Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అంటే ఇదే.. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరాలేంటే..?

IPL 2022: How Royal Challengers Bangalore (RCB) can qualify for playoffs

హైదరాబాద్: గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అంటే ఇదేనేమో. ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో సత్తా చాటి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ).. సెకండాఫ్‌లో హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడింది. అద్భుతమైన ప్రదర్శనతో సునాయసంగా ప్లే ఆఫ్స్ చేరేలా కనిపించిన ఆర్‌సీబీ.. పేలవ ప్రదర్శనతో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 5 మాత్రమే గెలిచిన ఆ జట్టు.. ప్లే ఆఫ్స్ చేరాలంటే టోర్నీలో మిగిలిన నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది.

పరాజయాలతో బయటపడ్డ లుక లుకలు..

పరాజయాలతో బయటపడ్డ లుక లుకలు..

అయితే హ్యాట్రిక్ పరాజయాలతో ఆ జట్టు లుకలుకలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో గత మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీతో రాణించినా.. నెమ్మదిగా ఆడటం( 53 బంతుల్లో 58) ఇతర బ్యాటర్లను ఒత్తిడికి గురి చేసింది. బౌలింగ్ లైనప్ సైతం బలహీనంగా కనిపిస్తోంది. మహమ్మద్ సిరాజ్ ధారళంగా పరుగులిస్తుండటం జట్టుకు నష్టం చేస్తోంది. ఆరంభంలో అద్భుతంగా రాణించినటువంటి హర్షల్ పటేల్, జోష్ హజెల్ వుడ్ వికెట్లు తీయకుండా విఫలమవుతుండటం జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. పవర్ హిట్టింగ్‌తో సంచలన విజయాలందించిన దినేశ్ కార్తీక్ కూడా వరుసగా విఫలమవడం ఆర్‌సీబీకి నష్టం చేస్తోంది.

ప్లే ఆఫ్స్ చేరాలంటే..

ప్లే ఆఫ్స్ చేరాలంటే..

ఈ పరిస్థితుల్లో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే టోర్నీలో మిగిలిన నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలవాలి. ఆ జట్టు చెన్నై, హైదరాబాద్, పంజాబ్, గుజరాత్‌తో చివరి నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నాలుగింటిలో విజయం సాధిస్తే మొత్తం 9 విజయాలు 18 పాయింట్లతో ఎలాంటి టెన్షన్ లేకుండా ప్లే ఆఫ్స్ చేరుతోంది. మెరుగైన రన్‌రేట్ సాధిస్తే పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలుస్తోంది. అయితే ఈ నాలుగింటి ఒక్క మ్యాచ్ ఓడినా ఆ జట్టు క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటుంది.

మెరుగైన రన్ రేట్ ఉంటే..

మెరుగైన రన్ రేట్ ఉంటే..

ఒక్క మ్యాచ్ ఓడితే ఆ జట్టుకు 16 పాయింట్స్ లభిస్తాయి. మెరుగైన రన్ రేట్ ఉంటే నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్ చేరుతోంది. ఈ సారి కొత్తగా రెండు జట్లు రావడంతో 16 పాయింట్స్ రెండు, మూడు టీమ్స్ సాధించనున్నాయి. ఈ క్రమంలోనే నెట్ రన్ రేట్ కీలకం కానుంది. ప్రస్తుతం ఆర్‌సీబీ నెట్ రన్ రేట్(-0.558) నెగటీవ్‌గా ఉంది. దీన్ని మెరుగుపరుచుకోవాలంటే తదుపరి నాలుగు విజయాల్లో ఆ జట్టు భారీ విజయాలు సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కటి కంటే ఎక్కువ ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆవిరవుతాయి.

Story first published: Monday, May 2, 2022, 16:24 [IST]
Other articles published on May 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+