Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: కార్తీక్ కాక విధ్వంసం.. ముస్తాఫిజుర్ బలి! 6 బంతుల్లో 6 బౌండరీలు (వీడియో)

IPL 2022: Dinesh Karthik smashes Mustafizur Rahman for six boundaries in an over

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ దుమ్మురేపుతున్నాడు. ఆర్‌సీబీ టీమ్ ఇచ్చిన ఫినిషర్ రోల్‌ను సమర్థవంతంగా పోషిస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌లో రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకం అవుతున్నాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ లేని లోటు దినేశ్ కార్తీక్ తీరుస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ కాక విధ్వంసం సృష్టించాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో సహాయక పాత్రలో బెంగళూరుకు విజయాలు అందించిన దినేశ్‌ కార్తీక్‌ ఈసారి మరింత ఎక్కువ బాధ్యతతో తానే ముందుండి జట్టును గెలిపించాడు.

ముస్తాఫిజుర్‌కు చుక్కలు..

ముఖ్యంగా ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన 18వ ఓవర్‌లో చుక్కలు చూపించాడు. 6 బంతుల్లో 6 బౌండరీలతో చెలరేగి ఆడాడు. ఈ ఓవర్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఏకంగా 28 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్‌లో 4, 4, 4, 6, 6, 4తో దినేష్ కార్తీక్ చెలరేగిపోవడంతో.. వాంఖడే స్టేడియం మొత్తం డీకే నామ స్మరణతో నిండిపోయింది.

బెస్ట్ ఫినిషర్‌గా..

బెస్ట్ ఫినిషర్‌గా..

ఈ సీజన్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన దినేష్ కార్తీక్ ఐదింటిలో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్ విన్నర్‌గా, ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. పంజాబ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ 14 బంతుల్లో 32 పరుగులు చేయగా.. ఆ తర్వాత వరుసగా కేకేఆర్‌పై 14 (7) నాటౌట్, రాజస్థాన్‌పై 44 (23) నాటౌట్, ముంబై ఇండియన్స్‌పై 7 (2) నాటౌట్, చెన్నైపై 34 (14) పరుగులు చేశాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 66 (34) అసలైన మ్యాచ్ ఫినిషర్ అనిపించుకున్నాడు.

కార్తీక్ కాక.. కేక!

కార్తీక్ కాక.. కేక!

దినేశ్ కార్తీక్ సూపర్ బ్యాటింగ్‌పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అతన్ని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో కార్తీక్‌ను ఫినిషర్ రోల్‌లో ఆడించాలని అభిప్రాయపడుతున్నారు. దినేశ్ కార్తీక్‌ను తీసుకొని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ మంచి పని చేసిందని కొనియాడుతున్నారు. అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని ఆర్‌సీబీకీ తిరుగేలేదని కామెంట్ చేస్తున్నారు.

ఆర్‌సీబీ అద్భుత విజయం..

ఆర్‌సీబీ అద్భుత విజయం..

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 16 పరుగులతో గెలుపొందింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దినేశ్‌ కార్తీక్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66 నాటౌట్‌) తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగించాడు. మ్యాక్స్‌వెల్‌ (34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 55) అర్ధ సెంచరీ సాధించగా, షహబాజ్‌ (21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 32 నాటౌట్‌) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడిపోయింది. వార్నర్‌ (38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు 66), రిషభ్‌ పంత్‌ (17 బంతుల్లో3 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 34) మెరిశారు. బెంగళూరు బౌలర్లు హేజల్‌వుడ్‌ (3/28), సిరాజ్‌ (2/31) రాణించారు.

Story first published: Sunday, April 17, 2022, 10:05 [IST]
Other articles published on Apr 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+