IPL 2022: సన్‌రైజర్స్‌హైదరాబాద్‌కు బిగ్ షాక్.. మరో బౌలర్‌కు గాయం!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వేలి గాయంతో వాషింగ్టన్ సుందర్ దూరం కాగా.. తాజాగా మరో బౌలర్ ఆ జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. అయితే ఆ బౌలర్ ఎవరా? అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఏడు మ్యాచ్‌ల్లో ఇప్పటికే ఐదు గెలిచి పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న హైదరాబాద్.. బుధవారం టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.
సుచిత్‌కు గాయమా?
ఈ మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక బౌలర్ సేవలను కోల్పోవడం కలవరపెడుతోంది. సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చి సుచిత్ గాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను సన్‌రైజర్స్ హైదరాబాద్ ధృవీకరించలేదు. ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. కానీ నెట్స్‌లో కెప్టెన్ కెన్ విలియమ్సన్ బౌలింగ్ చేయడం ఈ సందేహాలకు బలం చేకూరుస్తోంది. ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసమే కేన్ మామ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ వేసినా టీమ్‌కు ప్రయోజనం చేకూరుతుందనే ఆలోచనలో కేన్ మామ ఉన్నట్లు అర్థమవుతోంది.

కేన్ మామ బౌలింగ్ ప్రాక్టీస్..
ఇక కేన్ విలియమ్సన్ నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న ఫొటోను సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఎవరన్నారు? కేన్ మామ కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తాడని? అని ప్రశ్నిస్తూ క్యాప్షన్‌గా పేర్కొంది. ఈ ఫొటోపై అభిమానులు ఫన్నీగా స్పందిస్తున్నారు. కేన్ మామ బౌలింగ్ జోలికి పోకుండా బ్యాటింగ్ పైనే ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. ఆ బ్యాటింగే మంచి స్ట్రైక్‌రేట్‌తో చేస్తే సరిపోతుందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.

గుజరాత్‌తో పోరు..
సూపర్ బౌలింగ్‌తో భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆర్‌సీబీని 68 పరుగులకే ఆలౌట్ చేసిన సన్‌రైజర్స్.. ఇతర జట్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమను తక్కువ అంచనా వేస్తే మడతెట్టాస్తామని ఆటతో చూపించింది. ఈ జోరులోనే టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలనుకుంటుంది. అయితే వాషింగ్టన్ సుందర్.. ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications