ఆ రెండు ఓవర్లే మా కొంపముంచాయి: హార్దిక్ పాండ్యా

ముంబై: బ్యాటింగ్ వైఫల్యానికి తోడు చెత్త బౌలింగ్ కూడా తమ ఓటమిని శాసించిందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో చిత్తయింది. లీగ్‌లో హ్యాట్రిక్ విజయాల తర్వాత గుజరాత్ టైటాన్స్‌కు ఎదురైన తొలి ఓటమి ఇదే. మరోవైపు రెండు వరుస పరాజయాల తర్వాత హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. బ్యాటింగ్ పరంగా 7-10 పరుగులు తక్కువ చేయడం, చేజింగ్‌లో ఓ రెండు ఓవర్లలో 30కి పరుగులిచ్చుకోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు.
మరో 10 పరుగులు చేస్తే..
'బ్యాటింగ్ పరంగా మేం 7-10 పరుగులు తక్కువగా చేశాం. ఆ రన్స్ ఉంటే ఫలితం మరోలా ఉండేది. బంతితో మేం మంచి ఆరంభమే అందుకున్నాం. కానీ ఓ రెండు ఓవర్లలో సన్‌రైజర్స్ బ్యాటర్లు 30 పరుగులు చేసి మ్యాచ్‌పై పట్టు సాధించారు. ఐపీఎల్ చాలా కఠినమైనది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో నేను ఇబ్బంది పడ్డాను. అతని రాకాసి బౌన్సర్ తలకు తాకడంతో దిమ్మతిరిగింది. మాలికే కాదు సన్‌రైజర్స్ బౌలర్లంతా అద్భుతంగా బౌలింగ్ చేశారు.

సూపర్ బౌలింగ్..
ముఖ్యంగా స్లాగ్ ఓవర్స్‌లో సరైన బంతులు వేసి కట్టడి చేశారు. బౌన్స్ వారికి సహకరించింది. ఈ విజయం క్రెడిట్ సన్‌రైజర్స్ బౌలర్లదే. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేసి ఫలితం రాబట్టారు. మేం మా తప్పిదాలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మరో రెండు రోజుల్లో ఉన్న మా తదుపరి మ్యాచ్‌కు రెడీ అవుతున్నాం. రిలాక్స్ అయి గేమ్‌ను ఆస్వాదిస్తాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

సన్‌రైజర్స్ జోరు..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (42 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 50 నాటౌట్) అర్ధ సెంచరీ చేయగా, అభినవ్ మనోహర్ (21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించాడు.
అనంతరం హైదరాబాద్ 19.1 ఓవర్లలో 2 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ విలియమ్సన్ (46 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు 57) హాఫ్ సెంచరీ సాధించగా, అభిషేక్ శర్మ (32 బంతుల్లో 6 ఫోర్లతో 42), పూరన్ (18 బంతు ల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్) మెరిశారు.

చెత్త రికార్డు..
సన్‌రైజర్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 22 అదనపు పరుగులు (ఎక్స్‌ట్రాలు) సమర్పించుకుంది. ఇందులో 20 వైడ్‌లు ఉన్నాయి! ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒకసారి బెంగళూరు ఇంతకంటే ఎక్కువ వైడ్‌లు (21-ఇదే సీజన్‌లో పంజాబ్‌పై) ఇచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications