
మార్చి 25 నుంచి..
కొత్తగా వచ్చిన జట్లతో మ్యాచ్‌ల సంఖ్య 74కి చేరనుంది. దాంతో.. ఈసారి డబుల్ హెడర్స్ మ్యాచ్‌లు కూడా పెంచబోతున్న బీసీసీఐ.. తాజాగా మరో వారం రోజులు అదనంగా స్లాట్‌ని పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాంతో ముందుగా అనుకున్న ఏప్రిల్ 2 నుంచి కాకుండా మార్చి 25 నుంచే ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభంకానుంది. ఐపీఎల్ 2020 సీజన్‌ను పూర్తిగా యూఏఈలో నిర్వహించిన బీసీసీఐ.. ఐపీఎల్ 2021 సీజన్‌లో సగం మ్యాచ్‌ల్ని భారత్‌లో.. మిగిలిన సగం మ్యాచ్‌ల్ని యూఏఈలో నిర్వహించింది.

దుబాయ్ తరహా బబుల్..
అయితే.. ఈసారి యూఏఈ తరహాలో బయో-సెక్యూర్ బబుల్‌ను ఏర్పాటు చేసి.. ముంబైలోనే అన్ని మ్యాచ్‌లూ నిర్వహించాలని భావిస్తున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఎల్ 2020, 2021 సీజన్‌లో యూఏఈలోని అబుదాబి, దుబాయ్, షార్జా స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించగా.. ముంబైలో వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాలు అందుబాటులో ఉన్నాయి. దుబాయ్ తరహా బయో బబుల్‌తో ఈ మూడు మైదానాల్లో లీగ్ పూర్తి చేయాలనుకుంటుంది. టోర్నీ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు ఎక్కువగా ప్రయాణం చేయకుండా ఉండాలనే ఒకే వేదికలో మ్యాచ్‌లు నిర్వహించాలనుకుంటుంది.

గతేడాదిలా కాకుడదనే..
గతేడాది ఆరు నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని ప్లాన్ చేయగా.. అది బెడిసి కొట్టింది. టోర్నీ మధ్యలోనే బబుల్‌లోకి చొచ్చుకొచ్చిన వైరస్ ఆటగాళ్లందరికి సోకింది. దాంతో లీగ్ అర్ధంతరంగా వాయిదా పడి యూఏఈకి తరలిపోయింది. ఈ సారి అలాంటి పరిస్థితి రావద్దనే బీసీసీఐ.. ఒకే వేదికగా లీగ్ మొత్తం నిర్వహించాలనుకుంటుంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా.. వైరస్ సోకడం ఆగడం లేదు.

ఫిబ్రవరిలో మెగావేలం..
ఐపీఎల్ 2020 సీజన్‌లో కొత్తగా రెండు జట్లు రావడంతో మెగా వేలం నిర్వహణ అనివార్యమైంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ పూర్తవ్వగా.. కొత్త జట్లు ముగ్గురేసి ప్లేయర్లను ఎంచుకోవాల్సి ఉంది. అయితే కొత్తగా వచ్చిన లక్నో టీమ్‌కు లైన్ క్లియర్ అవ్వగా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న సీవీసీ క్యాపిటల్‌పై వివాదం నడుస్తోంది. బెట్టింగ్ సంస్థల పెట్టుబడులు ఉన్నాయనే ఆరోపణలతో సీవీసీ టెండర్‌ను బీసీసీఐ హోల్డ్‌లో పెట్టింది. ఇక ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో మెగావేలం నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఇది కూడా వారం పాటు వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications












