IPL 2022: ముంబై ఇండియన్స్‌లో విభేదాలు.. రెండుగా చీలిన ఆటగాళ్లు..!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌లో పరాజయాల పరంపర కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్‌పై ఆ జట్టు మాజీ ప్లేయర్, ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబై జట్టులో అంతర్గత విభేదాలున్నాయని, ఆటగాళ్లు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపాడు. దాంతో ఈ సీజన్‌లో ముంబై ఇప్పటి వరకు ఒక్క విజయం సాధించలేకపోయిందన్నాడు. ఇక రోహిత్ సేన వరుసగా ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఏడు ఓడిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా ఏడు మ్యాచ్‌లు ఓడిన జట్టుగా ముంబై అప్రతిష్టను మూటగట్టుకుంది. పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో కొనసాగుతోంది. గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చివర్లో తడబడి ఓటమిపాలైంది.

11 మంది.. ఎవరికి వారే..
ఈ నేపథ్యంలోనే ముంబై వరుస పరాజయాలపై స్పందించిన క్రిస్ లిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోని 11 మంది ఆటగాళ్లుగా టీమ్‌గా కాకుండా ఎవరికి వారే అన్నట్లు ఆడుతున్నారని, అందుకే వరుసగా ఓటమిపాలైందని తెలిపాడు. 'ముంబై జట్టుకు గెలవడం,ఓడిపోవడం రెండూ అలవాటే. ముంబై బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమస్యలు ఉన్నాయి. వారి డ్రెస్సింగ్ రూమ్‌లో గ్రూపులు ఉన్నట్లు కనిపిస్తోంది. త్వరలో ముంబై జట్టు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయే అవకాశం ఉంది.

టైటిల్ గెలిచినప్పుడు..
అది జట్టుకు మంచి సంకేతం కాదు. కాగా కెప్టెన్ ఒత్తిడిలో ఉన్నప్పుడు పొలార్డ్ వంటి సీనియర్ రోహిత్‌కు సాయంగా ఉండాలి. కానీ జట్టులో అది కనిపించడంలేదు. రెండేళ్ల క్రితం టైటిల్ గెలిచిన సీజన్‌లో టీమ్‌గా మెరుగయ్యేందుకు అనేక చర్చలు జరిగేవి. టీమ్ ప్రదర్శనను మెరుగుపరిచేందుకు చేయాల్సింది ఏంటని చర్చించేవారు. కోచ్‌లు చెప్పకున్నా ఆటగాళ్లు ఈ డిస్కషన్ చేస్తుండేవారు. కానీ ఇప్పుడు అలాంటివి కనిపించడం లేదు.

ఐపీఎల్‌కే నష్టం..
పైగా ధానికి భిన్నంగా జరుగుతోంది. జట్టుగా ఉండాల్సిన ఆటగాళ్లు ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు. ఈ సమస్యలన్నిటినీ ముంబై మేనేజ్‌మెంట్ అతి త్వరలో పరిష్కరించుకుంటుందని ఆశిస్తున్నా. ఎందుకంటే ముంబై మంచిగా ఆడితే అది ఐపీఎల్‌కు మేలు చేస్తుంది. తద్వార వరల్డ్ క్రికెట్ బాగుంటుంది.'అని క్రిస్ లిన్ చెప్పుకొచ్చాడు. 2014-18 వరకు ఆస్ట్రేలియా తరఫున 4 వన్డేలు, 18 టీ20లు ఆడిన క్రిస్ లిన్.. 2020, 2021 ఐపీఎల్ సీజన్లలో ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు. 2020 టైటిల్ విన్నర్‌గా నిలిచిన ముంబై జట్టులో లిన్ ఓ సభ్యుడు.

ప్లే ఆఫ్స్ నుంచి ఔట్..
వరుసగా 7 మ్యాచ్‌ల్లో ఓడిన రోహిత్ శర్మ ప్లే ఆఫ్స్ రేసు నుంచి 99.99 శాతం తప్పుకుంది. మిగిలిన 7 మ్యాచ్‌ల్లో 7 గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇంత దారుణంగా విఫలమవ్వడం ఇదే తొలిసారి. ముఖ్యంగా ఆ జట్టు బలహీనమైన బౌలింగ్ లైనప్‌తో బాధపడుతుంది. జస్‌ప్రీత్ బుమ్రాకు అండగా మరొక బౌలర్ నిలవడం లేదు. బ్యాటింగ్‌లోనూ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వైఫల్యం దెబ్బతీస్తోంది. ఏదీ ఏమైనా ఈ సీజన్ ముంబైకి చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications