IPL 2022: గుజరాత్ టైటాన్స్‌లోకి సురేశ్ రైనా! జాసన్ రాయ్ రిప్లేస్‌మెంట్‌గా...

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు సీజన్ ఆరంభానికి ముందే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ జాసన్ రాయ్.. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ ఆడలేనని ప్రకటించాడు. దాంతో గుజరాత్‌కు మరో ప్లేయర్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. 10 జట్లతో స్టార్ ఆటగాళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడగా.. తక్కువ ధరకే స్టార్ ప్లేయర్‌ను దక్కించుకున్నామనే సంతృప్తి గుజరాత్‌కు లేకుండా పోయింది. రూ.2 కోట్ల కనీస ధరకు జాసన్ రాయ్‌ను తీసుకున్న గుజరాత్.. ఇప్పుడు అదే బడ్జెట్‌లో మరో ప్లేయర్‌ను తీసుకోవాలి. ఈ క్రమంలోనే ఐపీఎల్ అభిమానులు గుజరాత్ టైటాన్స్‌కు మంచి సలహా ఇస్తున్నారు.

రైనాను తీసుకోండి..
ఐపీఎల్ 2022 సీజన్ వేలంలో అమ్ముడుపోని జాబితాలో నిలిచిన సురేశ్ రైనాతో జాసన్ రాయ్ ప్లేస్‌ను భర్తీ చేయాలని సూచిస్తున్నారు. మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాతో జట్టుకు బలం చేకూరుతుందని, అతని అనుభవం జట్టు ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే రైనా అతి ముఖ్యమైన ఆటగాడని, అతని రికార్డులు చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందన్నాడు. అతన్ని జట్టులోకి తీసుకుంటే యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా కూడా పనికొస్తాడని చెబుతున్నారు.
మిస్టర్ ఐపీఎల్..
గత సీజన్‌లో సురేశ్ రైనా విఫలమైనప్పటికీ లీగ్‌లో అతనికి గొప్ప రికార్డు ఉంది. ఇప్పటివరకు 205 మ్యాచ్‌లు ఆడిన సురేశ్ రైనా.. 5528 రన్స్ చేశాడు. 32.52 సగటుతో పాటు 135 స్ట్రైక్‌రేట్‌తో టాప్ స్కోర్ బ్యాట్స్‌మన్ లిస్ట్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలున్నాయి. సురేశ్ రైనాను ఐపీఎల్ ఆల్‌టైమ్ గ్రేటేస్ట్ బ్యాట్స్‌మన్‌గా పిలుస్తారు. గతంలో గుజరాత్ లయన్స్ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం కూడా ఉంది. దాంతోనే రైనాను మిస్టర్ ఐపీఎల్ అంటారు. ఇక గుజరాత్ టైటాన్స్ కూడా రైనాను తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బయో బబుల్‌లో ఉండలేక..
ఇక కఠిన బయో బబుల్‌లో ఉండలేకనే ఐపీఎల్ 2022 సీజన్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నానని జోస్ బట్లర్ తెలిపాడు. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యంతో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. తనపై నమ్మకం ఉంచి మెగా వేలంలో కొనుగోలు చేశారని, కానీ కుటుంబంతో గడపాలనే ఉద్దేశం, బయో బబుల్‌ల కారణంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. గుజరాత్ ఫ్యాన్స్ అంతా తనను మన్నించాలని.. ఐపీఎల్‌కు దూరంగా ఉన్నా.. తన పూర్తి మద్దతు గుజరాత్ టైటాన్స్‌కే ఉంటుందని చెప్పాడు. భవిష్యత్తులో పెద్ద టోర్నీలు ఉండటంతో.. కెరీర్ పరంగా ఎదగాలన్న తకు కాస్త విశ్రాంతి అవసరమని, అందుకే ఐపీఎల్ ఆడాలనుకోవడం లేదని పేర్కొన్నాడు.

పీఎస్‌ఎల్‌లో అదరగొట్టి..
గతేడాది కూడా ఐపీఎల్ ఫస్టాఫ్‌కు దూరమైన రాయ్.. సెకెండాఫ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడాడు. అంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు జాసన్ రాయ్ ప్రాతినిథ్యం వహించాడు. ఇక జాసన్ రాయ్ చివరిసారిగా పాకిస్థాన్ సూపర్ లీగ్ -2022లో పాల్గొన్నాడు. పీఎస్‌ల్‌లో రాయ్ అద్భుతంగా రాణించాడు. కేవలం 6 మ్యాచ్‌లు ఆడిన రాయ్.. 303 పరుగులు సాధించించాడు. అతని ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా తన ఐపీఎల్ కెరీర్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన రాయ్ 329 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తం మహారాష్ట్రలోనే జరగనుంది. ముంబై, పుణే వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications