
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో నిలకడలేమి బ్యాటింగ్‌తో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. డేగ పక్షిలా సింగిల్ హ్యాండ్‌తో అతను అందుకున్న క్యాచ్.. ఐపీఎల్ చరిత్రలోనే ఓ గొప్ప క్యాచ్‌గా నిలిచిపోయింది. రాయుడు స్టన్నింగ్ క్యాచ్‌తో ఆర్‌సీబీ బ్యాటర్ ఆకాశ్ దీప్ బిత్తరపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. తెలుగు తేజంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా రవీంద్ర జడేజా వేసిన 16వ ఓవర్ నాలుగో బంతిని అప్పుడే క్రీజులోకి వచ్చిన ఆకాశ్ దీప్ సిల్లీ మిడాఫ్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి గాల్లోకి లేవగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అంబటి రాయుడు తన కుడివైపుకు డైవ్ చేస్తూ.. గాల్లో ఒంటి చేత్తో అద్భుత క్యాచ్‌ను అందుకున్నాడు. రాయుడు స్టన్నింగ్ క్యాచ్‌కు మైదానంలోని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు, కామెంటేటర్లు అవాక్కయ్యారు. వాటే సెన్సేషనల్ క్యాచ్ అంటూ కామెంటేటర్లు రాయుడిపై పొగడ్తల వర్షం కురిపించారు.
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగులతో తొలి విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. శివమ్ దూబె ( 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 నాటౌట్), రాబిన్ ఉతప్ప ( 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 88) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. అనంతరం బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసింది.
షాబాజ్ అహ్మద్( 27 బంతుల్లో 4 ఫోర్లతో 41), సూయాశ్ ప్రభుదేశాయ్ ( 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34), దినేశ్ కార్తీక్ ( 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) రాణించారు. ఛేదనలో చకచకా నాలుగు వికెట్లు పడ్డా బెంగళూరు పోరాడింది. తీక్షణ (4/33), జడేజా (3/39) బెంగళూరును దెబ్బతీశారు.