IPL 2022: బయో బబుల్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు.. లీగ్ నుంచే గెంటేస్తారు!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తోంది. గత సీజన్ అనుభవం దృష్ట్యా బయో బబుల్ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. గతేడాది భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ కరోనా కేసుల కారణంగా అర్థంతరంగా వాయిదా పడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయర్ వరుణ్ చక్రవర్తీ తొలుత పాజిటీవ్‌గా తేలగా..ఆ తర్వాత కేసులు ఒక్కోక్కటిగా పెరగడంతో లీగ్ మధ్యలోనే ఆగి.. సుదీర్ఘ విరామం తర్వాత దుబాయ్ తరలివెళ్లింది. దాంతో బీసీసీఐకి భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తవద్దని బీసీసీఐ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

పకడ్బందీగా ఏర్పాట్లు..
లీగ్‌ను మహారాష్ట్రకే పరిమితం చేసి అత్యంత పకడ్బందీ బయోబబుల్‌లో టోర్నీని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ నేపథ్యంలోనే బయోబబుల్ బ్రేక్ చేసే ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు, టీమ్ అఫిషియల్స్ పై కఠిన చర్యలు తీసుకోనుంది. ఓ ఆటగాడు లేదా మ్యాచ్ అఫిషియల్ తొలిసారి బబుల్ నిబంధనలు అతిక్రమిస్తే అతన్ని మరోసారి ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు ఈ టైమ్‌లో మిస్సైన మ్యాచ్‌లకు చెల్లించాల్సిన డబ్బులను కోత పెట్టనుంది. రెండోసారి చేస్తే ఏడు రోజుల క్వారంటైన్ అనంతరం ఒక మ్యాచ్ నిషేధించడంతో పాటు ఆ సమయంలో మిస్సైన మ్యాచ్‌లకు డబ్బులు చెల్లించరు.

బబుల్ బ్రేక్ చేస్తే గెంటేయడమే..
మూడో సారి బ్రేక్ చేస్తే మెడపట్టి లీగ్ నుంచి తరిమేయనున్నారు. అంతేకాకుండా ఆ ఆటగాడికి రిప్లేస్ మెంట్ ఇవ్వరు. ప్లేయర్ లేదా అఫిషియల్ కుటుంబ సభ్యులు బ్రేక్ చేస్తే తొలిసారి వారితో పాటు సదరు ప్లేయర్/అఫిషియల్‌ను ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉంచుతారు. ఈ సమయంలో ఆటగాడు మిస్సైన మ్యాచ్‌లకు డబ్బులు చెల్లించరు.

ఫ్యామిలీ మెంబర్స్ సైతం..
రెండోసారి బ్రేక్ చేస్తే సదరు కుటుంబ సభ్యుడిని బబుల్ నుంచి గెంటేస్తారు. సదరు ప్లేయర్‌ను మాత్రం ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉంచుతారు. ఆ సమయంలో మిస్సైన మ్యాచ్‌లకు డబ్బులు ఇవ్వరు. ఏదైనా జట్టు మ్యాచ్‌కు ముందు కరోనా బారిన పడితే.. ఆ రోజు మ్యాచ్‌లో దిగేందుకు 11 మంది సరైన ఆటగాళ్లు లేకపోతే మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేస్తారు. ఒకవేళ అది కూడా సాధ్యంకాని పరిస్థితుల్లో ఆ విషయాన్ని ఐపీఎల్ టెక్నికల్ టీమ్ దృష్టికి తీసుకెళ్తారు. వాళ్లు తీసుకునే నిర్ణయమే అంతిమం.

జట్టుకు కోటీ రూపాయాల జరిమానా..
బయట వ్యక్తులను బయోబబుల్‌లోకి తీసుకువచ్చి.. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌తో అంటకాగినా.. భద్రతా నిబంధనలు పాటించకపోయినా.. సదరు వ్యక్తులను ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉంచుతారు. ఈ తప్పిదానికి కారణమైన జట్టుకు రూ. కోటిరూపాయల జరిమానా విధిస్తారు. రెండో సారి చేస్తే జరిమానాతో పాటు టీమ్ గెలిచిన పాయింట్స్ నుంచి ఒక పాయింట్ తీసేస్తారు. మూడో సారి అయితే రెండు పాయింట్లు కోత విధిస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications