
డిష్యూం డిష్యూం..
అయితే ఇద్దరూ బ్యాటింగ్ ఆల్‌రౌండర్లే కావడం విశేషం. నంబర్ 6, 7లో బ్యాటింగ్ చేసే ప్లేయర్లు. దేశవాళీ టీమ్ బరోడా తరఫున గతంలో ఆడిన ఈ ఇద్దరూ.. మళ్లీ లక్నోకు ఆడనున్నారు. 2020 దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముందు కృనాల్ పాండ్యా, దీపక్ హుడా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బరోడా టీమ్ కెప్టెన్ అయిన కృనాల్ పాండ్యా అకారణంగా తనపై నోరు పారేసుకున్నాడని.. టీమ్ సభ్యులు, ఇతర టీమ్స్ ముందు తన పరువుకు భంగం కలిగించాడని వైస్ కెప్టెన్ దీపక్ హుడా సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా తాను జట్టును వీడుతున్నట్లు కూడా ప్రకటించాడు.

ఫ్రెండ్స్ అవుతారా?
ఈ వివాదం భారత క్రికెట్‌లో పెనుదుమారం సృష్టించడంతో విచారణ చేపట్టిన బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) తప్పు దీపక్ హుడాదేనని తేల్చి అతన్ని టీమ్ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో హుడా ఆ సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడలేదు. బరోడా టీమ్‌కు గుడ్‌బై చెప్పి రాజస్థాన్ టీమ్ తరఫున బరిలోకి దిగాడు. ఇక ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్ వేదికగా సెటైర్లు పేల్చాడు. 'దీపక్ హుడా, కృనాల్ పాండ్యా భవిష్యత్తు మంచి జోడీ కానుంది. బరోడా విడగొడితే లక్నో కలిపింది'అంటూ సెటైరిక్‌గా ట్వీట్ చేశాడు.

ఇషాన్ కిషన్‌కు జాక్‌పాట్ ధర..
ఇక మెగా వేలం కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ భారీ ధరను సొంతం చేసుకున్నాడు. రూ. 15.25 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇషాన్ కోసం సన్‌రైజర్స్ చివరి వరకు ప్రయత్నించి వదిలేసింది. ఇక మెగా వేలంలో శిఖర్ ధావన్(రూ. 8.25 కోట్లు) పంజాబ్ కింగ్స్, రవిచంద్రన్ అశ్విన్( రూ. 5 కోట్లు) రాజస్థాన్ రాయల్స్, ప్యాట్ కమిన్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 7.25 కోట్లకు, కగిసో రబడాను పంజాబ్ కింగ్స్ రూ. 9.25 కోట్లకు, శ్రేయస్ అయ్యర్ రూ. 12.25 కోట్లకు కేకేఆర్, ట్రెంట్ బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 8 కోట్లకు, మహమ్మద్ షమీ రూ. 6.25 కోట్లు గుజరాత్ టైటాన్స్‌కు ఫాఫ్ డుప్లెసిస్‌ను రూ. 7 కోట్లకు, క్వింటన్ డికాక్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.6.75 కోట్లకు కొనుగోలు చేసింది. దేవదత్ పడిక్కల్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.25 కోట్లకు, జాసన్ రాయ్ రూ.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్, హెట్‌మైర్(రూ.8.25) రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.


Click it and Unblock the Notifications












