IPL 2022: మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌కు కొత్త తలనొప్పి! ఏంటంటే?

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు కొత్త తలనొప్పి మొదలైంది. వేలానికి అన్ని ప్రణాళికలు సిద్దం చేసుకున్న తర్వాత ఈ సమస్య మొదలైంది. రిటెన్షన్ ప్రక్రియలో కెప్టెన్ రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు)తో పాటు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు) , కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు)ను అంటిపెట్టుకుంది.
అయితే వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ ఫామ్ ఆ జట్టును కలవరపెడుతుంది. ఫామ్‌ను పక్కనబెడితే అసలు అతని ఫిట్‌నెస్ సమస్యలు టీమ్‌మేనేజ్‌మెంట్, అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

వరుసగా గాయపడుతూ..
టీ20 ప్రపంచకప్-2021 జరుగుతున్న సమయంలోనే ఫిట్ నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన కీరన్ పొలార్డ్.. ఆ తర్వాత పాకిస్తాన్ పర్యటన నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స తీసుకొని కమ్ బ్యాక్ చేశాడు. ఆ సిరీస్‌లో పర్వాలేదనిపించాడు. ఆ సిరీస్ విజయంతో భారత్ గడ్డపై అడుగుపెట్టిన పొలార్డ్.. మళ్లీ అవే సమస్యలను ఎదుర్కొంటున్నాడు. భారత్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫస్ట్ వన్డేలో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన పొలార్డ్.. రెండో వన్డేకు గాయంతో దూరమయ్యాడు.

పొలార్డ్‌కు ప్రత్యామ్నాయం..
దాంతో అతని స్థానంలో నికోలస్ పూరన్ తాత్కలిక బాధ్యతలు చేపట్టాడు. ఈ మ్యాచ్‌లోనూ విండీస్ ఓడటంతో.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. అయితే వరుసగా గాయపడుతున్న కీరన్ పొలార్డ్ గురించే ముంబై ఇండియన్స్ టీమ్‌మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానులు కలవరపడుతున్నారు.
నలుగురు రిటైన్ ఆటగాళ్ల ఆధారంగా కోర్ టీమ్‌ను బిల్డ్ చేసుకోవాలనుకున్న ముంబైకి పొలార్డ్ ఫిట్‌నెస్ సమస్య కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. వేలంలో పొలార్డ్‌కు బ్యాకప్ ప్లేయర్‌ను తీసుకోవాల్సిన పరిస్థితిని తెచ్చింది. విధ్వంసకర ఆల్‌రౌండర్లు మిచెల్ మార్ష్ వంటి ఆటగాళ్లను టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇషాన్‌ను తీసుకున్నా..
పొలార్డ్ ఫిటెనెస్ ఇష్యూస్ నేపథ్యంలో ముంబై అతన్ని రిటైన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేయాల్సిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పొలార్డ్‌కు బదులు విధ్వంసకర ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను తీసుకోవాల్సిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.అయితే తనదైన రోజున పొలార్డ్‌ను ఆపడం ఎవరీ తరం కాదనేది వాస్తవం. మరోవైపు.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లు మాత్రం దుమ్మురేపుతున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో సూర్యకుమార్ యాదవ్(83 బంతుల్లో 5 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీతో చెలరేగగా..తొలి వన్డేలో రోహిత్ శర్మ కూడా హాఫ్ సెంచరీతో మెరిసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications