
దీపక్ కోసం తీవ్ర పోటీ..
ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా పేస్ బౌలర్ దీపక్ చాహర్‌ను కొనుగోలు చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్‌తో సహా అన్ని ఫ్రాంఛైజీలు ఆసక్తి కనబరుస్తాయని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 'దీపక్ చాహర్ కొత్త బంతితో రెగ్యులర్‌గా వికెట్లు పడగొడతాడు. అతనిలా మరే భారత బౌలర్ కూడా అంత నిలకడగా వికెట్లు తీయలేడు. తొలి మూడు ఓవర్లలో అతడే కీలక బౌలర్‌గా నిలుస్తాడు. పవర్‌ప్లేలో బౌలింగ్ చేసి పలు వికెట్లు తీస్తాడు. ప్రత్యర్థుల వెన్నువిరుస్తాడు.

బ్యాటింగ్ కూడా...
అయితే, అతను డెత్ ఓవర్లలో అత్యంత స్పెషలిస్టు అని చెప్పలేం కానీ.. అందుకు తగ్గట్లు ప్రయత్నిస్తాడు. దీంతో ఈసారి వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా అతన్ని తీసుకొనేందుకు ఆసక్తి చూపుతుంది. అలాగే అన్ని జట్లూ చాహర్‌పై కన్నేస్తాయి. ఇటీవల అతడు బ్యాటింగ్‌లోనూ పరుగులు చేస్తున్నాడు. దీంతో కచ్చితంగా మంచి ధర పలికే అవకాశమే ఉంది' అని చోప్రా చెప్పుకొచ్చాడు. చాహర్ 2018లో తొలిసారి సీఎస్‌కేకు ఎంపికవ్వగా అప్పటి నుంచి ఆ జట్టులో కీలక బౌలర్‌గా రాణించాడు. నాలుగు సీజన్లలో మొత్తం 63 మ్యాచ్‌లు ఆడిన దీపక్.. 58 వికెట్లు పడగొట్టి కెప్టెన్ ధోనీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

నాలుగు సీజన్లుగా..
2018 మెగా వేలంలో రూ.80 లక్షలకే అతన్ని తీసుకున్న చెన్నై.. అతన్ని మేటీ పేసర్‌గా తయారు చేసింది. ముఖ్యంగా ధోనీ అతన్ని స్టార్ ప్లేయర్‌గా తీర్చిదిద్దాడు. రిటెన్షన్ రూల్స్ ప్రకారం గరిష్టంగా నలుగురిని మాత్రమే తీసుకునే అవకాశం ఉండటంతో చెన్నై సూపర్ కింగ్స్ దీపక్ చాహర్‌ను వదిలేసింది. ధోనీ, జడేజా, రుతురాజ్‌తో పాటు మొయిన్ అలీని తమ వద్దే ఉంచుకుంది. దీంతో చాహర్ వేలంలోకి రాక తప్పలేదు. దాంతో రూ. 2 కోట్ల కనీస ధరతో దీపక్ చాహర్ వేలానికి అందుబాటులోకి వచ్చాడు.

రూ. 10 కోట్లు పలికే చాన్స్..
ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో చాహర్ హాఫ్ సెంచరీ సాధించగా గతేడాది శ్రీలంక పర్యటనలోనూ ఒక హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో అతను బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆటగాడిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. దాంతో ప్రతీ ఫ్రాంచైజీ అతన్ని తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంది. దీపక్ చాహర్‌ను మళ్లీ తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నించే అవకాశం ఉంది. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ సైతం చాహర్ కోసం పోటీపడనుంది. వాంఖడేలో అతనికి మంచి రికార్డు ఉన్న నేపథ్యంలో ముంబై అతనిపై కన్నేసింది. ఈ క్రమంలోనే అతను సులువుగా రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పలికే చాన్సుంది.


Click it and Unblock the Notifications












