IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి అంబటి రాయుడు.. ధర ఎంతంటే?

హైదరాబాద్: ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం దగ్గర పడుతున్నాకొద్దీ అభిమానుల్లో ఆసక్తి మరింత రెట్టింపు అవుతోంది. లీగ్‌లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇవ్వడంతో మెగా ఆక్షన్ అనివార్యమైంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియను ముగించిన బీసీసీఐ.. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ క్రమంలోనే కొత్త జట్లు శుక్రవారం తమ డ్రాఫ్ట్ జాబితాలను కూడా ప్రకటించాయి. ఇక వేలానికి సమయం దగ్గరపడుతున్న వేళ ఆయా ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. ఏయే ఆటగాళ్లను తీసుకోవాలి.. ఎంత వరకు ధర వెచ్చించాలనే వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి.

రాయుడు కోసం..
ఇక గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ సారి సత్తా చాటాలనే లక్ష్యంతో సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే మెగా వేలంలో పకడ్బందీ ప్రణాళికలు అమలు చేయాలని భావిస్తోంది. గత నాలుగు, ఐదు సీజన్లుగా ఇండియా స్టార్ ఆటగాళ్లు లేక ఫారినర్స్‌పై పూర్తిగా ఆధారపడిన హైదరాబాద్.. ఈ సారి ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని భావిస్తుంది. ఫారినర్స్‌తో పాటు దేశీయ ఆటగాళ్లను తీసుకోవాలని యోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు తేజం, టీమిండియా వెటరన్ క్రికెటర్ అంబటి రాయుడిని వేలంలో తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

మిడిలార్డర్ బలంగా మార్చేందుకు..
గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన అంబటి రాయుడికి ధనాధన్ లీగ్‌లో మెరుగైన రికార్డు ఉంది. ముఖ్యంగా మిడిలార్డర్‌లో సత్తా చాటే బ్యాట్స్‌మన్ అతను. టీమ్ భవిష్యత్తు దృష్ట్యా చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని వదులుకోగా.. రూ. 2 కోట్ల కనీస ధరతో రాయుడు వేలానికి అందుబాటులోకి వచ్చాడు. మంచి అనుభవం ఉన్న రాయుడు జట్టులో ఉంటే బాగుంటుందని సన్‌రైజర్స్ యాజమాన్యం భావిస్తోందని ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి తెలిపాడు. ‘జట్టులో మిడిలార్డర్‌ను బలంగా మార్చాలంటే అది రాయుడితో సాధ్యమవుతుందని టీమ్‌మేనేజ్‌మెంట్ బలంగా భావిస్తోంది.
అందుకే వేలంలో ధావన్‌ను కోనుగోలు చేయడానికి ఉన్న అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దనే యోచనలో ఉంది. పైగా తెలుగు క్రికెటర్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అపవాదును కూడా చెరిపేసుకోవచ్చు.'అని సదరు అధికారి తెలిపాడు.

ధర ఎంతంటే?
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం వేలంలో అంబటి రాయుడు రూ.2 కోట్ల రూపాయల కనీస ధరతో వేలానికి అందుబాటులో ఉన్నాడు. ఈ లెక్కన అతనికి రూ.2 నుంచి 3 కోట్ల రూపాయల ధర పలికే అవకాశం ఉంది. ఎందుకంటే అతని కెరీర్ చివరి దశలో ఉండటం, ఐపీఎల్ మినహా పెద్ద టోర్నీల్లో ఆడకపోవడంతో ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తికనబర్చకపోవచ్చు. దేశవాళీ టోర్నీల్లో ఆంధ్ర టీమ్ తరఫున బరిలోకి దిగిన రాయుడు స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా ఇవ్వలేదు. అయితే 10 ఫ్రాంచైజీలు పోటీపడనున్న నేపథ్యంలో అతని అనుభవానికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం రూ. 3 కోట్ల వరకు ధరపలికే చాన్స్ ఉంది. సన్‌రైజర్స్ కూడా రూ. 3 కోట్ల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటే తీసుకునే చాన్స్ ఉంది.

2010 నుంచి..
2010 నుంచి ఐపీఎల్ ఆడుతున్న అంబటి రాయుడు ఇప్పటి వరకు 175 మ్యాచ్‌ల్లో 29.44 సగటుతో 3916 పరుగులు చేశాడు. ఇందులో 21 హాఫ్ సెంచరీలతో పాటు ఓ సెంచరీ ఉంది. గత సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన రాయుడు 2 హాఫ్ సెంచరీలతో 257 రన్సే చేశాడు. 2010 నుంచి 2017 వరకు ముంబై ఇండియన్స్ ఆడిన రాయుడు.. 2018 మెగా వేలంలో రూ.2.20 లక్షల ధరకు చెన్నై సూపర్ కింగ్స కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో దుమ్మురేపిన రాయుడు.. 16 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో 602 పరుగులు చేసి జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications