IPL 2022: కామెంటేటర్లకు రూ. 5 కోట్ల జీతం! ఇంగ్లీష్, హిందీ, తెలుగు వ్యాఖ్యాతల జాబితా ఇదే!


హైదరాబాద్: ప్రపంచంలోనే ఖరీదైన, ఖతర్నాక్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ కోసం క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ క్రికెట్ అభిమానులందరినీ ఏకం చేసి సహచరుల్ని ప్రత్యర్థుల్లా.. ప్రత్యర్థుల్ని సహచరుల్లా మార్చే ఈ టోర్నీ మరో నాలుగు రోజుల్లో మొదలవ్వనుంది. రెండు కొత్త జట్ల రాకతో ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది. మైదానంలో ఆటగాళ్ల అద్భుత విన్యాసాలతో పాటు కామెంటేటర్ల పసందైన వ్యాఖ్యానం అభిమానులను ఆకట్టుకోనుంది.
ఇప్పటికే అధికారిక బ్రాడ్‌కాస్టర్ ఆయా రాష్ట్రాల మాతృ భాషలో కూడా వ్యాఖ్యానాన్ని అందిస్తూ.. ఐపీఎల్‌ను మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కామెంట్రీ అందుబాటులో ఉండగా.. ఈ సీజన్‌తో గుజరాతీ వ్యాఖ్యానం కూడా మొదలవ్వనుంది.
ఐపీఎల్ 2022 మెగా వేలంలో తీవ్ర నిరాశకు గురైన లీగ్ స్టార్ సురేశ్ రైనా కామెంటేటర్‌గా ఈ సీజన్‌తోనే తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం మళ్లీ తన వ్యాఖ్యానంతో అభిమానులను అలరించనున్నాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించిన కామెంటేటర్ల జాబితా, వారీ జీతాలపై ఓ లుక్కెద్దాం.

ఐపీఎల్ కామెంటేటర్ల జాబితా
ఇంగ్లీష్
హర్ష భోగ్లే, సునీల్ గవాస్కర్, లక్ష్మణ్ శివరామక్రిష్ణన్, మురళీ కార్తీక్, దీప్ దాస్‌గుప్తా, అంజుమ్ చోప్రా, ఇయాన్ బిషాప్, అలన్ విల్‌కిన్స్, పోమీ ఎంబాగ్వ, నిక్ నైట్, డానీ మోరీసన్, సిమన్ డౌల్, మాథ్యూ హెడెన్, కెవిన్ పీటర్సన్
డగౌట్ కామెంటర్ లిస్ట్..
అనంత్ త్యాగీ, నెరోలి మీడోస్, స్కాట్ స్టైరీస్, గ్రేమ్ స్వాన్
హిందీ
ఆకాశ్ చోప్రా, ఇర్పాన్ పఠాన్, నిఖిల్ చోప్రా, తన్య పురోహిత్, కిరణ్ మోరే, జతిన్ సప్రూ, సురెన్ సుందరం, రవిశాస్త్రి, సురేశ్ రైనా, పార్దీవ్ పటేల్
తమిళ్
ఆర్ ముతురామన్, ఆర్‌కే, భావన, ఆర్‌జే బాలాజీ, బద్రీనాథ్, అభినవ్ ముకుంద్, రమేశ్, నానీ, కే శ్రీకాంత్

తెలుగు
ఎమ్‌ఏఎస్ కృష్ణ, ఎన్ మట్చా, వీవీ మేడపాటి, ఎమ్మెస్కే ప్రసాద్, ఆశీశ్ రెడ్డి, కేఎన్ చక్రవర్తీ, ఆవులపల్లీ, కల్యాణ్ క్రిష్ణ, డీ వేణుగోపాల్ రావు, టీ సుమన్
కన్నడ
మధు మలియకొండ, కిరణ్ శ్రీనివాస్, శ్రీనివాస్ మూర్తీ, విజయ్ బరద్వాజ్, భారత్ చిప్లీ, జీకే అనిల్ కుమార్, వెంకటేశ్ ప్రసాద్, వేద కృష్ణ మూర్తి, సుమేశ్ గోనీ, వినియ్ కుమార్
బెంగాళీ
సంజీబ్ ముఖేర్జీ, సారా దిండు ముఖర్జీ, గౌతమ్ భట్టాచార్య, జోయ్‌దీప్ ముఖర్జీ, దేబాషిశ్ దట్టా
మళయాళం
విష్ణు హరిహరన్, శియాస్ మహమ్మద్, టిను యోహన్నన్, రైఫీ గోమేజ్, సీఎం దీపక్

కామెంటేటర్ల జీతాలు ఎంతంటే?
కామెంట్రీ ప్యానల్‌లో ఎక్కవ శాతం మాజీ క్రికెటర్లు ఉంటారు కాబట్టి వారీ జీతాలు కూడా భారీ స్థాయిలోనే ఉంటాయి. ఓ ఇంగ్లీష్ కామేంటర్ గరిష్టంగా.. 5 లక్షల అమెరికా డాలర్లు(రూ.3 కోట్ల 82 లక్షలు) కనిష్టంగా రూ. కోటీ 91 లక్షలు(2 లక్షల 50 వేల అమెరికా డాలర్లు) తీసుకుంటారు. డగౌట్ ప్యానెల్‌లోని కామెంటేటర్లకు గరిష్టంగా రూ. 5 కోట్ల 35 లక్షలు(7 లక్షల అమెరికా డాలర్లు) జీతం ఉంటుంది. హిందీ కామెంటేటర్ల జీతం రూ.61 లక్షల నుంచి రూ.2 కోట్ల 67 లక్షల వరకు ఉంటుంది. స్థానిక భాషల్లోని కామెంటేటర్లకు కాస్త తక్కువగా ఉంటుంది. ఇందులో కూడా కామెంటేటర్లను బట్టి జీతాలున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి కలిపి ఈ జీతాలు చెల్లిస్తారు.

మహిళలు ఇద్దరే
ఐపీఎల్ 2022 సీజన్ కామెంట్రీ ప్యానల్‌లో మహిళలు ఇద్దరే ఉన్నారు. అందులో ఒకరు ప్రజెంటర్ కాగా.. మరోకరు మాజీ ప్లేయర్. భారత మహిళల మాజీ కెప్టెన్ అంజూమ్ చోప్రా ఇంగ్లీష్ కామెంట్రీ ప్యానల్‌లో చోటు దక్కించుకుంది. ఆస్ట్రేలియా టెలివిజన్ ప్రజెంటర్ నెరోలి మీడోస్ డగౌట్ ప్యానల్‌లో వ్యాఖ్యతగా కనిపించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications