Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ఫ్రాంచైజీ కొనుగోలుకే 7 వేల కోట్లా? ఏమైనా లాభం ఉంటుందా? నట్టేట మునుగుడేనా?

Crore deals for new IPL teams

దుబాయ్: ఐపీఎల్‌లోకి రెండు కొత్త జట్లు వచ్చేశాయి. లక్నో అహ్మదాబాద్ బేస్‌లుగా రెండు నూతన ఫ్రాంచైజీలను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ బేస్ ప్రైజ్‌కు 160 శాతం అదనంగా చెల్లించి రూ. 5,625 కోట్లకు కొనుగోలు చేయగా... లక్నో జట్టును బిజినెస్ టైకూన్ సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్పీఎస్జీ గ్రూప్ రూ. 7090 కోట్లకు 250 శాతం అదనంగా వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. ఈ రెండు ఫ్రాంచైజీల రాకతో భారత క్రికెట్ బోర్డుపై మరోసారి కాసుల వర్షం కురిసింది. ఏకంగా బీసీసీఐ ఖజానాలోకి రూ. 12,715 కోట్లు చేరనున్నాయి. బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీల కనీస ధర రూ. 2000 కోట్లగా నిర్ణయించింది. అయినా సరే అంతకు మూడు రెట్లు ఎక్కవగానే కంపెనీలు బిడ్లు దాఖలు చేయడం విశేషం. అయితే ఇన్నివేల కోట్లు వెచ్చించిన ఈ కంపెనీలకు ఏమైనా లాభం కలుగుతుందా? అనే సందేహం కలుగుతోంది.

ప్రేక్షుకుల వల్లే కాదు..

ప్రేక్షుకుల వల్లే కాదు..

అయితే బీసీసీఐ రూపొందించిన ఐపీఎల్ బిజినెస్ ఫార్మాట్ చాలా సురక్షితమైనదిగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మైదానాలకు వచ్చే ప్రేక్షకుల ద్వారానే కాకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు స్పాన్సర్లు, బ్రాడ్ కాస్టింగ్ హక్కుల ద్వారా ఆదాయం లభిస్తోంది. వీటిద్వారా వచ్చే బోర్డు ఆదాయంలో 50 శాతం సెంటర్ పూల్ ద్వారా ఆయా ఫ్రాంచైజీలకు చెల్లిస్తారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెల్లించాల్సిన ఫీజును మినహాయించుకొని మిగతా మొత్తాన్ని ఫ్రాంచైజీలకు బదిలీ చేస్తారు. అంటే ఫ్రాంచైజీలు ప్రతీ ఏడాది చెల్లించాల్సిన ఫీజు ఆ మేరకు తగ్గిపోతున్నది.

 టాప్‌లో ముంబై, చెన్నై..

టాప్‌లో ముంబై, చెన్నై..

ఇక ప్రతీ ఫ్రాంచైజీకి కిట్ స్పాన్సర్ల నుంచి ప్రిన్సిపల్ స్పాన్సర్ల వరకు అనేక రూపాల్లో ఆదాయం లభిస్తున్నది. ఆయా ఫ్రాంచైజీల ప్రదర్శన ద్వారా స్పాన్సర్లు ముందుకు వస్తుంటారు. ఐపీఎల్‌లో అత్యధిక ఆదాయం పొందే ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్. ఆ జట్టు వరుసగా టైటిల్స్ సాధిస్తూ ఉండటంతో స్పాన్సర్లు కూడా క్యూ కడుతున్నారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా మంచి లాభాలనే అర్జిస్తున్నది. ధోనీ సారథ్యంలోని ఆ జట్టు మంచి మార్కెట్ వాల్యూ కలిగి ఉన్నది. ఈ ఏడాది పూర్తిగా నిరాశ పరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా మంచి లాభాల్లో ఉన్నది. మిగిలిన ఫ్రాంచైజీలు కూడా కాస్తో కూస్తో లాభాలు అందుకుంటున్నాయి.

ఒకేసారి చెల్లించాల్సిన పని లేదు..

ఒకేసారి చెల్లించాల్సిన పని లేదు..

ఇప్పుడు కొత్తగా వచ్చిన లక్నో జట్టును తీసుకుంటే.. ఆ జట్టును రూ. 7090 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ ఫ్రాంచైజీ ప్రతీ ఏడాది రూ. 709 కోట్లను బీసీసీఐకి ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా ప్లేయర్ల కొనుగోలు, రవాణా, వసతి వంటి అతనపు ఖర్చులు ఉంటాయి. సహాయక సిబ్బంది, టీమ్ మేనేజ్‌మెంట్ జీతభత్యాల కోసం భారీగానే చెల్లిపులు చేయాలి. ఎంత లేదన్నా.. ప్రతీ ఏడాది దాదాపు రూ. 1000 కోట్లు లక్నో యాజమాన్యానికి ఖర్చు ఉంటుంది. అంటే ఆ యాజమాన్యం స్పాన్సర్లును భారీ మొత్తాలకు ఏర్పాటు చేసుకోవాలి.

అయితే వచ్చే ఏడాది నుంచి టికెట్ ఆదాయం కూడా వస్తుందని చెబుతున్నారు. లక్నోలో ఇటీవల భారీ స్టేడియం నిర్మించారు. కాబట్టి ఆ ఆదాయం కూడా బాగానే ఉండే అవకాశం ఉన్నది. వచ్చే ఏడాది బ్రాడ్ కాస్ట్ హక్కులు కూడా అమ్ముడు పోనున్నాయి. వాటికి కనుక మరింత ఎక్కువ ధర వస్తే కొత్త జట్లకు ఆర్థిక కష్టాలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

Story first published: Wednesday, October 27, 2021, 7:12 [IST]
Other articles published on Oct 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+