Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ఆ అభిషేక్‌ శర్మ అవసరమా? ముందు నుంచి చెబుతున్నాం ఆ దరిద్రుడు వద్దని.. SRH ఫ్యాన్స్ ఫైర్!

IPL 2022: Hyderabad Fans Trolls On SRH Playing 11 Asking Is Abhishek Sharma Required?

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే తుది జట్టులో రెండు మార్పులు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రొమారియో షెఫెర్డ్, అబ్దుల్ సమద్‌లపై వేటు వేసి మార్కో జాన్సెన్, శశాంక్ సింగ్‌లను తీసుకుంది. అయితే ఈ తుది జట్టు‌పై హైదరాబాద్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం నుంచి జట్టుకు భారంగా మారిన అభిషేక్ శర్మను జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు.

రూ.6.50 కోట్లు దండుగ..

రూ.6.50 కోట్లు దండుగ..

వేలంలో అతన్ని రూ.6.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయగా... ఇప్పటి వరకు అతను ఒక్క మ్యాచ్ ఆడింది లేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. బౌలింగ్‌లోనూ రాణించిందేం లేదు. అతని ఘోర వైఫల్యం కారణంగా కేన్ విలియమ్సన్ కూడా వికెట్ సమర్పించుకోవాల్సి వస్తుంది. ఓపెనర్‌గా ఆడుతున్న అభిషేక్ శర్మ ఎలాంటి షాట్ల ఆడకుండా తడబడుతుండటంతో కేన్ మామ తన శైలికి భిన్నంగా భారీ షాట్లు ఆడాల్సి వచ్చి పెవిలియన్‌కు చేరుతున్నాడు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ‌ను పక్కనపెట్టాలని అభిమానులు సూచించారు.

రాయలేని పదాలతో...

రాయలేని పదాలతో...

కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ మాత్రం అభిషేక్ శర్మకు మరో అవకాశం ఇచ్చింది. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అసలు అభిషేక్ శర్మను ఎందుకు తీసుకున్నారని మండిపడుతున్నారు. ఫన్నీ మీమ్స్, తెలుగు డైలాగ్స్‌తో సెటైర్లు పేల్చుతున్నారు. రాయలేని పదాలతో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అభిషేక్ శర్మతో పాటు ఉమ్రాన్ మాలిక్‌‌ను అనవసరంగా ఆడిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

IPL 2022 : Something Wrong In SRH Franchise - Salman Butt | Oneindia Telugu
ఉమ్రాన్ మాలిక్ సైతం..

ఉమ్రాన్ మాలిక్ సైతం..

ఉమ్రాన్ మాలిక్‌కు పేస్ ఉంది కానీ.. బౌలింగ్‌లో వేరియేషన్స్ లేవని, లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయలేక ధారళంగా పరుగులిస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. అతనికి బదులు కార్తీక్ త్యాగీని ఆడించాలంటున్నారు. రెండు మ్యాచ్‌లకు పక్కన పెట్టాల్సి వచ్చిన అబ్దుల్ సమద్‌ను ఎందుకు రిటైన్ చేసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి ప్లానింగ్ లేకుండా మెగా వేలం బరిలోకి దిగారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Saturday, April 9, 2022, 16:56 [IST]
Other articles published on Apr 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+