Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs RR: తెలుగులో మాట్లాడిన దినేశ్ కార్తీక్.. ఏం చెప్పాడంటే? (వీడియో)

 IPL 2 IPL 2022: Dinesh Karthik Spoke In Telugu At Star Sports Telugu dugout Interview022: Dinesh Karthik Spoke In Telugu At Star Sports Telugu dugout Interview

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) హిట్టర్ దినేశ్ కార్తీక్.. రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌కు ముందు తెలుగులో మాట్లాడాడు. తెలుగు అభిమానుల కోసం స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానెల్.. కార్తీక్‌‌‌తో తెలుగులో మాట్లాడించింది. స్టార్ స్పోర్ట్స్ హోస్ట్ వింధ్య అడిగిన ప్రశ్నలకు కార్తీక్ కాక చక్కని తెలుగులో సమాధానాలు ఇచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్‌ను ఆస్వాదిస్తున్నానని తెలిపిన కార్తీక్.. ఈ సీజన్ కోసం ప్రత్యేకంగా సన్నదమయ్యానని చెప్పాడు.

స్పెషల్‌గా ఉండాలనే..

ఈ సీజన్‌లో అందరికి ప్రత్యేకంగా కనిపించాలనే లక్ష్యంతో బరిలోకి దిగానని, అది సాధించడంతో సంతోషంగా ఉన్నానని చెప్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గత మ్యాచ్ తమకు ఓ పీడ కలలాంటిదని, దాని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో తమకు ఏది కలిసి రాలేదని, మార్కో జాన్సెన్ ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోవడం జట్టు పతనానికి కారణమైందన్నాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఘోర పరాజయం చవిచూసామని చెప్పాడు. అయితే ఈ మ్యాచ్ గురించి ఎలాంటి డిస్కషన్స్ చేయలేదని, కేవలం తదుపరి మ్యాచ్‌ల్లో ఎలా రాణించాలి? ఎలా ప్లే ఆఫ్స్ చేరాలనేదానిపైనే ఫోకస్ పెట్టామని చెప్పాడు.

 టీమ్ మేనేజ్‌మెంట్ సూచనలతోనే..

టీమ్ మేనేజ్‌మెంట్ సూచనలతోనే..

రాజస్థాన్ రాయల్స్ బలమైన టీమ్ అని, ఈ రోజు మంచి గేమ్ ఉంటుందని చెప్పాడు. ఇక మైదానంలో డుప్లెసిస్‌కు సలహాలు ఇవ్వడంపై స్పందిస్తూ.. టీమ్‌మేనేజ్‌మెంట్ సూచనల మేరకే ఆ పనిచేస్తున్నానని చెప్పాడు. కీలక సమయాల్లో విరాట్ కోహ్లీతో పాటు తాను ఫాఫ్ డుప్లెసిస్‌కు సలహాలు ఇస్తున్నామని చెప్పాడు. ఫాఫ్ అద్భుతమైన కెప్టెన్ అని, సూపర్ ప్లాన్స్‌తో బరిలోకి దిగుతాడని చెప్పాడు. ఇప్పటికి అయితే అంతా బాగుందని, ఇదే జోరు కొనసాగించాలనుకుంటున్నాని చెప్పాడు.

 ఓపెనర్‌గా కోహ్లీ..

ఓపెనర్‌గా కోహ్లీ..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఊహించినట్లుగానే ఆర్‌సీబీ ఒక మార్పు చేయగా.. రాజస్థాన్ రాయల్స్ రెండు మార్పులు చేసింది. కరుణ్ నాయర్, ఒబెడ్ మెక్‌కాయ్ స్థానాల్లో డారిల్ మిచెల్, కుల్దీప్ సేన్ రాజస్థాన్ తుది జట్టులోకి వచ్చారు. ఆర్‌సీబీలోకి రజత్ పటిదార్ రాగా.. అనూజ్ రావత్ ఉద్వాసనకు గురయ్యాడు. అయితే విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా ఆడిద్దామనే ఉద్దేశంతోనే అనూజ్ రావత్‌ను పక్కనపెట్టామని ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. అసలు సిసలు విరాట్ ఆటను చూసేందుకే ఓపెనర్‌గా అతన్ని ప్రమోట్ చేశామన్నాడు.

తుది జట్లు:

తుది జట్లు:

ఆర్‌సీబీ: ఫాప్‌ డుప్లెసిసస్‌(కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, సుయాశ్ ప్రభుదేశాయ్, రజాత్ పటిదార్, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్ కార్తీక్, వానిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌, హజెల్ వుడ్, మహమ్మద్‌ సిరాజ్‌

రాజస్తాన్‌: జోస్‌ బట్లర్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, సంజూ శాంసన్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, రియాన్‌ పరాగ్‌, డారిల్ మిచెల్, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, కుల్దీప్ సేన్, యుజువేంద్ర చహల్‌, ప్రసిద్‌ కృష్ణ.

Story first published: Tuesday, April 26, 2022, 23:42 [IST]
Other articles published on Apr 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+