IPL 2022: బెడిసికొట్టిన చెన్నై వ్యూహం.. కెప్టెన్‌గా జడేజా అట్టర్ ఫ్లాఫ్!

హైదరాబాద్: ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఓటమితోనే తమ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా నేతృత్వంలో పేలవ ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) చేతిలో ఓటమి చవిచూసింది. మెగా లీగ్‌కు ముందు కెప్టెన్సీని మార్చుతూ చెన్నై మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. భవిష్యత్తు కెప్టెన్‌ను తయారు చేయాలనే ఆలోచనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌గా ఏ మాత్రం అనుభవం లేని జడేజా పూర్తిగా తేలిపోయాడు. అతనిపై కెప్టెన్సీ ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.

తీవ్ర ఒత్తిడిలో జడేజా..
ఈ మ్యాచ్‌లో జడేజా భిన్నంగా.. అసౌకర్యంగా కనిపించాడు. తొలిసారి కెప్టెన్సీ చేస్తున్నానన్న భయం అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. దాంతోనే బ్యాటింగ్‌లో తన సహజశైలికి భిన్నంగా ఆడిన జడేజా.. 28 బంతుల్లో 26 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఒక్క సిక్స్ కొట్టగా.. అది కూడా ఇన్నింగ్స్ చివరి బంతికి కొట్టిందే. అతని నెమ్మదైన బ్యాటింగ్ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. అనంతరం బౌలింగ్‌లోనూ తేలిపోయాడు.

చెత్త కెప్టెన్సీ..
4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. కెప్టెన్‌గా బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ కూర్పుల విషయంలోనూ జడేజా తన మార్క్‌ని చూపెట్టలేకపోయాడు. చివరకు డీఆర్‌ఎస్ విషయంలోనూ తొందరపడి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ సింగ్ ధోనీ ఆగ్రహానికి గురయ్యాడు. తొలి మ్యాచ్‌లో చెన్నై ఓటమికి ప్రధాన కారణం జడేజా చెత్త కెప్టెన్సీ అని చెప్పవచ్చు. భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. జడేజాపై కెప్టెన్సీ ఒత్తిడి స్పష్టంగా కనిపించిందన్నాడు.

కొత్త కావడంతోనే...
'భారత్ తరఫున నిలకడగా రాణిస్తూ సూపర్ ఫామ్‌లో ఉన్న రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే జడేజా చాలా నర్వస్‌గా కనిపించాడు. బహుషా అతనిపై కెప్టెన్సీ ఒత్తిడి ఉందనుకుంటా. స్వేచ్చగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. బౌలింగ్‌కు కూడా చాలా ఆలస్యంగా వచ్చాడు. అయితే ఇది అతని ఫస్ట్ మ్యాచే కాబట్టి రాను రాను నేర్చుకుంటాడు. గాయంతో దూరమైన దీపక్ చాహర్ రోల్‌ను తుషార్ దేశ్ పాండేకు ఇచ్చి కూడా జడేజా పెద్ద తప్పిదం చేశాడు.

అది ఘోర తప్పిదం..
అంతేకాకుండా చెన్నై ప్రధాన ఆటగాళ్లంతా విఫలమయ్యారు. రాబిన్ ఊతప్ప కుదురుకున్నట్లు కనిపించినప్పటికీ... స్టంపౌట్ రూపంలో వెనుదిరిగాడు. వాంఖడే వంటి హైస్కోరింగ్ మ్యాచ్‌లో వాళ్లు 131 పరుగులు మాత్రమే చేశారు. పిచ్ కూడా కొంచెం నెమ్మదిగా అనిపించింది. బంతి ఆగుతూ రావడంతో బ్యాటింగ్‌కు కష్టమైంది.'అని మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు. జడేజా ఇలానే తడబడితే చెన్నైకి కష్టాలు తప్పవు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications