నికోలస్ పూరన్ ఇదే మాదిరి ఐపీఎల్‌లో చెలరేగితే ఆరెంజ్ ఆర్మీకి తిరుగుండదని కామెంట్ చేస్తున్నారు. బ్రియాన్ లారా మార్గదర్శకంలో పూరన్ ఇదే మాదిరి చెలరేగుతాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అసలు లారా సూచనలతోనే కావ్య పాప పూరన్‌పై అంత ధర పెట్టిందని, ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నామని కామెంట్ చేస్తున్నారు.

రఫ్ఫాడించిన భువీ...
ఇక భువనేశ్వర్ కుమార్ సైతం గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత దారుణంగా విఫలమయ్యాడు. పదే పదే గాయపడుతూ జట్టుకు దూరమయ్యాడు. సౌతాఫ్రికా గడ్డపై దారుణంగా విఫలమయ్యాడు. అయితే శుక్రవారం జరిగిన రెండో టీ20లో భువీ.. ఒకప్పటి బౌలర్‌లా తలపించాడు. అద్భుత బౌలింగ్‌తో టీమిండియాకు చిరస్మరనీయ విజయాన్నందించాడు.
19వ ఓవర్‌లో నాలుగు పరుగులే ఇవ్వడంతో పాటు డేంజరస్ పూరన్‌ను ఔట్ చేశాడు. దాంతో భారత్ 8 పరుగుల తేడాతో చిరస్మరణీ విజయాన్నందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కే ఎంపికైన రొమారియో షెఫర్డ్ కూడా ఆకట్టుకున్నాడు. ధాటిగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్‌ను ఔట్ చేశాడు.

సన్‌రైజర్స్ టీమ్...
నికోలస్ పూరన్(రూ.10.75 కోట్లు), వాషింగ్టన్ సుందర్(రూ. 8.75 కోట్లు)చ రాహుల్ త్రిపాఠి(రూ.8.50 కోట్లు), రొమారియో షెఫెర్డ్(రూ.7.75 కోట్లు), అభిషేక్ శర్మ(రూ.6.50 కోట్లు), భువనేశ్వర్ కుమార్(రూ.4.20 కోట్లు), మార్కో జాన్సెన్(రూ.4.20 కోట్లు), టీ నటరాజన్(రూ.4 కోట్లు), కార్తీక్ త్యాగీ(రూ.4 కోట్లు), ఎయిడెన్ మార్క్‌రమ్(రూ.2.60 కోట్లు), సీన్ అబాట్(రూ.2.40 కోట్లు), గ్లేన్ ఫిలిప్స్(రూ.1.50 కోట్లు), శ్రేయస్ గోపాల్ (రూ.75 లక్షలు), ఫజల్లా ఫరూకీ(రూ.50 లక్షలు), ప్రియమ్ గార్గ్(రూ.20 లక్షలు, జగదీష్ సుచిత్( రూ.20 లక్షలు), సమర్థ్(రూ.20 లక్షలు), శశాంక్ సింగ్(రూ. 20 లక్షలు), సౌరభ్ దూబే(రూ.20 లక్షలు)


Click it and Unblock the Notifications












