ఆ రెండు సమస్యలకు ఆ ఇద్దరితో చెక్ పెట్టవచ్చు.. సీఎస్‌కేకు ఇర్ఫాన్ పఠాన్ కీలక అడ్వైజ్!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌కు మరో ఐదు రోజుల్లో తెరలేవనుంది. ఈ శనివారం(మార్చి 26) డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభమవ్వనుంది. ఇప్పటికే ఆయా జట్లన్నీ ముంబై చేరి సన్నాహకాలు మొదలుపెట్టాయి. అయితే లీగ్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు దీపక్ చాహర్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రూ. 14 కోట్లు భారీ ధరకు అతన్ని కొనుగోలు చేయగా.. అతను తొడకండరాల గాయంతో సగం మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక గత సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్ ఫిట్‌నెస్ సాధించడం సీఎస్‌కేకు ఊరట కలిగించినా.. అతనికి జోడీ ఎవరన్నది ఇంకా తేలలేదు.

ఇర్ఫాన్ పఠాన్ కీలక అడ్వైజ్..
గత సీజన్‌లో రుతురాజ్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన ఫాఫ్ డుప్లెసిస్‌ను వేలంలో ఆర్‌సీబీ కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించుకుంది. ఈ క్రమంలోనే ఈ రెండు సమస్యలనుద్దేశించి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీపక్ చహర్‌ను రీప్లేస్ చేయగల సత్తా అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్ రాజ్‌వర్ధన్ హంగర్కర్‌కు ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్‌కు కీలక అడ్వైజ్ ఇచ్చాడు.

హంగర్కర్ సేవలు..
'దీపక్ చహర్ గొప్ప బౌలర్. అతను దూరం కావడం సీఎస్‌కేకు ఎదురు దెబ్బే. నిజానికి శార్దూల్ ఠాకూర్ కూడా ఇప్పుడు సీఎస్‌కేలో లేడు. చహర్ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో యువ ఆటగాడు హంగర్కర్ సేవలను సీఎస్‌కే ఉపయోగించుకుంటే ఫలితం ఉంటుంది. అతను ప్రతిభావంతుడు. అయితే, హంగర్కర్ చాలా చిన్నవాడు. తనకు అనుభవం తక్కువ. కానీ ధోనీ వంటి సారథి ఉన్నపుడు ఇలాంటి విషయాలకు భయపడాల్సిన పనిలేదు. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఫలితాలు రాబట్టడం, వారిని సౌకర్యంగా మెదిలేలా చేయడంలో ధోనీ దిట్ట. కాబట్టి హంగర్కర్‌ను చహర్ ప్లేస్‌లో జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది'అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఊతప్పను తీసుకుంటే.
ఇక ఫాఫ్ స్థానం విషయంలో సీఎస్‌కేకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే. మరొకరు రాబిన్ ఊతప్ప. ఊతప్ప సైతం ఓపెనర్‌గా రాణించగలడనే నమ్మకం ఉంది. అయితే, సీఎస్‌కే వ్యూహం ప్రకారం ఓపెనింగ్ జోడీలో కచ్చితంగా ఒక విదేశీ ఓపెనర్ ఉండాలనుకుంటే... కాన్వే మంచి ఆప్షన్. అయితే కాన్వేకు బదులు రాబిన్ ఊతప్పకు అవకాశం ఇస్తే శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మహేశ్ తీక్షణను జట్టులోకి తీసుకొవచ్చు.' అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications