IPL 2022 Eliminator మ్యాచ్‌లో ఆర్‌సీబీదే విజయం: సంజయ్ మంజ్రేకర్

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజయం సాధిస్తుందని భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అంచనా వేసాడు. కోల్‌కతా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆటగాళ్లు చెలరేగుతారని మంజ్రేకర్ జోస్యం చెప్పాడు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు ప్లే ఆఫ్స్‌లో మంచి రికార్డు ఉందని చెప్పాడు. కోహ్లీ కూడా ఫామ్‌లోకి రావడంతో జట్టు బలం రెట్టింపు అయిందని తెలిపాడు. ఈ ఎలమినేటర్ మ్యాచ్ గురించి ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ ఫోతో మాట్లాడిన మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆర్‌సీబీదే విజయం..
'ఆర్‌సీబీకే విజయవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్లకు స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్ రికార్డు ఓసారి చూడండి. ప్లే ఆఫ్స్‌లో అతను మరింతగా రెచ్చిపోతాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా గేరు మార్చాడు. అనుభవం కలిగిన ఆర్‌సీబీ జట్టు ఇలాంటి కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని అధిగమించి మంచి ప్రదర్శన నమోదు చేయగలదు. కాబట్టి వాళ్లు గెలుస్తారు.'అని అభిప్రాయపడ్డాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్-1లో ఓడిన రాజస్తాన్ రాయల్స్‌తో తలపడుతుంది. క్వాలిఫైయర్-2లో గనుక గెలుపొందితే గుజరాత్ టైటాన్స్‌తో పాటు ఫైనల్లో అడుగుపెట్టి టైటిల్ రేసులో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడుసార్లు వరుసగా ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ, అరంగేట్రంలోనే అదరగొట్టిన లక్నో విజయంపై కన్నేసింది.

కైఫ్ మాత్రం లక్నోకే..
మరోవైపు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మాత్రం లక్నో సూపర్ జెయింట్స్‌నే విజయం వరిస్తుందని తెలిపాడు. ఏ లెక్కన చూసిన ఆర్‌సీబీ కంటే లక్నో చాలా బలంగా ఉందని చెప్పాడు. 9 విజయాలతో లక్నో ప్లే ఆఫ్స్ చేరితే.. ఆర్‌సీబీ 8 విజయాలతో లక్కీగా టోర్నీలో ముందడుగు వేసిందన్నాడు. లక్నోతో పోల్చితే ఆర్‌సీబీ బౌలింగ్ మరీ బలహీనంగా ఉందన్న కైఫ్.. బ్యాటింగ్‌లో కూడా కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ సూపర్ ఫామ్‌లో ఉన్నారని తెలిపాడు.
'పేలవ బౌలింగ్‌తో మహమ్మద్ సిరాజ్ కూడా జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన కౌల్ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఈడెన్ పిచ్‌లో హేజిల్ వుడ్ తప్పా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.

భారీ స్కోర్ చేస్తేనే..
ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఆర్‌సీబీ భారీ స్కోర్ చేయాలి. వీలయినన్నీ ఎక్కువ సిక్సర్లు కొట్టాలి. అప్పుడే ఆర్సీబీ మ్యాచ్ గెలిచే వీలుంటుంది. ఇది చాలా టఫ్ ఫైట్, అయితే లక్నో బ్యాటింగ్ లైనప్ ను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. లక్నో ఓపెనర్లు రాహుల్, క్వింటన్ డి కాక్ మంచి భీకర ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఆర్సీబీ వారిద్దరిని అడ్డుకట్ట వేయడానికి ఇంకా కష్టపడాలి. అది జరగాలంటే విరాట్ ఫామ్ కొనసాగించడంతో పాటు మ్యాక్సీ ధాటిగా ఆడాలి'అని కైఫ్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications