
బెంగళూరు: ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద గండం తప్పింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ పృథ్వీ షా ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమయ్యాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బీసీసీఐ.. తమ కాంట్రాక్టు ప్లేయర్లతో పాటు ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించింది. ఈ ఫిట్‌నెస్ టెస్ట్‌లో నెగ్గిన వారినే ఐపీఎల్‌లోకి అనుమతిస్తోంది. భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు ప్రమాణికంగా భావించే యోయో టెస్ట్‌ను తాజాగా నిర్వహించగా.. హార్దిక్ పాండ్యా పాస్ మార్క్‌లతో బయటపడగా.. పృథ్వీ షా విఫలమయ్యాడు.
యోయో టెస్ట్‌లో నిర్దేశించిన కనీస స్కోర్ 16.5ను పొందడంలో హార్ధిక్ పాండ్యా సాధించగా, ఢిల్లీ ఓపెనర్ చేతులెత్తేశాడు. అయితే, ఇది కేవలం ఫిట్‌నెస్ టెస్ట్ మాత్రమేనని, ఇందులో విఫలమైతే ఐపీఎల్‌లో ఆడకుండా ఆపలేమని బీసీసీఐ స్పష్టం చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. యోయో టెస్ట్‌లో షా 15 కంటే తక్కువ స్కోర్ చేసినట్లు, హార్ధిక్ 17కి పైగా స్కోర్ సాధించినట్లు తెలుస్తుంది.
కాగా, బీసీసీఐ కాంట్రాక్ట్, నాన్ కాంట్రాక్ట్ నేషనల్ లెవెల్ ప్లేయర్లకు బీసీసీఐ ఇటీవలే 10 రోజుల ఫిట్‌నెస్ క్యాంప్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్యాంప్‌కు హాజరు కానీ ఆటగాళ్లకు మళ్లీ పరీక్షలు నిర్వహించింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో పృథ్వీషా లేకపోవడంతోనే అతన్ని ఐపీఎల్ ఆడేందుకు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది.
బీసీసీఐ అనుమతిచ్చినా పృథ్వీ షా ఫిట్‌నెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను కలవరపెడుతోంది. యోయో టెస్ట్ క్లియర్ చేయలేని పృథ్వీ షా ఐపీఎల్ మ్యాచ్‌లు ఏం ఆడుతాడని సందేహిస్తోంది. ఒకవేళ ఆడినా గాయాల బారిన పడే అవకాశం ఉంటుంది. రంజీ ట్రోఫీలో కూడా పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన అతను కేవలం 107 పరగులు మాత్రమే చేశాడు. అతని పేలవ ఫామ్ కూడా ఢిల్లీని కలవరపెడుతోంది.