IPL 2022: సీఎస్‌కే X కేకేఆర్ తొలి మ్యాచ్‌తో ధనాధన్ లీగ్ షురూ! మహరాష్ట్ర గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్!

ముంబై: ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఇప్పటికే మార్చి 26 నుంచి మే 29 వరకు లీగ్ నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. గత గురువారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడంతో మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. దాంతో లీగ్ ఫార్మాట్‌ను మార్చాల్సి వచ్చింది. కొత్త ఫార్మాట్‌తో పాటు వేదికలను గవర్నింగ్ కౌన్సిల్ ఖరారు చేసింది. ఆ వివరాలను వెల్లడించింది.

మహారాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్..
తాజాగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) సమక్షంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో బీసీసీఐ సమావేశం నిర్వహించింది. లీగ్ నిర్వహణకు కావాల్సిన అన్ని అనుమతులు, సహాయ సహాకారాల గురించి చర్చించింది. ఐపీఎల్ టీమ్స్ మైదానాలు, హోటల్స్‌కు వెళ్లేటప్పుడు ప్రత్యేక ట్రాఫిక్ లైన్ ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. 'ఐపీఎల్ నిర్వహణ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం బీసీసీఐకి పూర్తి మద్దతుగా ఇస్తుంది. 25 శాతం ప్రేక్షకులను అనుమతించే విషయంపై సీఎం ఉద్దవ్ థాక్రే నిర్ణయం తీసుకుంటారు'అని ఎంసీఏ చైర్మెన్ నర్వేకర్ తెలిపాడు.

కేకేఆర్ X సీఎస్‌కే ఫస్ట్ మ్యాచ్..
ఇక ఫస్ట్ మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే), కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) మధ్య జరగనుంది. ఐపీఎల్ 2021 నిబంధనల ప్రకారం డిఫెండింగ్ చాంపియన్ హోమ్ గ్రౌండ్‌లో ఆరంభ మ్యాచ్ జరగాలి. 2009 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ లెక్కన ఈ సారి కూడా చెన్నై చెపాక్ వేదికగా జరగాల్సింది. కానీ కరోనా కారణంగా ఐపీఎల్ వేదికలను ముంబైలో వాంఖడే, బ్రాబోర్న్, డీవై పాటిల్ స్డేడియంలో 55 లీగ్ మ్యాచ్‌లు.. 15 మ్యాచ్‌లు పుణేలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

టైటిల్స్ ఆధారంగా..
ఐపీఎల్‌లో ఇంతకు ముందు ప్రదర్శనల ఆధారంగా పది జట్లను రెండు గ్రూప్‌లుగా విడదీశారు. గెలిచిన టైటిల్స్, ఫైనల్ చేరిన సందర్భాలను బట్టి ప్రతీ టీమ్‌కు ర్యాంక్ ఇచ్చారు. గ్రూప్‌ఏలో వరుసగా ముంబై ఇండియన్స్(5 టైటిల్స్), కేకేఆర్(2), రాజస్థాన్ (1టైటిల్), ఢిల్లీ(ఒకసారి ఫైనల్), లక్నోలను చేర్చారు. గ్రూప్ బిలో వరుసగా చెన్నై సూపర్ కింగ్స్(4 టైటిల్స్), హైదరాబాద్(1 టైటిల్), బెంగళూరు, పంజాబ్, గుజరాత్‌ను ఉంచారు.

ప్రతీజట్టు రెండేసి మ్యాచ్‌లు..
ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మరో గ్రూప్‌లోని ఒక జట్టుతో (గ్రూప్‌లో అదే స్థానంలో ఉన్న) రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. ఇవి 10 మ్యాచ్‌లు అవుతాయి. మరో గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కలిసి మొత్తం 14 మ్యాచ్‌లు అవుతాయి. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ 'ఎ' గ్రూప్‌లోని నాలుగు టీమ్‌లతో పాటు గ్రూప్ 'బి'లో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో రెండు మ్యాచ్‌లలో తలపడుతుంది. మిగిలిన నాలుగు టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications