
కెరీర్ బెస్ట్ బౌలింగ్..
ఈ మ్యాచ్‌లో ఆవేష్ ఖాన్ తన నాలుగు ఓవర్ల కోటాలో.. 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఆవేష్ తన ఐపీఎల్ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ సూపర్ పెర్పామెన్స్‌తో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించిన ఆవేశ్ ఖాన్‌కు మ్యాన్ ఆఫది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే ఈ అవార్డును అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లికి అవేష్ ఖాన్ అంకితం చేసాడు. మ్యాచ్ అనంతరం సహచర ఆటగాడైన దీపక్ హుడాతో కలిసి ఆవేశ్ ఖాన్ చిట్ చాట్ చేశాడు.

అమ్మకు అంకితం..
ఈ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను ఎవరికి అంకితంచేస్తావు? అని హుడా ప్రశ్నించగా.. ఈ విధంగా బుదులిచ్చాడు. 'నాకు దక్కిన ఈ అవార్డును ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మా అమ్మకు అంకితం చేయాలనుకుంటున్నా. ఆమె నాకు చాలా సపోర్ట్‌గా ఉండేది. మ్యాచ్ ముగిసిన తర్వాత, నేను మా అమ్మతో వీడియో కాల్‌లో మాట్లాడాను. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విషయాలను ఆమెతో చెప్పాను. ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శన పట్ల ఆమె సంతోషించింది. దేవుని దయతో, ఆమె ఇప్పుడు క్షేమంగా ఉంది.'అని ఆవేష్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

పేలవ బ్యాటింగ్‌తో..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (50 బంతుల్లో 68; 6 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ హుడా (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్, రొమారియో షెఫెర్డ్ రెండేసి వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులే చేయగల్గింది. రాహుల్ త్రిపాఠి (30 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అవేశ్ ఖాన్ (4/24), హోల్డర్ (3/34) లక్నో సూపర్‌జెయింట్స్‌ను గెలిపించారు.


Click it and Unblock the Notifications
