కాస్టూమ్స్ పార్టీలో రచ్చ..
ఈ పార్టీలో ఒక్కొక్కరు ఒక్కో వేషధారణలో కనిపించారు. క్యాజువల్ అవుట్‌ఫిట్స్‌తో సందడి చేశారు. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కరేబియన్ లుక్, హిప్పీ గెటప్‌లో హంగామా చేశాడు. కేప్టెన్ కేన్ విలియమ్సన్ గిటార్ ప్లేయర్‌గా మెరుపులు మెరిపించాడు. మిగిలిన ప్లేయర్లందరూ ఆడి, పాడారు. సరదాగా స్టెప్పులేశారు. రాక్ మ్యూజిక్‌లో మునిగితేలారు. డేల్ స్టెయిన్, బ్రియాన్ లారా రాక్ స్టార్ గెటప్‌లో కనిపంచారు. ముంబైలోని ఓ స్టార్ హోటల్‌లో ఈ ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేశారు. దీనికి ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్ అటెండ్ కాలేదు గానీ- స్పెషల్ మెసేజీని పంపించింది.
గిటారిస్ట్‌గా కేన్ మామ...
ఈ పార్టీకి సంబంధించి సన్‌రైజర్స్ హైదరాబాద్ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, కీలక ప్లేయర్లు మార్క్రమ్, అబ్దుల్ సమద్, గ్లెన్ ఫిలిప్స్ ఓ పాటను స్వయంగా రచించి అద్భుతంగా ఆలపించారు. వి ఆర్ సన్‌రైజర్స్.. వి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, వి లవ్ బిర్యానీ అంటూ సాగే ఈ పాటను విలియమ్సన్ గిటార్ వాయిస్తూ పాడగా.. మార్క్రమ్, అబ్దుల్ సమద్, గ్లెన్ ఫిలిప్స్ పక్కనే కుర్చొని కోరర్స్ ఇచ్చారు. జట్టులోని ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరి పేర్లు వచ్చేలా ఈ పాటను రాసారు.
ఫ్యాన్స్ ఫిదా..
ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్ ఈ వీడియో ట్వీట్ చేయగా.. ఘన విజయం అనంతరం వైరల్‌గా మారింది. ఈ పాటకు సంబంధించిన వీడియోను చూసి ఆరెంజ్ ఆర్మీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. పాటలో విలియమ్సన్ బ్యాండ్ ఇన్వాల్వ్ అయిన తీరును చూస్తుంటూ గూస్ బంప్స్ వస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుత సీజన్‌లో రాజస్థాన్, లక్నో చేతుల్లో ఓడిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత వరుసగా చెన్నై, గుజరాత్, కేకేఆర్, పంజాబ్, ఆర్సీబీలను వరుసగా మట్టికరిపించింది. ఏప్రిల్ 27న టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది.


Click it and Unblock the Notifications
