తెలుగును ఓన్ చేసుకోవడం లేదు..
అన్ని ఫ్రాంచైజీలు తమ సొంత అభిమానులను ఎంగేజ్ చేసుకోవడంతో పాటు ఆయా రాష్ట్రాల భాషా, సంస్కృతిలను ఓన్ చేసుకుంటూ వారితో మమేకం అవుతున్నాయి. ఏళ్లు గడుస్తున్న ఈ విషయంలో సన్‌రైజర్స్ ఏం చేయలేకపోతుంది. కనీసం సోషల్ మీడియాలో కూడా తెలుగు ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కనీసం ట్వీట్స్‌ను కూడా తెలుగులో చేయడం లేదు. ఇన్నాళ్లు జట్టు కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్.. తెలుగు భాషను, సంస్కృతిని ఓన్ చేసుకుంటూ అభిమానులకు దగ్గరయ్యాడు. సినిమా డైలాగ్స్, తెలుగు పాటలకు చిందేస్తూ అలరించాడు.
వార్నర్ దూరమవ్వడంతో..
అతని ఎంటర్‌టైన్‌మెంట్‌తో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ తప్పిదాలను ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ వార్నర్‌తో వాగ్వాదం పెట్టుకొని జట్టులో నుంచి వెళ్లగొట్టాక.. సన్‌రైజర్స్‌పై ఫ్యాన్స్ కన్నెర్ర చేస్తున్నారు. ప్రతీ విషయాన్ని భూతద్దంలో పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. వేలంలో అట్టర్ ఫ్లాఫ్ అయిన కావ్య అండ్ కోను బండ బూతులు తిట్టారు. రాయలేని పదాలతో ట్రోల్ చేశారు. ఇక మెగా ఆక్షన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్దమవుతూ.. ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తుంటే సన్‌రైజర్స్ ఇంకా మొద్దు నిద్ర వీడటం లేదు.
చెన్నైలో ప్రాక్టీస్ క్యాంప్?
ఇక ముంబైకి తరలి వెళ్లే ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ చెన్నైలో ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు సన్‌రైజర్స్.. హైదరాబాద్ టీమా? లేక చెన్నైదా? అని ప్రశ్నిస్తున్నారు. అయినా చెన్నైకి చెందిన చెన్నై సూపర్ కింగ్సే.. సూరత్ ప్రాక్టీస్ క్యాంప్ పెట్టుకోగా.. సన్‌రైజర్స్ అక్కడ నిర్వహించడం ఏందని మండిపడుతున్నారు. ఏ మాత్రం ధమాక్ లేదని తిట్టిపోస్తున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బెంగళూరు వేదికగా తమ ఫ్యాన్స్ కోసం పెద్ద ఈవెంట్ నిర్వహిస్తోంది.
ఆర్‌సీబీని చూసి నేర్చుకోండి..
కన్నడకు ప్రాధాన్యత ఇస్తూ ఆ రాష్ట్ర అభిమానులను మరింత దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం తమకు అభిమానులే అక్కర్లేదు అనే తరహాలో ప్రవర్తిస్తుంది. లీగ్ మొత్తం మహారాష్ట్రలో జరుగుతుండగా.. అక్కడిలా పోలీ ఉన్న మైదానల్లో ప్రాక్టీస్ చేయకుండా చెన్నైలో శిక్షణ శిభిరం పెట్టడం ఏందని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కనీసం హైదరాబాద్‌లోనైనా ఈ ప్రాక్టీస్ క్యాంప్ పెట్టి ఉంటే అభిమానల్లో జోష్ అయినా వచ్చేదంటున్నారు. అభిమానులే కాదు క్రికెట్ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ తెలుగు క్రికెట్ కామెంటేటర్, అనలిస్ట్ వెంకటేశ్ కూడా ట్విటర్ వేదికగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications
