For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతని విలువ ఏంటో తెలిసొచ్చింది.. ఆ తప్పిదం కొంపముంచింది: ఫాఫ్ డుప్లెసిస్

IPL 2022: Faf du Plessis says Harshal Patel was really missed after losing to CSK

ముంబై: స్టార్ పేసర్ హర్షల్ పటేల్ లేని లోటు తమకు తెలిసొచ్చిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన డుప్లెసిస్ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.

ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. మిడిల్ ఓవర్లలో ధారళంగా పరుగులిచ్చుకోవడం విజయవకాశాలను దెబ్బతీసింది. ఇక 200 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేటప్పుడు శుభారంభం దక్కడం చాలా ముఖ్యమని, టాప్-4 బ్యాట్స్‌మెన్ రాణించాలని, కానీ అది జరగలేదని డుప్లెసిస్ అన్నాడు.

ఆరంభంలో కట్టడి చేసినా..

ఆరంభంలో కట్టడి చేసినా..

'ఆరంభంలో 7-8 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసాం. కానీ 8-14 ఓవర్ల మధ్య స్పిన్నర్లతో వేయించాం. చెన్నై బ్యాట్స్‌మన్ అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా శివం దూబే స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగాడు. మంచి భాగస్వామ్యంతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించి మూమెంటమ్‌ను మార్చేసారు. భారీ లక్ష్యాన్ని చేధించేటప్పుడు శుభారంభం దక్కడం ముఖ్యం. టాప్-4 బ్యాట్స్‌మెన్‌ మంచి పునాది వేయాలి. దురదృష్టవశాత్తు మేం అది చేయలేకపోయాం. చెన్నై అద్భుతంగా బౌలింగ్ చేసింది. చెన్నై స్పిన్నర్లు పిచ్‌పై ఉన్న గ్రిప్‌ను అద్భుతంగా వాడుకున్నారు.

హర్షల్ పటేల్ లేకపోవడం..

హర్షల్ పటేల్ లేకపోవడం..

వరుసగా వికెట్లు కోల్పోవడంతో మేం మూమెంటమ్ లాసయ్యాం. అయినా అద్భుతంగా పుంజుకున్నాం. ఓ దశలో విజయం దిశగా పయనించాం. బ్యాటింగ్‌లో మా డెప్త్ ఏంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక హర్షల్ పటేల్‌ లేని లోటు స్పష్టంగా తెలుసొచ్చింది. అతని సేవలను మేం చాలా మిస్సయ్యాం. మిడిల్ ఓవర్లలో అతని కట్టడి అయిన బౌలింగ్ లేకనే చెన్నై భారీ స్కోర్ చేసింది.

వీలైనంత త్వరగా అతను జట్టుతో కలుస్తాడని ఆశిస్తున్నాం. జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. అద్భుతంగా బౌలింగ్ చేశారు. మా విజయానికి ఇంకా 20 పరుగులే తక్కువయ్యాయి. దీన్ని బట్టి మా టీమ్ పెర్ఫామెన్స్‌ను అర్థం చేసుకోవచ్చు.'అని ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు.

దూబే, ఊతప్ప విధ్వంసం..

దూబే, ఊతప్ప విధ్వంసం..

ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. శివమ్‌ దూబె ( 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 నాటౌట్‌), రాబిన్‌ ఉతప్ప ( 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 88) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. అనంతరం బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసింది.

షాబాజ్‌ అహ్మద్‌( 27 బంతుల్లో 4 ఫోర్లతో 41), సూయాశ్‌ ప్రభుదేశాయ్‌ ( 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34), దినేశ్‌ కార్తీక్‌ ( 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) రాణించారు. ఛేదనలో చకచకా నాలుగు వికెట్లు పడ్డా బెంగళూరు పోరాడింది. తీక్షణ (4/33), జడేజా (3/39) బెంగళూరును దెబ్బతీశారు.

Story first published: Wednesday, April 13, 2022, 9:16 [IST]
Other articles published on Apr 13, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+