Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ముంబై ఇండియన్స్ తొండాట.. పరువు కోసం పవర్ కట్! అంబాని అడ్డదారి.. పేలుతున్న సెటైర్లు!

 IPL 2022: Fans Reactions After DRS Was Denied To Devon Conway Due To Powercut

ముంబై: ఐపీఎల్..భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్. అనామక ఆటగాళ్లపై కనక వర్షం కురిపిస్తున్న రిచెస్ట్ టోర్నీ. అయితే తాజాగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నిర్వహకులు అలసత్వం ఐపీఎల్‌ పరువు దిగజారేలా చేసింది. వరల్డ్ ఫేమస్ లీగ్‌లో కీలక మ్యాచ్‌కు పవర్ కట్ సమస్యగా మారింది. దాంతో అభిమానులు బీసీసీఐ‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ ఫేమస్ లీగ్‌లో ఇంత అలసత్వమా? అని మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం ముంబై ఇండియన్స్ తొండాట అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవడం కోసం ముఖేష్ అంబారీ ఇలా పవర్ కట్ చేశాడంటూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

ముంబైలోని వాంఖడే స్టేడియంలో సాంకేతిక సమస్యల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. ఫ్లడ్‌ లైట్స్ వెలగకపోవడంతో దాదాపు 5 నిమిషాల పాటు ఇరుజట్ల కెప్టెన్లు ఎదురుచూడాల్సి వచ్చింది. చివరకు పవర్ కట్ కారణంగా డీఆర్‌ఎస్‌లు లేకుండానే మ్యాచ్‌ను ప్రారంభించారు. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌ను ఘోరంగా దెబ్బ తీసింది. డానియల్ సామ్స్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే డివాన్ కాన్వేని అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్‌గా ప్రకటించాడు. ఎల్బీడబ్ల్యూల విషయాల్లో చాలాసార్లు అంపైర్లు ఇచ్చిన నిర్ణయాలు, రివ్యూలో తారుమారు అయ్యాయి.

అంపైర్ ఘోర తప్పిదం..

అయితే పవర్ కట్ కారణంగా డీఆర్‌ఎస్ తీసుకునే అవకాశం లేకపోవడంతో కాన్వే నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండో బంతికే వన్‌డౌన్‌లో వచ్చిన మొయిన్ ఆలీ కూడా డకౌట్ అయ్యాడు... టీవీ రిప్లైలో కాన్వే ఎదుర్కొన్న బంతి, లెగ్ స్టంప్‌ని మిస్ అవుతున్నట్టు కనిపించింది. దీంతో కీలక మ్యాచ్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్‌ను కకావికలం చేసింది. రెండో ఓవర్ నాలుగో బంతికి రాబిన్ ఊతప్ప సైతం వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికీ కరెంట్ రాకపోవడంతో డీఆర్‌ఎస్ కోరుకునే అవకాశం లేకపోయింది. దాంతో ఊతప్ప(1) నిరాశగా పెవిలియన్ చేరాడు. రెండు ఓవర్ల అనంతరం పవర్ సమస్య తీరగా.. రివ్యూలు అందుబాటులోకి వచ్చాయి.

జనాలే కాదు.. బీసీసీఐ కూడా..

ఇక వరల్డ్ బెస్ట్ లీగ్‌కు పవర్ కట్ సమస్యగా మారడటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలాంటి లీగ్‌లో పవర్ కట్ అవ్వడం సిగ్గు చేటని, కోట్ల డబ్బులున్న బీసీసీఐ ఈ విషయంలో సిగ్గుపడాలని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. యావత్ ప్రపంచం ముందు భారత్ పరువు తీసారని బీసీసీఐపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలే కాదు బీసీసీఐ కూడా ఐపీఎల్ 2022 సీజన్‌ను లైట్ తీసుకుందని సెటైర్లు పేల్చుతున్నారు.

కుప్పకూలిన చెన్నై..

ఈ మ్యాచ్‌లో డానియల్ సామ్స్(3/16), కుమార్ కార్తీకేయ(2/22), రిలే మెరెడిత్(2/27) బంతితో చెలరేగడంతో చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. మహేంద్ర సింగ్(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) ఒంటరి పోరాటం చేయడంతో చెన్నై పరువు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో చెన్నైకి ఇది రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై సైతం 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో తెలుగు తేజం తిలక్ వర్మ(32 బ్యాటింగ్) ఆదుకున్నాడు.

Story first published: Thursday, May 12, 2022, 22:52 [IST]
Other articles published on May 12, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+