
ఇప్పటికే 618 రన్స్..
ఈ సీజన్‌లో ఇప్పటికే రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ 11 ఇన్నింగ్స్‌ల్లో 618 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలున్నాయి. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్న బట్లర్.. కోహ్లీ రికార్డు దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే జోస్ బట్లర్‌పై ప్రశంసల జల్లు కురిపించిన భజ్జీ.. విరాట్ రికార్డు అధిగమించే సత్తా అతనికి ఉందని తెలిపాడు. స్పోర్ట్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బజ్జీ ఈ విషయాన్ని వెల్లడించాడు.

ప్లే ఆఫ్స్ చేరితే..
'విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును జోస్ బట్లర్ కచ్చితంగా అధిగమిస్తాడు. అతనికే ఆ సత్తా ఉంది. అతను ఆడుతున్న విధానం, ఫామ్ చూస్తే బట్లర్‌ను ఆ రికార్డు అందుకోకుండా ఆపడం కష్టం. అయితే పిచ్‌లు చాలా నెమ్మదిగా మారిన నేపథ్యంలో అతను స్పిన్‌ను ఎలా ఆడుతాడనేది చూడాలి. అయితే వికెట్లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటే మాత్రం అతను సులువుగా ఈ రికార్డు అందుకుంటాడు. ఒకవేళ రాజస్థాన్ ప్లే ఆఫ్స్ చేరి, ఫైనల్ కూడా వెళ్లి 17 మ్యాచ్‌లు ఆడితే విరాట్ కోహ్లీ రికార్డును బట్లర్ కనుమరుగు చేస్తాడు.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

ధావన్‌ను గుర్తించడం లేదు..
పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు రావాల్సినంత పేరు రావడం లేదని భజ్జీ అన్నాడు. అతను ఐపీఎల్‌లో 6 వేల పరుగులు చేసినా ఎవరూ కూడా ధావన్ గురించి పెద్దగా మాట్లాడం లేదన్నాడు. ఇతర ప్లేయర్లలా అతనికి రావాల్సిన గుర్తింపు దక్కడం లేదని తెలిపాడు. అతనో ఐపీఎల్ లెజెండన్న భజ్జీ.. ధావన్ అన్ని జట్లపై రాణించి తాను ఎంతటి విలువైన ఆటగాడినో తెలియజేశాడని చెప్పాడు. పంజాబ్ జట్టులో బాధ్యతాయుతంగా ఆడటం అతని ప్రాతని చెప్పుకొచ్చాడు.

ప్లే ఆఫ్స్ దిశగా రాజస్థాన్..
కాగా, రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో (గ్రూప్ దశలో) రెండింటిలో గెలిచినా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్
నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 189 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో(40 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో) హాఫ్ సెంచరీతో రాణించగా.. జితేశ్ శర్మ(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. లివింగ్ స్టోన్(22), భానుక రాజపక్స(27) కూడా విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 3 వికెట్లు తీయగా.. అశ్విన్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications












