IPL 2022 వేలంలోకి అండర్ 19 హీరోల లేట్ ఎంట్రీ.. తెలుగు కుర్రాడిపై కన్నేసిన సన్‌రైజర్స్!

బెంగళూరు: పది టీమ్స్.. 217 ఖాళీలు.. రూ. 561.5 కోట్లు.. 600 మంది ప్లేయర్లు.. రెండు రోజులు..! క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఒక్క దెబ్బతో క్రికెటర్లను కోటీశ్వరులను చేసేందుకు రంగం సిద్దమైంది. ఐపీఎల్ 15వ సీజన్ కోసం బెంగళూరు వేదికగా మరికొద్ది సేపట్లో మెగా ఆక్షన్ ప్రారంభం కానుంది. కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్ సహా పది టీమ్స్‌లో ఖాళీగా ఉన్న 217 ప్లేస్‌ల కోసం మొత్తం 600 మంది ప్లేయర్లు బరిలో నిలిచారు.
లీగ్‌లో ఇదే చివరి మెగా వేలం కావడంతో రాబోయే ఐదారేళ్లను దృష్టిలో ఉంచుకొని బలమైన టీమ్స్‌ను తయారు చేసుకోవాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. దాంతో గత రికార్డులన్నీ ఈ ఆక్షన్‌లో బద్దలయ్యే చాన్సుంది.

ఆ రూల్ నుంచి మినహాయింపు..
అండర్ 19 ప్రపంచకప్‌లో సత్తా చాటి భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టిన కుర్రాళ్లకు ఎట్టకేలకు మెగావేలంలో అవకాశం లభించింది. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లోని పది మంది ప్లేయర్లను శుక్రవారం రాత్రి వేలం జాబితాలో చేర్చారు. భారత ఆటగాళ్లకు కనీసం 19 ఏళ్ల ఏజ్ లిమిట్, స్టేట్ సీనియర్ టీమ్‌కు ఒక్క మ్యాచ్ అయినా ఆడాలన్న రూల్ నుంచి మినహాయింపు ఇచ్చి వైస్ కెప్టెన్ షేక్ రషీద్ పాటు ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. దాంతో వేలంలో పాల్గొనే ప్లేయర్ల సంఖ్య 600కు పెరిగింది.

600 మంది ప్లేయర్లు..
వాస్తవానికి ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం 1214 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకుంటే అందులో నుంచి 590 మంది ప్లేయర్లను బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఈ జాబితాలో అండర్ 19 కెప్టెన్ యశ్‌ధుల్‌కి మినహా మరే కుర్రాడికి చోటు దక్కలేదు.
దాంతో బీసీసీఐ బోర్డు మెంబర్స్.. అండర్ 19 ఆటగాళ్ల వేలం విషయంలో పునరాలోచన చేయాలని, వారికి అవకాశం కల్పించాలని ప్రెసిండ్ సౌరవ్ గంగూలీతో పాటు సెక్రటరీ జైషాకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో చర్చించిన బోర్డు పెద్దలు.. నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తూ అండర్ 19 హీరోలకు అవకాశం కల్పించారు.

సూపర్ బ్యాటింగ్‌తో..
బీసీసీఐ నిర్ణయంతో అండర్ 19 టీమ్ వైస్ కెప్టెన్, తెలుగు కుర్రాడు షేక్ రషీద్‌తో పాటు దినేశ్ బానా, రవి కుమార్, నిషాంత్ సింధు, అంగ్రీష్ రఘువంశీ మనవ్ ప్రకాశ్, గార్వ్ సంగ్వాన్, సిద్దార్థ్ యాదవ్, ఆరాధ్య యాదవ్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అండర్ 19 ప్రపంచకప్‌లో తెలుగు తేజం రషీద్ నాలుగు మ్యాచ్‌లు ఆడి 50.25 సగటుతో 201 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కరోనా బారిన పడటంతో అతను రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ముఖ్యంగా సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 94, ఫైనల్లో ఇంగ్లండ్‌పై 50 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

సన్‌రైజర్స్ గురి..
ఇక షేక్ రషీద్‌ను తీసుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ భావిస్తోంది. మిడిలార్డర్‌లో అద్భుతంగా రాణిస్తున్న రషీద్‌ను తమకు అనుగుణంగా మార్చుకోవాలని భావిస్తోంది. టీమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అతన్ని ఎంచుకోవాలనుకుంటుంది. రషీద్‌కు ఇంకా 17 ఏళ్ల కావడంతో బ్యాకప్‌ప్లేయర్‌గా జట్టుకు పనికొస్తాడాని భావిస్తోంది. పైగా తెలుగు క్రికెటర్లకు ప్రోత్సాహకం అందించడం లేదని అపవాదును తుడిపేసుకోవాలనుకుంటుంది. ఇక రషీద్ కోసం ఇతర ఫ్రాంచైజీలు కూడా పోటీ పడే చాన్సుంది. అతను రూ.20 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉండగా.. రూ. 50 లక్షల నుంచి కోటీ పలికే చాన్సుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications