For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: పాపం డానియల్ సామ్స్.. కమిన్స్ దెబ్బకు చెత్త రికార్డు! కాపాడిన సూర్య.. లేకుంటే..?

IPL 2022: Daniel Sams creates unwanted record in KKR vs MI match, joins Most expensive overs list

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ డానియల్ సామ్స్ చెత్త రికార్డు నమోదు చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. డానియల్ సామ్స్ చెత్త బౌలింగ్.. ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణమైంది. ఇక ప్యాట్ కమిన్స్ ధాటికి డానియల్ సామ్స్ ఒకే ఓవర్‌లో 35 పరుగులిచ్చుకున్నాడు. దాంతో 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చుకున్న మూడో పేసర్‌గా, తొలి ఓవర్‌సీస్ బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.

37 పరుగులతో..

37 పరుగులతో..

ఈ చెత్త రికార్డు జాబితాలో 37 పరుగులతో భారత బౌలర్లు పీ పరమేశ్వరన్, హర్షల్ పటేల్ టాప్-2లో కొనసాగుతుండగా.. తాజా చెత్త ప్రదర్శనతో డానియల్ సామ్స్ మూడో స్థానంలో నిలిచాడు. 2011లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ విధ్వంసంతో పరమేశ్వరన్ ఒకే ఓవర్‌లో 37 పరుగులు ఇచ్చుకోగా.. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్‌తో జడేజా విధ్వంసానికి హర్షల్ పటేల్ బలయ్యాడు. ఇక డానియల్ సామ్స్ తర్వాత విండీస్ బౌలర్ రవి బొపరా, పర్వీందర్ అవానా 35 పరుగులతో టాప్-5లో కొనసాగుతున్నారు.

కాపాడిన సూర్య..

కాపాడిన సూర్య..

కోల్‌కతా విజయానికి చివరి అయిదు ఓవర్లలో 35 పరుగులు కావాలి.. మ్యాచ్‌ మరో మూడు ఓవర్లయినా సాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ కమిన్స్‌ ఆ అవకాశమే ఇవ్వలేదు. ఒక్క ఓవర్లోనే కథ ముగించాడు. సామ్స్‌ (1/50) బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6, 6 కొట్టిన అతను.. ఆ తర్వాత చివరి రెండు బంతులను 4, 6గా మలచి 16వ ఓవర్లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. బంతి ఎలా, ఎక్కడ పడ్డా దానికి బౌండరీ దారే చూపించాడు. మధ్యలో ఓ బంతిని బౌండరీ దగ్గర సిక్సర్‌ వెళ్లకుండా సూర్య అద్భుతంగా అందుకున్నప్పటికీ అది నోబాల్‌గా తేలింది. అయితే సూర్య సూపర్ ఫీల్డింగ్‌తో 4 పరుగులు సేవ్ అయ్యాయి. అది గనుక సిక్స్ వెళ్లి ఉంటే.. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఓవర్‌లో 39 పరుగులు ఇచ్చిన చెత్త బౌలర్‌గా సామ్స్ అప్రతిష్టను మూటగట్టుకునేవాడు.

IPL 2022 : Pat Cummins ఊచకోత.. ఐపీఎల్ చరిత్రలో బిగ్గెస్ట్ రికార్డ్ | KKR vs MI | Oneindia Telugu
14 బంతుల్లో హాఫ్ సెంచరీ..

14 బంతుల్లో హాఫ్ సెంచరీ..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ ( 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) అర్ధశతకంతో సత్తాచాటాడు. తిలక్‌ వర్మ ( 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్), పొలార్డ్‌ ( 5 బంతుల్లో 3 సిక్స్‌లతో 22 నాటౌట్) రాణించారు. కమిన్స్‌ (2/49) రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. కమిన్స్‌ ( 15 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 నాటౌట్‌) వీరవిహారం చేశాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ ( 41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మురుగన్‌ అశ్విన్‌ (2/25), మిల్స్‌ (2/38) ఆకట్టుకున్నారు.

Story first published: Thursday, April 7, 2022, 8:52 [IST]
Other articles published on Apr 7, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+