Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ఆర్‌సీబీ కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్!

IPL 2022: Dinesh Kartik likely to new captain for RCB

బెంగళూరు: ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తమ కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ.. కెప్టెన్‌గా కార్తీక్‌నే ఖారారు చేసిందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. గత సీజన్ అనంతరం ఆర్‌సీబీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌గా మెరుగైన విజయాలందించేందుకు కోహ్లీ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అయితే ప్రస్తుతం అతను అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి వైదొలగడంతో ఆర్‌సీబీ కెప్టెన్‌గా కొనసాగాలని ఆ టీమ్ మేనేజ్‌మెంట్ కోరింది. కానీ అతను దానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. ముందస్తు ప్రణాళికల్లో భాగంలో వేలంలో ఫాఫ్ డుప్లెసిస్, దినేశ్ కార్తీక్ వంటి అనుభవం కలిగిన ఆటగాళ్లను తీసుకున్నప్పటికీ.. ఆర్‌సీబీ కోహ్లీని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే షెడ్యూల్ ఖారారైనా.. అన్ని జట్లు తమ కెప్టెన్లను ప్రకటించి ప్రాక్టీస్ క్యాంప్‌లు మొదలు పెట్టిన ఆర్‌సీబీ తమ సారథి పేరును వెల్లడించలేదు.

అయితే ఎంత రిక్వెస్ట్ చేసినా మళ్లీ కెప్టెన్సీ చేసేందుకు విరాట్ కోహ్లీ సుముఖంగా లేకపోవడంతో ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఇతర ఆటగాళ్ల పేర్లను పరిశీలించింది. ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్‌ల పేర్లను పరిశీలించిన ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్.. దినేశ్ కార్తీకే సరైనవాడని భావించిందట. ఫాఫ్‌ ఫిట్‌నెస్ సమస్యల నేపథ్యంలో అతనికి సారథ్యం ఇస్తే జట్టు ఇబ్బందుల్లో పడుతుందని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇక గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు కెప్టెన్సీ ఇస్తే అది అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందని, స్వేచ్చగా ఆడలేడనే భావనలో ఉందంట. ఈ క్రమంలోనే గతంలో కేకేఆర్ జట్టును నడిపించిన దినేశ్ కార్తీక్ సరైనోడనే తుది నిర్ణయానికి వచ్చిందంట.

IPL 2022 : RCB Opening Players | RCB Playing XI | Oneindia Telugu

ఆర్‌సీబీ పూర్తి టీమ్
ఫాఫ్ డుప్లెసిస్(రూ.7కోట్లు), అనూజ్ రావత్(రూ.3.4 కోట్లు), విరాట్ కోహ్లీ(రూ.15 కోట్లు), గ్లేన్ మ్యాక్స్‌వెల్(రూ.11 కోట్లు), దినేశ్ కార్తీక్(కీపర్)(రూ.5.5 కోట్లు), మహిపాల్ లోమ్‌రోర్(రూ.95 లక్షలు), వానిందు హసరంగా(రూ.10.75 కోట్లు), శబాజ్ అహ్మద్(రూ.2.4 కోట్లు), హర్షల్ పటేల్(రూ.10.75 కోట్లు), జోష్ హజెల్ వుడ్(రూ.7.75 కోట్లు), మహమ్మద్ సిరాజ్(రూ.7 కోట్లు), ఆకాశ్ దీప్(రూ.20 లక్షలు), సిద్దార్థ్ కౌల్(రూ.75 లక్షలు), కర్ణ్ శర్మ(రూ.50 లక్షలు), ఫిన్ అలెన్(రూ. కోటి), జాసన్ బెహ్రెన్‌డార్ఫ్(రూ.75 లక్షలు), డేవిడ్ విల్లే(రూ.2 కోట్లు), ప్రభుదేశాయ్(రూ.30 లక్షలు), లువిత్ సిసోడియా(రూ.20 లక్షలు), చామ మిలింద్(రూ.25 లక్షలు), అనీశ్వర్ గౌతమ్(రూ.20 లక్షలు).

Story first published: Monday, March 7, 2022, 9:32 [IST]
Other articles published on Mar 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+