For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022 మెగా వేలం.. 11 మందికే రూ. 126 కోట్లు! హద్దులు ధాటిన చెన్నై, ముంబై!

IPL 2022: All you need to know about the 2-day mega auction highlights

బెంగళూరు: క్రికెట్ మ్యాచ్‌ల మాదిరి ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం కూడా అసలు సిసలు మజాను పంచింది. 600 మంది పోటీదారుల్లో 204 మందికే అవకాశం‌‌‌ దక్కింది. మొత్తంగా 10 ఫ్రాంచైజీలు రూ. 550 కోట్లు ఖర్చు చేస్తే.. ఇందులో రూ. 126 కోట్లు కేవలం 11 మందిపైనే కుమ్మరించాయి. ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌లో 28 మంది ఆటగాళ్లు కోటీశ్వరులయ్యారు. గతానికి భిన్నంగా సాగిన ఈ వేలంలో కొందరు ఊహించని ధర పలికితే.. స్టార్లు అనుకున్న వాళ్లలో చాలా మంది అన్‌‌‌‌సోల్డ్‌ జాబితాలో చేరారు. మధ్యలో కుర్రాళ్లు లాభపడినా.. విదేశీ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు చేశాయి.

 11 మందికి రూ.10 కోట్లకు పైగా..

11 మందికి రూ.10 కోట్లకు పైగా..

ఈ వేలంలో గతానికి భిన్నంగా 11 మంది ప్లేయర్లు రూ. 10 కోట్లకు పైగానే ధర పలికారు. ఐపీఎల్‌‌‌‌ ఆక్షన్​ హిస్టరీలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అందులో భారత ఆటగాళ్లు‌‌‌ ఏడుగురు ఉండటం విశేషం. ఈ జాబితా​లో ఇద్దరు పాత ప్లేయర్లను తిరిగి రిటైన్‌‌‌‌ చేసుకోవడానికి రెండు ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు చేశాయి. ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ కోసం ముంబై రూ. 15.25 కోట్లు చెల్లిస్తే, దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌కు చెన్నై రూ. 14 కోట్లు వెచ్చించింది. ఇక ఇంగ్లిష్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ లియామ్‌‌‌‌ లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ కోసం పంజాబ్‌‌‌‌ రూ. 11.50 కోట్లు పెట్టడం మరో సర్​ప్రైజ్​.

వారికి 2000 శాతం పెరిగింది...

వారికి 2000 శాతం పెరిగింది...

ఈ ఆక్షన్‌‌‌‌లో ఐదుగురు ప్లేయర్ల రేటు గత సీజన్‌‌‌‌తో పోలిస్తే 2000 శాతం కంటే ఎక్కువ పెరిగింది. అందులో నలుగురు 2021లో ఆర్‌‌‌‌సీబీకే ఆడిన వాళ్లు కావడం విశేషం. అందులో ఇద్దరైన హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌, వానిందు హసరంగ ఈసారి కూడా ఆ టీమ్‌‌‌‌కే సెలెక్ట్‌‌‌‌ అయ్యారు. గతేడాది కేవలం 20 లక్షలకే తీసుకున్న హర్షల్‌‌‌‌ కోసం ఆర్‌‌‌‌సీబీ ఈసారి ఏకంగా 10.75 కోట్లు పెట్టింది. పోయినేడాది కంటే హర్షల్‌‌‌‌ సాలరీ ఏకంగా 53.75 రెట్లు పెరిగింది. అదే టైమ్‌‌‌‌లో మరో పేసర్‌‌‌‌ ప్రసిధ్‌‌‌‌ కృష్ణ రేటు దాదాపు 50 రెట్లు పెరిగింది. 2018లో 20 లక్షల బేస్‌‌‌‌ప్రైస్​తో అతడిని కోల్‌‌‌‌కతా తమ టీమ్‌‌‌‌లోకి తీసుకోగా.. రాజస్తాన్‌‌‌‌ ఈసారి పది కోట్లు ముట్టజెప్పింది.

 హద్దులు దాటిన చెన్నై, ముంబై

హద్దులు దాటిన చెన్నై, ముంబై

ఈ వేలంలో మరో హైలెట్‌‌‌‌... చెన్నై సూపర్‌‌‌‌కింగ్స్‌‌‌‌ తన ఫైనాన్షియల్‌‌‌‌ రూల్స్‌‌‌‌ను ఈసారి పక్కనబెట్టింది. ప్రతి ప్లేయర్‌‌‌‌ను పక్కా లెక్కతో కొనుగోలు చేసే సీఎస్‌‌‌‌కే.. దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌ (రూ. 14 కోట్లు) విషయంలో కోట్లు కుమ్మరించింది. సింగిల్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ కోసం చెన్నై డబ్బుల గీత దాటడం ఇదే మొదటిసారి. దీంతో మెగా లీగ్‌‌‌‌లో చహర్‌‌‌‌ హయ్యెస్ట్‌‌‌‌ పెయిడ్‌‌‌‌ ఇండియన్‌‌‌‌ బౌలర్‌‌‌‌గా రికార్డులకెక్కాడు. దీంతో పాటు తమ కెప్టెన్​ ధోనీ కంటే రెండు కోట్లు ఎక్కువగానే తీసుకోవడం మరో విశేషం. చెన్నై దారిలోనే ముంబై ఇండియన్స్‌‌‌‌ కూడా ఒక్క ప్లేయర్‌‌‌‌ (ఇషాన్​ కోసం 15.25 కోట్లు) కు తొలిసారి రూ. 10 కోట్లకు పైగా బిడ్‌‌‌‌ వేయడం ఆ టీమ్​ హిస్టరీలోనే ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌. ఐదుసార్లు టీమ్‌‌‌‌ను చాంపియన్‌‌‌‌గా నిలిపిన రోహిత్‌‌‌‌కు రూ. 16 కోట్లే ఇస్తున్నారు. అలాగే, ఇషాన్‌‌‌‌, ఆర్చర్​, టిమ్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ కోసమే ఏకంగా 31.75 కోట్లు ఖర్చు చేసింది. మిగతా 18 మంది కోసం 16.40 కోట్లు ఖర్చు పెట్టింది. టీమ్‌‌‌‌లోకి 11 మంది అన్‌‌‌‌క్యాప్డ్​ ప్లేయర్లను తీసుకుంది.

IPL Auction 2022 : Chennai Super Kings Complete Squad For IPL 2022 | Oneindia Telugu
అవేశ్‌‌కు‌‌‌ రికార్డు ధర..

అవేశ్‌‌కు‌‌‌ రికార్డు ధర..

గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు‌‌ వేసే పేసర్‌‌‌‌ అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌కు లక్నో సూపర్‌‌‌‌జెయింట్స్‌‌‌‌ రూ. 10 కోట్లు పెట్టడం సరికొత్త రికార్డు. ఐపీఎల్‌‌‌‌ చరిత్రలో ఓ అన్‌‌‌‌క్యాప్డ్​ ప్లేయర్‌‌‌‌కు ఇంత పెద్ద మొత్తం పెట్టడం ఇదే తొలిసారి‌‌‌. అవేశ్​ ఖాన్ బేస్‌‌‌‌ప్రైస్‌‌‌‌ రూ. 20 లక్షలు. 2017లో ఐపీఎల్‌‌‌‌ అరంగేట్రం చేసిన అవేశ్‌‌‌‌ ఓవరాల్​గా 25 మ్యాచ్​ల్లో 29 వికెట్లు తీశాడు.

Story first published: Tuesday, February 15, 2022, 14:09 [IST]
Other articles published on Feb 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+