For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: అత్యంత బలంగా చెన్నై! కానీ కెప్టెన్సీ మార్పు నిర్ణయమే.. తుది జట్టు అంచనా ఇదే!

IPL 2022: CSK Strength, Weakness, Playoffs Chances and Playing XI Prediction

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో ఒకటి. ముంబై తర్వాత సక్సెస్​ఫుల్ టీమ్ ఇది. మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ సహా వెటరన్​ ప్లేయర్లతో డ్యాడ్స్​ఆర్మీగా పేరు తెచ్చుకున్నా.. బరిలోకి దిగితే బాక్స్​బద్దలు కొట్టే ఆటతో చెలరేగిపోవడం సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే నైజం. పోటీపడ్డ 12 సీజన్లలో నాలుగుసార్లు టైటిల్​ గెలిచి, ఐదు సార్లు రన్నరప్​గా నిలిచింది. 2020లో మాత్రమే లీగ్ స్టేజ్ లోనే ఇంటిముఖం పట్టినా గతేడాది టైటిల్​ నెగ్గి తన దమ్ము చూపింది. ఇప్పుడు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. మరో ట్రోఫీ నెగ్గి ముంబై అత్యధిక టైటిల్స్ రికార్డును సమం చేయాలని చూస్తోంది. అయితే లీగ్ ప్రారంభానికి ఒక్క రోజు ముందే ధోనీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని జడేజాను కెప్టెన్ చేయడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. టీమ్ భవిష్యత్తు కోసమే ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాడిగా జట్టులో కొనసాగుతూ జడేజాకు కెప్టెన్సీ మెళకువలు అందిస్తూ అతన్ని మేటి సారథిగా తీర్చిదిద్దాలనేదే ధోనీ లక్ష్యం కావచ్చు.

చాంపియన్ టీమ్‌లో ముగ్గురే మిస్..

చాంపియన్ టీమ్‌లో ముగ్గురే మిస్..

ఈసారి ధోనీ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీలాంటి ప్రధాన ప్లేయర్లను రిటైన్ చేసుకున్న ఈ జట్టు.. వేలంలో దీపక్ చహర్, అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, డ్వేన్ బ్రావోలను మళ్లీ తీసుకుంది. దాంతో గతేడాది ఫైనల్ ఆడిన జట్టులో ముగ్గురు(ఫాఫ్ డుప్లెసిస్, శార్దూల్ ఠాకూర్, జోష్ హజెల్ వుడ్) మాత్రమే మిస్సయ్యారు. దాదాపు అదే కోర్​ టీమ్ తో బరిలో దిగబోతుండటం సీఎస్‌కేకు కలిసొచ్చే అంశం. అలాగే 40 ఏళ్ల ధోనీకి ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశం కానుంది. దీంతో ట్రోఫీ నెగ్గి మహీకి సెండాఫ్​ ఇవ్వాలని మేనేజ్ మెంట్ భావిస్తోంది. గాయంతో దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చహర్ దాదాపు సగం సీజన్ కు దూరం కావడం, వీసా దొరకని కారణంగా మొదటి మ్యాచ్ కు మొయిన్​ అలీ అందుబాటులో లేకుండానే శనివారం కోల్ కతా నైట్ రైడర్స్ తో చెన్నై పోటీ పడనుంది.

సీఎస్‌కే బలాలు

సీఎస్‌కే బలాలు

ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా ఆటగాడిగా జట్టులో కొనసాగుతాడని సీఎస్‌కే స్పష్టం చేసింది. కాబట్టి పేరుకు జడేజానే కెప్టెన్ అయినా.. కీలక నిర్ణయాలన్నీ ధోనీ తీసుకుంటాడు. జడేజా సైతం ధోనీ సలహాలతోనే ముందుకు వెళ్తానని చెప్పాడు. చెన్నైకి కూడా ప్రధాన బలం ధోనీనే.

అతడు ఉన్నంత కాలం టీమ్‌కు తిరుగుండదు. వికెట్ల వెనుక ఉండి అతను తీసుకునే కీలక నిర్ణయాలు మ్యాచ్ స్వరూపాన్నే మారుస్తాయి. ముంబై, పుణె పిచ్‌లను పోలీ ఉండే సూర‌త్‌లో ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేయడం ధోనీ మాస్టర్ మైండ్‌కు చిన్న ఉదాహరణ. గతేడాది బ్యాటింగ్‌లో దుమ్మురేపిన రుతురాజ్ గైక్వాడ్ ఈ సారి కూడా కీలకం కానున్నాడు.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాపార్డర్ లో డుప్లెసిస్ లేకపోవడం లోటే అయినా అతని స్థానంలో తీసుకున్న కివీస్ ప్లేయర్ డెవాన్ కాన్వే ఫామ్ కలిసొచ్చే అంశం. పెర్ఫామెన్స్ ఎలా ఉన్న మిడిలార్డర్‌లో అలీ, ఊతప్ప, జడేజా, రాయుడు, ధోనీ, బ్రావోల అనుభవం టీమ్‌కు కలిసి వస్తుంది. జడేజా, అలీ, బ్రావో, దూబే, శాంట్నర్ లతో ఆల్ రౌండర్ ఆప్షన్ కూడా బాగానే ఉంది.

సీఎస్‌కే బలహీనతలు..

సీఎస్‌కే బలహీనతలు..

కెప్టెన్‌గా అనుభవం లేని జడేజా ఈ సవాల్‌ను ఎలా స్వీకరిస్తాడనేది చూడాలి. కెప్టెన్సీ ఒత్తిడికి గురై అతని వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపితే జట్టుకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇక రూ.14 కోట్ల భారీ ధరతో కొనుగోలు చేసిన దీపక్ చాహర్ గాయం కారణంగా సగం లీగ్‌కు దూరమవ్వడం చెన్నైకి పెద్ద దెబ్బ.

పవర్ ప్లేలో కీలక వికెట్లతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే చహర్ స్థాయిలో పెర్ఫామెన్స్ ఇచ్చే మరో బౌలర్ కనిపించడం లేదు. కేఎం ఆసిఫ్, తుషార్ దేశ్ పాండే ఉన్నా వాళ్ల నుంచి ఎక్కువ ఆశించలేం. దీంతో బ్రావోతో పాటు ఆడమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్నేకు పేస్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పేస్ ఆల్ రౌండర్ దూబే, అండర్-19 టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్ రాజ్ వర్ధన్ ల బౌలింగ్​పై పెద్దగా నమ్మకముంచలేం. ఇక ధోనీ ఫామ్ టీమ్ ను కొంతకాలంగా ఇబ్బంది పెడుతోంది. మిడిలార్డర్​లోనూ టీమ్ కొంచెం బలహీనంగా కనిపిస్తోంది.

ప్లే ఆఫ్స్ అంచనా..

ప్లే ఆఫ్స్ అంచనా..

గ్రూప్ బి టాప్ టీమ్‌గా ఉన్న చెన్నై.. ముంబై ఇండియన్స్‌తో పాటు సన్‌రైజర్స్, ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌తో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. నయా కెప్టెన్ జడేజా తడబడకుండా.. దీపక్ చహర్ లోటును భర్తీ చేసే బౌలర్ దొరికి.. కీలక సమయాల్లో మిడిల్ బ్యాటర్లు రాణిస్తే చెన్నై మరోసారి ప్లేఆఫ్స్ చేరడం దాదాపు ఖాయం.

చెన్నై సూపర్​ కింగ్స్​ టీమ్

చెన్నై సూపర్​ కింగ్స్​ టీమ్

భారత ఆటగాళ్లు : ధోనీ (కెప్టెన్), రాయుడు, జడేజా, శివం దూబే, దీపక్ చహర్, ఊతప్ప, రుతురాజ్, హరి నిశాంత్, శుభ్రాన్షు సేనాపతి, నారాయణ్ జగదీశన్, భగత్ వర్మ, రాజ్ వర్ధన్, కేఎం ఆసిఫ్, ముఖేశ్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సిమర్జీత్ సింగ్, తుశార్ దేశ్ పాండే.

ఫారిన్ ప్లేయర్లు: మహీశ్ తీక్షణ, ఆడం మిల్నే, మొయిన్ అలీ, శాంట్నర్, డ్వేవ్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, క్రిస్ జోర్డాన్, డెవాన్ కాన్వే.

తుది జట్టు (అంచనా)

తుది జట్టు (అంచనా)

డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, శివమ్ ధూబే/ఊతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, డ్వేన్ బ్రావో/క్రిస్ జోర్డాన్, రాజవర్థన్ హంగార్గేకర్, ఆడమ్ మిల్నే, తుషార్ దేశ్‌పాండే/సోలంకి

Story first published: Friday, March 25, 2022, 10:25 [IST]
Other articles published on Mar 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+